పోస్ట్‌లు

జూన్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

నెంజుకు నీది (మూవీ రివ్యూ)

చిత్రం
2019 జూన్ 28న హిందీలో విడుదలైన సినిమా ఆర్టికల్ - 15. ఈ సినిమా బాలివుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. గౌరవ్ పొలంకి, అనుభవ్ సిన్హా రచనలో రూపుదిద్దుకున్న ఆర్టికల్- 15 సినిమా అప్పట్లో ఓ పెద్ద చర్చ. ఇదే కథాంశంతో గత నెల తమిళ రీమేక్ వెర్షన్లో విడుదలైన సినిమా " నెంజుకు నీది ". ప్రస్తుతం ఈ సినిమా తమిళం, కన్నడం, తెలుగులో దూసుకుపోతోంది. హిందీ మూల కథాంశాన్ని తీసుకున్నప్పటికీ తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చిత్రికరించడంతో ద్రవిడ భాషా ప్రేక్షకుల మనసులకు ఈ సినిమా హత్తుకుపోతోంది. ఆ మధ్య తమిళంలో సంచలనం సృష్టించిన కర్ణన్, ఈ మధ్య బాక్సాఫీస్ బద్దలు కొట్టిన జై భీమ్, ఇటీవలే విడుదలైన రైటర్, జనగణమన సరసన ' నెంజుకు నీది ' సినిమాకు సగౌరవ స్థానాన్ని ఇవ్వడానికి సందేహించల్సిన పనిలేదు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల భావన ఓ మానసిక రుగ్మత. రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టి, రెండు వేల ఇరవై రెండులో కూడా మనిషి మనసుల్లో శాశ్వితంగా తిష్ట వేసిన వివక్ష, కులం అనే భావన. కుల నిర్మూలన గురించి ఎంత ప్రయత్నించినప్పటికీ తన రూపం మార్చుకుంటుందే కానీ అంతం కావడం లేదనేది ఒప్పుకోవాల్సిన విషయం. కొత్తగా తన రూపాన్ని మార్చు...

అర్ధం కోసం అన్వేషణ (Man's Search for Meaning )

చిత్రం
" ప్రతి క్షణాన్ని ఇదివరకే జీవించినట్లుగా భావించి, మళ్ళీ ఈ అవకాశం మీకు వచ్చినట్లుగా ఊహించి, ఆ అవకాశాన్ని మరింత ప్రయోజనకరంగా జీవించడానికి ప్రయత్నించు "                                 - విక్టర్ ఈ. ఫ్రాంకిల్ అవి రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి రోజులు. 1943 వ సంవత్సరం. జర్మనీలోని ఆశ్విడ్జ్ అనబడే నిర్భంధ శిబిరాల ముందు వేలమంది యుద్ధ ఖైదీలు బారులు తీరి ఉన్నారు. యుద్ధానికి ముందు వారంతా స్వేచ్ఛగా, సంతోషంగా కుటుంబాలతో గడిపిన సామాన్య  ప్రజలు. ఇప్పుడు యుద్ధ ఖైదీలుగా  నిస్సహాయంగా నిర్భంధ శిబిరాలలోకి వెళ్లేందుకు బారులు తీరారు. ప్రధాన ద్వారం ముందు వడపోత కార్యక్రమం జరుగుతోంది. యుద్ధ ఖైదీల్లో ఒక్కొక్కరిని నిశితంగా పరిశీలిస్తున్న ఓ అధికారి వారిని కుడివైపుకు వెళ్లాలో, ఎడమవైపుకు వెళ్లాలో నిర్ణయిస్తున్నాడు. కుడి వైపుకు వెళితే నిర్బంధ శిబిరంలోకి దారి, ఎడమ వైపుకు వెళితే విషవాయువు గదుల్లోకి మార్గం. ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించే అధికారం అక్కడ ఉన్న వడపోత అధికారి హక్కు. బతకడానికీ, చావడానికీ మధ్య ఒక్క ఆజ్ఞ మాత్రమే అక్కడ పనిచేస్తుంద...

జనగణమన ( మూవీ రివ్యూ )

చిత్రం
జై భీమ్ సినిమా తర్వాత అంతటి బలమైన కథా చిత్రాన్ని మళ్లీ చూడగలనా అన్న సందేహం నన్ను వెంటాడింది. ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన తర్వాత కలిగే సంతోషం ఎంతో కాలం నిలబడదు. మళ్లీ అంతటి ఉన్నత శిఖరాన్ని కనుగొనేంత వరకూ పర్వతాన్వేషకుడు ఓ చోట నిలబడలేడు. సినిమా ప్రేమికుడూ అంతే. మంచి సినిమా తర్వాత అంతకన్నా మంచి సినిమా కోసం ఆన్లైన్ ప్రవాహాన్ని నిరంతరం శోధిస్తూనే ఉంటాడు. అదృష్టం కొద్దీ ఈ నెల మొదటి వారంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ' జనగణమన ' సినిమా కనిపించింది. కేవలం రెండున్నర గంటలు వ్యవధిలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నా సినిమాల జాబితాలో జై భీమ్ సరసన జనగణమన చేరిపోయింది. ఇన్ స్టెంట్ జడ్జిమెంట్, మీడియా ట్రయల్, సోషల్ మీడియా అత్యుత్సాహం, అర్థంలేని ప్రజల భావావేశాలు, మానభంగాలు, అకృత్యాలు, విశ్వవిద్యాలయాల్లో వివక్షలు, మేధావుల ముసుగులో వేధింపులు, పనికిరాని రాజకీయాలు... వ్యవస్థలోని ఆన్ని కోణాలు జనగణమన సినిమా రూపంలో కళ్ళ ముందు కనిపిస్తుంది. జనగణమన కథా రచయిత షరీఫ్ మహమ్మద్. సమాజాన్ని బాగా చదివిన కథా రచయిత. వాస్తవ ఘటనల ఆధారంగా మలిచే కథలు ఆకట్టుకుంటాయి కానీ, వాస్తవ సంఘటనలను మైమరపించే కథలను సృష్టించడం చాల చాలా కస్టం. షర...

రైటర్ ( మూవీ రివ్యూ )

చిత్రం
'సార్పట్ట పరంపర' తర్వాత పా రంజిత్ సినిమా కోసం ఎదురు చూస్తున్న నాకు 'రైటర్' కనిపించింది. పా రంజిత్ సినిమాలంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. నేరుగా దర్శకత్వం వహించినా, నిర్మించినా కథలు ఎంచుకునే విధానంలోనే పా రంజిత్ గొప్పతనం వుంటుంది. "మన దేశంలో రెండు వేలకు పైగా దళిత జాతికి చెందిన కులాలు ఉన్నాయి. వీరిలో కొందరు మాత్రమే కనీసం మాట్లాడుతున్నారు. వారి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కదా. నేనూ ఆ ప్రయత్నమే చేస్తున్నాను" అంటూ అంబేద్కర్ ఫోటో పట్టుకుని సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన అరుదైన దర్శకుడు పా రంజిత్. అణగారిన జీవిత కథలను తవ్వితీసి బహుజన భావజాలాన్ని అద్ది కమర్షియల్ హిట్ కొట్టడం పా రంజిత్ ప్రత్యేకత. ఇదే బాటలో పా రంజిత్ నిర్మాతగా "రైటర్" సినిమా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ద్వారా తొలిసారి ఫ్రాంక్లిన్ జాకబ్ దర్శకుడిగా పరిచయమై హిట్ కొట్టేశాడు. మొదటి సారి హిట్ కొట్టడమే కాదు, తమిళ సినిమాల్లో అత్యంత సహజంగా అణగారిన వర్గాల కథలను వినిపిస్తూ సంచలనం సృష్టిస్తున్న పా రంజిత్, మారి సెల్వరాజ్, వెట్రి మారన్, టిఎస్ జ్ఞానవేల్ సరసన ఫ్రాంక్లిన్ జాకబ్...