పోస్ట్‌లు

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

ఆకలి.. అందం.. అదే వాళై ( Vaazhai )

చిత్రం
  వాళై సినిమాలో అందమైన బాల్యం కనిపిస్తుంది. విరబూసిన ప్రకృతి కనిపిస్తుంది. కల్మషం లేని స్నేహం కనిపిస్తుంది. రాలిపడే మంచు బిందువులు, ఎగిరే సీతాకోకచిలుకుల ప్రేమ సందేశం కనిపిస్తుంది. బాల్యం తాలూకూ తీపి జ్ఞాపకాలు ప్రతి ఫ్రేములోనూ మనల్ని కట్టిపడేస్తాయి. కానీ, నాకెందుకో ఈ సినిమాలో అందం కన్నా ఆకలి కనిపించింది. పొయ్యి మీద పొగలుకక్కుతూ ఉడికే అన్నంకుండ నా గుండెను కదిలించింది. గుండెలు పగిలే వేదనలో కూడా ఓ ముద్దబువ్వ నోట్లో పెట్టుకునే సన్నివేశం నా కంట కన్నీరు తెప్పించింది. ఈ సినిమాలో అందరూ అందాన్ని చూస్తుంటే నాకెందుకో ఆకలి, బాధలు, పేదలు కనిపించారు. నాణానికి రెండు వైపులా ఉన్నట్టు, అందాన్ని - ఆకలిని సమంగా చూపించిన గొప్ప ప్రతిభాశాలి మారి సెల్వరాజ్. పేదల బ్రతుకుల్లో ప్రమాదాలు లేనిదెక్కడ, ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు పడే బాధలు కత్తిమీద సామే కదా. ఆకలితో కలిసి పెరిగిన వారికే ఆకలి అంటే ఓ వేదన అని తెలుస్తుంది. వేడివేడి అన్నాన్ని చూస్తే వారి మనసు ఉప్పొంగుతుంది. ఆకలితో ముడిపడిన ఈ విషాద సంతోషాలు కొందరికే కనిపిస్తాయి. వీటిని చూడాలంటే జీవితానుభవం కావాలి. బహుశా మారి సల్వరాజ్ కి ఇలాంటి జీవితానుభవాలు ఉండే ఉంటాయి...

నజరయ్య మతం

చిత్రం
నూతన మతతత్వ సిద్ధాంతాలతో కూడిన 'నజరయ్య మతం' రెండు వందల ఏళ్ల క్రితం నాటిది. ఆనాటి కాలంలో అణగారిన వర్గాలను ఆకర్షించిన మతాల్లో నజరయ్య మతం ఒకటి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని త్రిపురాంతకం, నరసరావుపేట, బాపట్ల వంటి కొన్ని ప్రాంతాలకే ఈ మతం పరిమితం కావడంతో కొద్ది కాలంలోనే నజరయ్య మత సిద్ధాంత భావనలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఆనాటి సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలు ప్రత్యామ్నాయ మతాల వైపు చూస్తున్న కాలంలో నజరయ్య మతం వారికి కొంత ఊరటనిచ్చింది. 1890కి ముందు ఒంగోలు కేంద్రంగా నడిచిన మిషనరీలో ఎమ్మా రోషాంబు క్లౌ ఉన్నారు. ఆమె గొప్ప పరిశోధకురాలు. రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యురాలు. ఆ రోజుల్లోనే స్త్రీల హక్కులు, సమస్యల గురించి పుస్తకాలు రాశారు. ఆమె రాసిన ' While Sewing Sandals or Tales of a Telugu Pariah Tribe ' అనే పుస్తకం 1899లో ప్రచురితమైంది. ఈ పుస్తకాన్ని "చెప్పులు కుడుతూ కుడుతూ" అనే పేరుతో వివిన మూర్తి 2009లో తెలుగులో అనువదించారు. ఎమ్మా రోషాంబు క్లౌ ఆనాటి అనగారిన వర్గాల ప్రజలతో కలిసి జీవిస్తూ వారి జీవన, సాంస్కృతిక పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో...

డి.ఎల్.నోటిఫికేషన్ విడుదల

చిత్రం
డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 240 డిగ్రీ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తారీకు లోపు ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వెబ్ నోట్ లో పొందుపరిచారు .

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

చిత్రం
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 47 జూనియర్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20వ తారీకు లోపు ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్/ మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పొందుపరిచారు. పూర్తి నోటిఫికేషన్ :

డీవైఈవో నోటిఫికేషన్ విడుదల

చిత్రం
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జోన్ 1 లో 7, జోన్ 2 లో 12, జోన్ 3 లో 8, జోన్ 4 లో 11 మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. జనవరి 9 నుంచి 29 వరకు ఇరవై రోజులపాటు ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి నోటిఫికేషన్  

అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా

చిత్రం
ఈనెల 18 నుంచి జరగాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో వెబ్ నోట్ పొందుపరిచారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నద్దమైంది. నోటిఫికేషన్లోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియపరచనున్నట్లు పేర్కొంది.

గ్రూప్ - 2 నోటిఫికేషన్ విడుదల

చిత్రం
గ్రూప్ - 2 ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 897 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందులో మునిసిపల్ కమిషనర్ ( గ్రేడ్ 2), సబ్ రిజిస్టర్ ఆఫీసర్ (గ్రేడ్ 2), డిప్యూటీ తాసిల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 331 ఉండగా 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు జరిగేనా.. ?

