పోస్ట్‌లు

మార్చి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

గుంటూరు కరువు

చిత్రం
వందేళ్ల పాటు బతికిన మా నాయన అమ్మ కొన్నేళ్ల క్రితం చనిపోయింది. మేమందరం చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చోపెట్టుకుని చాలా ముచ్చట్లు చెప్పేది. ఆ పండు ముసలమ్మ  చెప్పే ముచ్చట్లు బలే ఆసక్తిగా ఉండేవి. ముచ్చట్లతో పాటు అప్పుడప్పుడూ వాల్ల రోజుల్ని గుర్తుకు తెచ్చుకునేది. " మీరిప్పుడు కమ్మగా తింటున్నారు కానీ, ఆ రోజుల్లో కడుపు నింపడానికి ఎంత కష్ట పడే వాళ్ళమో తెలుసా.." అంటూ తడి ఆరిన ఆమె గాజు కళ్లతో గతాన్ని గుర్తు చేసుకునేది. " ఒక పూట తినాలంటే  ఒక రోజంతా కష్ట పడాలి. మా పల్లెలో చాలా మంది తిండికి లేక నానా కష్టాలు పడే వాళ్ళు. కొంత మంది ఎంత కష్టపడే వాళ్ళంటే చిన్న పిల్లల్ని కూడా ఇంట్లోనే వదిలేసి, కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని, ఇరవై మైళ్ళ దూరం ఉన్న వినుకొండకి నడుచుకుంటూ వెళ్ళి ఏ అణాకో బేడాకో వాటిని అమ్ముకుని, అక్కడే తిండి గింజలు కొనుక్కొని, మళ్ళీ నడుచుకుంటూ వూరొచ్చి గంజి కాసుకొని తాగేవాళ్లు. బతకాలంటే రోజూ ఇదే పని. అసలు అదేముందీ మా అయ్యల, తాతయ్యల కాలంలో  గొప్ప కరువు వచ్చిందంట. అప్పట్లో తిండి లేక చచ్చిన శావాలు పొలిమేరల్లో గుట్టలు గుట్టలుగా ఉండేవట. ఆకలికి తట్టుకోలేక ఆ కరువు రోజుల్లో మట్టి కూడా...

ఇస్లాం వాదం ఎందుకు ?

చిత్రం
తెలుగు సాహిత్యంలో ' ఇస్లాం వాదాన్ని ' బలంగా వినిపిస్తున్న ప్రముఖ కవి షేక్ కరీముల్లా. " ఈ దేశ కల్లోల సంద్రంలో కరీముల్లా కవిత్యం ఓ పోరాడే యుద్దనౌక " అన్నాడు శివసాగర్. కరీముల్లా కవిత్వం ఆసాంతం చదివిన తరువాత ఆయన అభ్యుదయ భావాలు మనకు పూర్తిగా అర్థమవుతాయి. అయితే, కొన్ని ప్రశ్నలకు మరింత లోతుగా సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కరీముల్లా సైద్ధాంతిక పోరాటం ఎవరి మీద ? ఆయన కవిత్వం ఎవరి కోసం ? తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నప్పటికీ ' ఇస్లాం వాదం ' అవసరం ఎందుకు వచ్చింది ? దాని ప్రయాణం ఎటువైపు ? అంతిమ లక్ష్యం ఏమిటి ? అనే ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. వీటన్నిటికీ సమాధానాలు కరీముల్లా నుంచి తెలుసుకోవడమే ఉత్తమం. షేక్ కరీముల్లా ప్ర: తెలుగు సాహిత్యంలో ఎన్నో  ప్రక్రియలు ఉన్నాయి కదా ! మళ్లీ ' ఇస్లాం వాదం 'ఎందుకు ?  జ: దశాబ్దాల ముస్లింల వెనుకబాటుతనం, ఆవేదన, ఆగ్రహం ముస్లిం కవిత్వ రూపంలో ఉవ్వెత్తున వచ్చింది. ఏ సాహిత్య ఉద్యమమైనా ఆరంభంలో ధిక్కార స్వరంతో మొదలైనప్పటికీ క్రమేణా అది ఒక బలీయమైన సిద్ధాంత, తాత్వికత వైపునకు ప్రయాణించి తన స్థానాన్ని పదిలపరుచుకోవాలి. అభ్యుదయ, వి...

మనసును కరిగించే 'మల్లెపువ్వు'

చిత్రం
నలభైనాలుగేళ్ల క్రితం తెలుగులో విడుదలైన సినిమా మల్లెపువ్వు. 'వెల లేని మల్లెకు, వెలకు నలిగే మల్లెకు ఎంత తేడా ఉంటుందో ' మల్లెపువ్వు సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఇంత గొప్ప సినిమా కథ నిజానికి హిందీలో పుట్టింది. 1957లో దర్శకుడిగా, నిర్మాతగా, గురుదత్ స్వయంగా హీరోగా నటించి " ప్యాసా " అనే పేరుతో ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. విఫల ప్రేమికుడైన ఓ నిరుపేద వర్ధమాన కవి కథే ప్యాసా ఇతివృత్తం. ఈ సినిమా ఓ అద్భుత కళాఖండం. అయినప్పటికీ, హిందీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది. కానీ, తెలుగు ప్రేక్షకుల అదృష్టం కొద్దీ ఆ తరవాత ఇరవై ఒక్క ఏళ్ళకి 1978లో మల్లెపువ్వు పేరుతో ప్యాసా సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. శోభన్ బాబు కోసమే ఈ కథ పుట్టినట్టు తెలుగులో తప్పక చూడదగ్గ సినిమాల జాబితాలో మల్లెపువ్వు చేరిపోయింది. మల్లెపువ్వు విడుదలై నలభైనాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పుడెందుకు ఈ రివ్యూ అన్న ప్రశ్న రావచ్చు. అందరూ చూసిన చిత్రమే కదా అనిపించవచ్చు. కానీ, సాహిత్యాన్ని, సంగీతాన్ని, మంచి సినిమా కథనూ ఇష్టపడే ఏ ఒకరో, ఇద్దరో తెలుగు సినిమా ప్రేమికులు ఎక్కడో ఓ చోట ఈ సినిమా చూడకుండా మిగిలిపోయి ఉంటా...

దళిత జీవన విధానం సాంస్కృతిక - పరివర్తన

"జాతి పరంగాను, సంస్కృతి పరంగాను, భాషా పరంగాను, ప్రపంచమంతా ఒకే లక్ష్యాన్ని, ఏకతను సాధించడానికి కృషి జరుపుతున్నది. ప్రపంచం ఏకత వైపు ప్రయాణిస్తున్నది. ఈ ప్రపంచానికి అనేక కోణాలున్నాయి. అనేక అవరోధాలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. పురాతన సంస్కృతులు అంతరించి పోతున్నాయి.” ప్రముఖ పరిశోధకుడు నదీం హస్ నైన్ అన్న మాటలు అక్షర సత్యాలు. విభిన్న సంస్కృతులకు, జాతులకు, జీవన విధానాలకు నిలయమై ఉన్న భారతీయ సంస్కృతి భిన్నమైనది. ఇక్కడ నివశించే ప్రతి జాతికి విభిన్నమైన జీవన విధానం, అమోఘమైన చరిత్ర ఉంది. చరిత్ర కొనసాగింపుగానే సాంస్కృతిక మార్పుల్లో భాగంగా జాతుల జీవన విధానం పరివర్తనకు లోనవుతూ వుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం భిన్నమైన జీవన విధానాలను మనం చూస్తున్నాము. జీవన విధానంలో సాంస్కృతిక పరివర్తన ఏ కొద్ది కాలంలోనో సంభవించే మార్పు కాదు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. జాతుల జీవన విధానాలకు, అభివృద్ధికి, మార్పుకు సాహిత్యం కూడా దోహదం చేస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గడిచిన 150 ఏళ్ళ కాలంలో దళితుల జీవన విధానం క్రమేనా మార్పుకు లోనైంది. దీనికి సాహిత్యం కూడా ఒక ప్రధాన కారణం. 1850 కి పూర్వం దళితుల జీవన విధానం: 1860-80...

ఆలోచింప చేసే తేజోవతి కథలు

చిత్రం
ఆధునిక కల్పనా సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ 'కథానిక' ప్రముఖ స్థానాన్ని అలంకరించింది. సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ, పాఠకుడి హృదయాన్ని తాకే వర్తమాన సాహితీ ప్రక్రియ తెలుగు కథానిక. 1910లో మహాకవి గురజాడ అప్పారావుతో ప్రారంభమైన ఆధునిక కథా సాహిత్య ప్రక్రియ జీవనదిలా ప్రవహిస్తూనే ఉంది. కథానికను కొత్త పుంతలు తొక్కించిన చలం, విశ్వనాథ సత్యనారాయణ, మునిమాణిక్యం నరసింహారావు, కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి, త్రిపురనేని గోపిచంద్, పాలగుమ్మి పద్మరాజు, భానుమతి, మాలతీ చందూర్ వంటి ప్రసిద్ధ కథకుల నుంచి నేటి తరం యువ రచయితల వరకు కథలలో కొత్త కోణాలను సృజిస్తునే ఉన్నారు. అందుకే తెలుగు సాహిత్యంలో అనంత వైవిధ్యాలతో ఎన్నో కథానికలు పుట్టుకొచ్చాయి. " కథకి గొప్పతనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి పైకి  లేవాలి " అంటాడు చలం. అందుకే నిత్యం మనం చూసే సంఘటనలు, మానవ సంబంధాలతో కూడిన కథలు మనలను ఆలోచింపచేస్తాయి. మనసుకు హత్తుకుంటాయి. ఈ కోవకు చెందిన ప్రముఖ కథా రచయిత్రే డాక్టర్ అధరాపురపు తేజోవతి. మానవ సంబంధాలలో, స్త్రీ సమస్యలలో కొత్త కోణాలన సృజించిన కథా రచయిత్రి డాక్టర్ అధరాపురపు తేజోవతి. తనకు ఎద...