పోస్ట్‌లు

ఏప్రిల్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

పద ( యధార్థ సంఘటన )

చిత్రం
కొన్ని జరిగిన సంఘటనలు వినటమే కానీ చూసే అవకాశం ఉండదు. 1990 - 2000 సంవత్సరాల మధ్య విప్లవ పోరాటాల నేపథ్యం ఉన్న సంఘటనలు చాలా ఆసక్తిగా ఉంటాయి. విప్లవకారుల చర్యలు దినపత్రికల్లో చదివినప్పుడు, టీవీల్లో చూసినప్పుడు ఉత్కంఠగా, ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటాయి. అలాంటి యధార్థ సంఘటనల నేపథ్యాన్ని కథగా తీసుకుని తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూనే ఉంటాయి. విప్లవ పోరాట నేపథ్యాన్ని చూపించే సినిమాల్లా కాకుండా, కేవలం ఒక్కరోజులో, ఇరవై గంటల వ్యవధిలో జరిగిన సంఘటన యధావిధిగా తెర మీద చూపిస్తే చాలా బాగుంటుంది. 1996లో కేరళలో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. ఈ సంఘటన అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్నే కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దీనికి సంబంధించిన పోరాట నేపథ్యం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ఆ పోరాటం మొత్తాన్నీ ప్రతిబింబించే సంఘటన ఒక్క రోజులో జరిగింది. దీన్నే కథాంశంగా తీసుకుని మలయాళ దర్శకుడు కమల్ కె.ఎం.' పద ' సినిమాను తెరకెక్కించాడు. గత మార్చి10న విడుదలైన ఈ సినిమా కేవలం రోజుల వ్యవధిలోనే తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో చేరిపోయింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో 1996లో జరిగిన యధార్థ సంఘటన ...

నాన్నా.. ( సింగిల్ పేజీ కథ)

చిత్రం
ఆ గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే అర్థమైంది.. సంతోషంగా తిరిగి ఇంటికెళ్లడం కష్టమని. అక్కడ స్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ గదిలో అటూ ఇటూ కలిపి ఇరవై బెడ్లు ఉంటాయి. ప్రతి బెడ్డుపై ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. అతనికి ఎదురుగా, వారి తాలూకు వ్యక్తి నిలుచుని ఉన్నాడు. బెడ్డుపై పడుకున్న ప్రతి ఒక్కరికీ ఆక్సీజన్ పెట్టి ఉంది. కొందరికి గుండెలపై ఏవో తీగలు తగిలించి ఉన్నాయి. వారి వెనక ఉన్న పరికరాల నుంచి కుయ్, కుయ్ మంటూ చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి. అప్పుడప్పుడూ ఆ గదిలోకి ఓ డాక్టర్ వచ్చి ఆ చివరి నుంచి ఈ చివరకు పరిశీలించి వెళ్తాడు. అప్పుడప్పుడూ కొన్ని బెడ్ల వద్ద ఆగి బెడ్డుకి తగిలించి ఉన్న రికార్డు పరిశీలిస్తాడు. ఆ గదిలో ఉన్న ఎవ్వరి ముఖాల్లోనూ సంతోషం ఛాయలే లేవు. అలా అని కంగారూ కనిపించడం లేదు. ఇంతలో మొదటి లైనులో చివరి బెడ్ వద్ద నిలుచున్న ఒకతను కంగారుగా బయటికి పరిగెత్తుకు వెళ్లాడు. తిరిగి పరుగులాంటి నడకతో డాక్టర్తో బెడ్ వద్దకు వచ్చారు. డాక్టర్ సైత్ తీసి పడుకున్న 'వ్యక్తి' గుండెలపై పెట్టి చూశాడు. నాడి పట్టుకున్నాడు. ఆ గదిలో నిల్చున్న వ్యక్తులందరి చూపూ అటువైపే ఉంది. ఇంతలో, ఏమైందో ఏమో... అక్కడ నిల్చున్న...

సంస్కర్త బసవేశ్వరుడు

చిత్రం
కుల రహిత సమాజ నిర్మాణానికి జీవితాన్ని వెచ్చించిన కన్నడ మహనీయుడు బసవేశ్వరుడు. 890 ఏళ్ల  క్రితమే నాటి సమాజంలో వర్ణాంతర వివాహం జరిపించి సంచలనం సృష్టించిన అభ్యుదయవాది బసవేశ్వరుడు. " కుల సంకరము సేయగూడునే..." అంటూ నిలదీసి ప్రశ్నించిన బిజ్జల మహారాజుకి " మొన్న బుట్టిన కులమ్ముల మాటలేలా..." అంటూ కులం గురించి మాట్లాడటమే సరైనది కాదని సూటిగా సమాధానం చెప్పిన ధీరుడు బసవడు. జ్ఞాన హీనమైన భక్తి అంధము, భక్తి హీనమైన జ్ఞానము వంధ్యము అన్నట్లు జ్ఞానము, భక్తీ కలిసి ఉన్న చోటే పరిపూర్ణత వుంటుంది. బసవేశ్వరుడు కూడా మహాజ్ఞాని. అంతకు మించిన ' కూడల సంగమ ' వీర భక్తుడు. భక్తిని ఉద్యమంగా చేపట్టిన మేధావి. సమసమాజ నిర్మాణానికి జ్ఞాన మొక్కటే సరిపోదని, అత్మశుద్ది కలిగిన భక్తి కూడా కావాలంటూ నూతన సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వీర శైవ భక్తుడు. సమానత్వం, సోషలిజం సిద్దాంతాలు కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ తరువాత ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ పన్నెండవ శతాబ్దంలోనే సమానత్వ భావాలను ద్రవిడ ప్రాంతంలో ప్రచారం చేసిన సంఘసంస్కర్త బసవేశ్వరుడు. బౌద్ధ, జైన మతాల క్షీణత తర్వాత పన్నెండవ శతాబ్దంలో బ్రాహ్మణ ఆధిక్యత, కర్మకాండల ...

' రాచ్చసి ' ( తమిళ సినిమా )

చిత్రం
చిన్న సమస్య చుట్టూ అందమైన కథ అల్లి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టడం తమిళ సినిమా ప్రత్యేకత. నాలుగు రోజుల క్రితం ప్రైమ్ మూవీస్ లో రాచ్చసి సినిమా చూశా. ఎలాంటి అంచనాలూ, రివ్యూలూ, అభిప్రాయాలు లేని, అప్పటి వరకూ పేరు కూడా తెలీని సినిమా చూడటమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే, సినిమా గురించి ముందుగానే తెలిస్తే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. మన అభిప్రాయంతో సినిమా చూస్తే కొన్ని సార్లు చప్పగా ఉండొచ్చు.. అప్పుడప్పుడూ గొప్పగానూ ఉండొచ్చు. అలా కాకుండా కనీసం అప్పటి వరకూ సినిమా పేరు కూడా తెలియకుండా ఓ కొత్త సినిమా ప్లే చేస్తే, ప్లే చేసిన పది నిమిషాల్లోపే సినిమాలోని కథలోకి మనం లీనమైపోతే ఆ మజానే వేరు. సేమ్ టూ సేమ్ ఇలానే రాచ్చసి సినిమా చూసా. అప్పటి వరకూ రాచ్చసి పేరు కూడా తెలీదు. సినిమా ప్రారంభమైన పది నిమిషాల్లోనే కథలో లీనమైపోయా. ఇక ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా రెండు గంటల పది నిమిషాల సినిమా సింగిల్ సిట్టింగ్లో చుసేశా. ఒక మంచి సినిమా చూసిన తర్వాత మనసు ఊరుకుంటుందా, నలుగురితో చెప్పిందాకా నిద్రపోనివ్వదు. 2019లో సయ్యద్ గౌతమ్ రాజ్ రచన, దర్శకత్వంలో తమిళంలో విడుదలైన సినిమా రాచ్చసి. మిస్ గీతారాణి పేరుతో హిందీలో కూడా డబ్ చేసి బా...

ఇప్పుడు చూడాల్సింది ' అంబేద్కర్ '

చిత్రం
ఈ మధ్య కాలంలో భారతీయ సినిమాలపై పెద్ద చర్చే నడుస్తోంది. కొన్ని సినిమాల్లో హింస, విద్వేషాలు పెంచి పోషిస్తున్నారనీ, చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తున్నారనీ దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి మేధావుల వరకూ అలుపెరుగని చర్చ చేస్తున్నారు. ఎంత చర్చ నడుస్తున్నప్పటికీ, చరిత్రను సినిమాగా తీయాలనుకున్నప్పుడు వక్రీకరణకి గురి కాకుండా వాస్తవాన్ని ప్రతిభింభించేలా ఉండాల్సిన అవసరం ఉందనేది అందరి ఏకాభిప్రాయం. చరిత్రని ఉన్నది ఉన్నట్లుగా చూపించినప్పుడే సినిమాలో జీవం కనిపిస్తుంది. అలాంటి అరుదైన చారిత్రక సినిమాని చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు కూడా ఆనాటి కాలానికి వెళ్లగలిగే అనుభూతి పొందాలి. సినిమాని చూస్తూ అందులోని పాత్రలతో లీనమవ్వాలి. అంతటి గొప్ప అనుభూతినీ, చారిత్రక వాస్తవాన్ని అందించే భారతీయ సినిమాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఈ కోవకు చెందిన గొప్ప భారతీయ సినిమానే " డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ". ఇది మనందరికీ తెలిసిన ఒక వాస్తవిక జీవిత చరిత్ర. కళ్లకు కట్టినట్టు ప్రతి ఒక్కరూ తెరపై చూడాల్సిన అద్భుత కళాఖండం. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలియని భారతీయులు లేరు. ప్రపంచ మేధావుల జాబితాలో ప్రథమంగా వినిపించే పేరు అంబేద...