చిత్రం
అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం అభ్యర్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటిస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జనువరి 5 వరకు వివిధ సబ్జెక్టుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ షెడ్యుల్ ప్రకారం పరీక్షలు జరిగేనా అనే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 27తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల తర్వాత నవంబర్ 30న పరీక్షకు అర్హులైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 8న తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీని ప్రకారం డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే, నోటిఫికేషన్ లోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ అభ్యర్థులు కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వివిధ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిలిచిపోయింది. ...

స్క్రీనింగ్ పరీక్ష తరువాత..

చిత్రం
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకానికి డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో తాత్కాలిక పరీక్షల తేదీలను పొందుపరుస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. డిసెంబర్ 18 నుంచి సుమారు 20 రోజులపాటు వివిధ సబ్జెక్టులలో స్క్రీనింగ్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న చర్చను పక్కన పెడితే, స్క్రీనింగ్ పరీక్షలు ముగిసిన తరువాత ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాల్సిన విషయం. 2018లో.. 2018లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలను ఒకసారి పరిశీలిస్తే.. 2018 జనువరి చివరి వారంలో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించింది. తదనంతరం రెస్పాన్స్ షీట్స్ తో పాటు ప్రాథమిక కీ విడుదల చేసారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది కీ విడుదల చేసి, ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ఫలితాల జాబితాలో సబ్జెక్టుల వారిగా ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాశ...

పీహెచ్.డీ. అడ్మిషన్ నోటిఫికేషన్

చిత్రం
  సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2023 - 24 విద్యాసంవత్సరానికి పీహెచ్.డీ. అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 6 విభాగాలలో మొత్తం 33 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ విద్యార్థుల కోసం 21, ఇన్ సర్వీసు అభ్యర్థుల కోసం 12 సీట్లు కేటాయించారు. తెలుగు విభాగంలో రెగ్యులర్ విద్యార్థులకు 1 , ఇన్ సర్వీస్ అభ్యర్థుల కోసం 1 సీటు అందుబాటులో ఉంది.  ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 22 చివరి తేదీ.

డిసెంబర్ లో డి.ఎల్. నోటిఫికేషన్ ?

చిత్రం
  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని లెక్చరర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుమతులు లభించినప్పటికీ కొన్ని కారణాలవల్ల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆలస్యమైనట్లు సమాచారం. గతంలో విడుదలైన మూడు నోటిఫికేషన్లనూ పరిశీలిస్తే.. మూడు నోటిఫికేషన్లు డిసెంబర్ చివరి వారంలోనే విడుదల కావడం విశేషం. 2011 డి.ఎల్. నోటిఫికేషన్ డిసెంబర్ 29న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో 27 తెలుగు లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. 2016 నోటిఫికేషన్ డిసెంబర్ 27న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 తెలుగు లెక్చరర్ పోస్టులు భర్తీ జరిగాయి. అలాగే, 2018 డి.ఎల్ నోటిఫికేషన్ కూడా డిసెంబర్ 31న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం 5 తెలుగు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. యాదృచ్ఛికమైనప్పటికీ గత మూడు నోటిఫికేషన్లు డిసెంబర్ చివరి వారంలో విడుదలవడం గమనించవచ్చు. 2023 డి.ఎల్ నోటిఫికేషన్ నవంబర్లో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదని సమాచారం. గడిచిన నోటిఫికేషన్ల బాటలోనే 2023 డీఎల్ నోటిఫికేషన్ కూడా డిసెంబర్ చివరి వారాల్లో విడుదలైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 నోటిఫ...

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

చిత్రం
  రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలను డిసెంబర్ 18 నుంచి 23 వరకు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. డిసెంబర్ 18 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో నోట్ పొందుపరిచారు.. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ కోసం... https://psc.ap.gov.in/(S(vvtzfph5mzcxrqtzpi1xcgps))/Default.aspx

2012 డి.ఎల్. తెలుగు ప్రశ్నాపత్రం

చిత్రం
ప్ర భుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి 2011 డిసెంబర్ లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ (43/2011) జారీ చేసింది. తెలుగు విభాగంలోని 27 ఖాళీలకు  2012లో జరిగిన పరీక్షా పత్రం...

స్క్రీనింగ్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు..?

చిత్రం
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకే, విశ్వవిద్యాలయాల్లో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్డంకులన్నీ దాటుకుని విజయవంతంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యాశాఖలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలకు ప్రస్తుత ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపించిన విషయం తెలిసిందే. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఉన్నత పాఠశాలల్లో అప్ గ్రేడ్ వంటి సమస్యలను పరిష్కరించింది. ఇదే కోవలోనే విశ్వవిద్యాలయాలలో ఎన్నో ఏళ్ళుగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నెల 27తో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఇక, స్క్రీనింగ్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు అనేదే అభ్యర్థుల ముందు ఉన్న పెద్ద ప్రశ్న ? గత నోటిఫికేషన్ (2018) పరిశీలిస్తే స్క్రీనింగ్ పరీక్ష గురించి ఓ అవగాహనకు రావచ్చు. 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు, 2017 డిసెంబర్ చివరి వారం నుంచి 2018 జనవరి మొదటి...