పోస్ట్‌లు

జులై, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

తెలుగు తెరకు చిక్కిన రత్నం వేణు ఊడుగుల

చిత్రం
విప్లవ చిత్రంలో ఎర్రటి రక్తం కనిపించాలి కానీ, కృష్ణశాస్త్రి పాట వినిపించడమేంటి ? ఎక్కడో పండువెన్నెల్లో, పారే సెలయేటి ఒడ్డున, ఊహాప్రేయసి ఊర్వశి ఊహల్లో తరించే కృష్ణశాస్త్రికి గెరిల్లా పోరాటంతో పనేంటి ? ఊపిరికీ, ఊపిరికీ మధ్య, ఊపిరిసలపని నక్సల్బరీ పోరాటంలో... " ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను " అంటూ కృష్ణశాస్త్రి కవిత్వం కనిపించడమేంటి ? ఎక్కడి కార్ల్ మార్క్స్, ఎక్కడి కృష్ణశాస్త్రి ? ఎక్కడి మావో, ఎక్కడి ఆంధ్రా షెల్లి ? ఒకరు విప్లవోద్యమ సృష్టికర్తలైతే మరొకరు భావకవిత్వ పితామహులు. వీరిద్దరినీ కలిపి తెలుగు తెర మీద ఓ చోట కూర్చుండబెట్టడమంటేనే ఊహకందని అసాధ్యం. అలాంటి ఊహాతీత ప్రయోగం చేయాలంటేనే ఎంతో సాహసం, దైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగాన్నే విరాటపర్వం సినిమా ద్వారా యువ దర్శకుడు వేణు ఊడుగుల చేశాడు. నలభై ఏళ్ళు కుడా నిండని ఈ యువ దర్శకుడు వేణు ఇప్పుడు తెలుగు తెరకు చిక్కిన రత్నం. తెలుగు సాహితీ ప్రియులకు ఓ మంచి కవిగా వేణు సుపరిచితుడు. వేణు కవి మాత్రమే కాదు, రచయిత, భావకుడు, తాత్వికుడు, బహుజన ప్రేమికుడు కూడానూ. ప్రజా ఉద్యమాలను అర్థం చేసుకున్న నేటి తరం సాహిత్య ప్రతినిధి. అంద...

మన విను' కొండ పండుగ '

చిత్రం
వానాకాలం మొదలై అప్పుడే నెల రోజులు గడిచిపోయింది. ఎటు చూసినా పచ్చటి వాతావరణం. అది, శ్రావణమాసం ముగిసి ఆషాడమాసం ప్రారంభమయ్యే తొలి రోజు. తెలుగుదనం ఉట్టిపడే ఆ రోజుని పూర్వం తెలుగు సంవత్సర ప్రారంభంగా పిలిచేవాళ్ళు. ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశి రోజుల్లో ఆషాడ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. శాస్త్రం ప్రకారం వీటిని అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే కానీ, ' కొండ పండుగ ' అంటే చాలు, అమెరికాలో ఉంటున్న మా వినుకొండ ప్రజల మనసులు కూడా పులకించిపోతాయి. వినుకొండ గడ్డపై పుట్టిన ఎవ్వరైనా సరే, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కానీ, ' కొండ పండుగ ' అంటే చాలు, వారి మనసుల్లో ఆనందాల జ్ఞాపకాలు పొంగిపొర్లుతాయి. కొండ పండుగ అంటే నాకూ ఓ చెరిగిపోని జ్ఞాపకం. మొదటిసారి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు కొండ పండుగ రోజున వినుకొండ కొండ ఎక్కిన గుర్తు. పల్నాడు ప్రాంతంలో పేరెన్నికగన్న ప్రాంతం మా వినుకొండ. విష్ణుకుండినులు ఏలిన ప్రాంతం కావడం వల్ల చారిత్రక నేపథ్యం బలంగా ఉన్న ప్రాంతం ఇది. తొలి ఏకాదశి రోజున వినుకొండ కొండపై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ...