పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

#HOME ( సినిమా రివ్యూ )

చిత్రం
చాలా కాలం తర్వాత, కాస్తంత రిలాక్స్ కోసం ఏదైనా సినిమా చూడాలనిపించింది. టీవీ రిమోట్ తీసుకొని, నదీ ప్రవాహంలో ఓ మంచి చేప కోసం వెతుకుతున్నంత ఓపిగ్గా OTT ని వడపోస్తుండగా, నా చూపు ఓ మలయాళ చిత్రంపై పడి ఆగింది. ఆ సినిమా పేరు #HOME (హోమ్). 2021 ఆగస్టు 19న మలయాళంలో విడుదలైంది. IMDb రేటింగ్ చూసేసరికి నా కళ్లు నక్షత్రాల్లా వెలిగిపోయాయి. మొదటి నుంచి నాకు తమిళ, మలయాళ చిత్రాలంటే చెవి కోసుకునేంత ఇష్టం. మన సీరియల్ల ప్రభావమో, ఏమో కానీ తెలుగు సినిమాలు నా దృష్టిని అంతగా ఆకర్షించవు. నేను చూడాలకున్న హోమ్ సినిమా తెలుగు అనువాదంలో కూడా ఉండడంతో, నా చేతిలోని రిమోట్ ఆటోమేటిక్ గా ప్లే అయింది. ఇంటిల్లిపాదీ నిశబ్దంగా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. 2 గంటలా 38 నిమిషాల సినిమా. ఇంత పెద్ద సినిమాని సింగిల్ సిట్టింగ్ లో చూడలేం కాబట్టి, రెండు భాగాలుగా రెండు రోజులు చూద్దాంలే అనుకున్నాం. హాల్లో లైట్లు ఆరిపోయాయి. సినిమా ప్రారంభమైంది. ప్రశాంతమైన వాతావణం. చల్లటి గాలి. చెవులకింపైన సినిమా సంగీతం. కొద్ది నిమిషాల్లోనే ఆ మలయాళ సినిమాలో అందరం లినమైపోయాం. రెండున్నర గంటల సినిమా రెండు నిమిషాల్లా కరిగిపోయింది. సినిమా మధ్యలో పాప్ కార్న్, టీ ల...