పోస్ట్‌లు

అక్టోబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

చిత్రం
  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయంలో 16 తెలుగు లెక్చరర్ పోస్టులకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశ్వవిద్యాలయాల టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీలో భాగంగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో 3220 బోధనా ఖాళీలను భర్తీ చేసేందుకు సోమవారం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ యూనివర్సిటీలు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారానే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 220 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 220 లెక్చరర్ పోస్టుల్లో తెలుగు విభాగంలో 16 ఖాళీలు ఉన్నట్లు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఎం.ఏ తెలుగు మరియు నెట్, సెట్ అర్హతతో భర్తీ చేసే లెక్చరర్ పోస్టులకు  57,100 ప్రాథమిక బేసిక్ పే ద్వారా వేతనాలను అందిస్తారు. ఎంఏ తెలుగు, నెట్, సెట్ అర్హత కలిగిన నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం. నవంబర్ 20 దరఖాస్తుకు చివరి తేదీ. తెలుగు విభాగంలో ఖాళీల వివరాలు : తెలుగు విభాగంలో ఖాళీలు : 16 ఓసీ : 8,  బీసి ఎ : 1,  బీసి బి : 1, బి...

అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగులో 23 ఖాళీలు

చిత్రం
రా ష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సోమవారం రాత్రి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివిధ యూనివర్సిటీలు విడివిడిగా అధికారిక వెబ్సైట్లలో నోటిఫికేషన్లను పొందుపరిచారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు విభాగంలో మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి. తెలుగు  ఖాళీల వివరాలు : 1. ఆంధ్ర యూనివర్సిటీ - 4 2. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ - 3 3. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ - 2 4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ - 2 5. ఆదికవి నన్నయ యూనివర్సిటీ - 4 6. విక్రమ సింహపురి యూనివర్సిటీ - 4 7. రాయలసీమ యూనివర్సిటీ - 3 8. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం -1

అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు సిలబస్

చిత్రం
నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి పూర్తి నోటిఫికేషన్ వివరాలు నిరుద్యోగుల ముందుకు రానున్నాయి. అంతర్జాలంలో లభించిన సమాచారం మేరకు తెలుగు సిలబస్ ఈ విధంగా ఉంటుంది. తెలుగు సిలబస్ : 1. సామాన్య భాషా విజ్ఞానం 2. ఆధునిక తెలుగు నిర్మాణ రీతి 3. ప్రాచీన తెలుగు సాహిత్యం 4. ఆధునిక తెలుగు సాహిత్యం 5. జానపద గిరిజన విజ్ఞానం 6. తెలుగు సాహిత్య విమర్శ 7. సంస్కృత సాహిత్య పరిచయం 8. తెలుగువారి చరిత్ర - సంస్కృతి 9. అనువాద సిద్ధాంతాలు - వివిధ రంగాలు- అనువాద విధానం 10. పత్రికలు- ప్రసార మాధ్యమాలు- రచన.