పోస్ట్‌లు

ఆగస్టు, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

సెప్టెంబర్ లో జన్మించిన తొమ్మిది మంది తెలుగు మహాకవులు

చిత్రం
తెలుగు సాహిత్య చరిత్రలో సెప్టెంబర్ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆధునిక సాహిత్యానికి వన్నెలద్దిన తొమ్మిది మంది ప్రముఖ తెలుగు కవులు ఇదే మాసంలో జన్మించడం ఓ విశిష్టత. ఈ తొమ్మిది మంది కవులూ సాహిత్య చరిత్రలో తిరుగులేని స్థానాన్ని అలంకరించడం మరో ప్రత్యేకత. ఈ తొమ్మిది మంది తెలుగు కవులూ మహాకవులుగా కొనియాడబడ్డారు. 19వ శతాబ్దం ప్రథమార్థం వరకూ ఉన్న సాహిత్యానికి భిన్నంగా, నూతన ప్రక్రియలను సృజిస్తూ, సాహిత్య పరమార్ధాన్ని చాటి చెబుతూ, సమాజ హితాన్ని కోరుకున్న అభ్యుదయ కవులు కొందరైతే, సాంప్రదాయవాదాన్ని కొనసాగిస్తూ, సంస్కృతిని ప్రతిబింబిస్తూ, తేనెలూరే తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిన కవులు మరికొందరు. సాంఘిక దురాచార నిరసన, భాషా, సాహిత్యంలో రావలసిన మార్పులను ఆకాంక్షించిన గురజాడ అప్పారావు, తెలుగు సాహిత్యంలో ప్రముఖ నాటక కర్తగా స్థానం పొందిన చిలకమర్తి లక్ష్మీ నరసింహంలు సెప్టెంబర్ మాసంలోనే జన్మించారు. అలాగే, నాటి సమాజంలో పాతుకుపోయినకు వర్ణవివక్షపై యుద్ధాన్ని ప్రకటించిన విశ్వనరుడు గుర్రం జాషువా, బోయి భీమన్న, దేశము పట్టనంతటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ, మనోవిజ్ఞానిక నవలా సాహిత్యాన్ని అందించిన తాత్విక కథకుడు త్రిపురనేని...