పోస్ట్‌లు

డిసెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

డి.ఎల్.నోటిఫికేషన్ విడుదల

చిత్రం
డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 240 డిగ్రీ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తారీకు లోపు ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వెబ్ నోట్ లో పొందుపరిచారు .

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

చిత్రం
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 47 జూనియర్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20వ తారీకు లోపు ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్/ మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పొందుపరిచారు. పూర్తి నోటిఫికేషన్ :

డీవైఈవో నోటిఫికేషన్ విడుదల

చిత్రం
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జోన్ 1 లో 7, జోన్ 2 లో 12, జోన్ 3 లో 8, జోన్ 4 లో 11 మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. జనవరి 9 నుంచి 29 వరకు ఇరవై రోజులపాటు ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి నోటిఫికేషన్  

అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా

చిత్రం
ఈనెల 18 నుంచి జరగాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో వెబ్ నోట్ పొందుపరిచారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నద్దమైంది. నోటిఫికేషన్లోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియపరచనున్నట్లు పేర్కొంది.

గ్రూప్ - 2 నోటిఫికేషన్ విడుదల

చిత్రం
గ్రూప్ - 2 ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 897 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందులో మునిసిపల్ కమిషనర్ ( గ్రేడ్ 2), సబ్ రిజిస్టర్ ఆఫీసర్ (గ్రేడ్ 2), డిప్యూటీ తాసిల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 331 ఉండగా 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు జరిగేనా.. ?

చిత్రం
అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం అభ్యర్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటిస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జనువరి 5 వరకు వివిధ సబ్జెక్టుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ షెడ్యుల్ ప్రకారం పరీక్షలు జరిగేనా అనే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 27తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల తర్వాత నవంబర్ 30న పరీక్షకు అర్హులైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 8న తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీని ప్రకారం డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే, నోటిఫికేషన్ లోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ అభ్యర్థులు కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వివిధ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిలిచిపోయింది. ...