జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

' రాచ్చసి ' ( తమిళ సినిమా )

చిన్న సమస్య చుట్టూ అందమైన కథ అల్లి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టడం తమిళ సినిమా ప్రత్యేకత. నాలుగు రోజుల క్రితం ప్రైమ్ మూవీస్ లో రాచ్చసి సినిమా చూశా. ఎలాంటి అంచనాలూ, రివ్యూలూ, అభిప్రాయాలు లేని, అప్పటి వరకూ పేరు కూడా తెలీని సినిమా చూడటమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే, సినిమా గురించి ముందుగానే తెలిస్తే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. మన అభిప్రాయంతో సినిమా చూస్తే కొన్ని సార్లు చప్పగా ఉండొచ్చు.. అప్పుడప్పుడూ గొప్పగానూ ఉండొచ్చు. అలా కాకుండా కనీసం అప్పటి వరకూ సినిమా పేరు కూడా తెలియకుండా ఓ కొత్త సినిమా ప్లే చేస్తే, ప్లే చేసిన పది నిమిషాల్లోపే సినిమాలోని కథలోకి మనం లీనమైపోతే ఆ మజానే వేరు. సేమ్ టూ సేమ్ ఇలానే రాచ్చసి సినిమా చూసా. అప్పటి వరకూ రాచ్చసి పేరు కూడా తెలీదు. సినిమా ప్రారంభమైన పది నిమిషాల్లోనే కథలో లీనమైపోయా. ఇక ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా రెండు గంటల పది నిమిషాల సినిమా సింగిల్ సిట్టింగ్లో చుసేశా. ఒక మంచి సినిమా చూసిన తర్వాత మనసు ఊరుకుంటుందా, నలుగురితో చెప్పిందాకా నిద్రపోనివ్వదు.


2019లో సయ్యద్ గౌతమ్ రాజ్ రచన, దర్శకత్వంలో తమిళంలో విడుదలైన సినిమా రాచ్చసి. మిస్ గీతారాణి పేరుతో హిందీలో కూడా డబ్ చేసి బాలీవుడ్ లో రిలీజ్ చేసి యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంచారు. ప్రముఖ రివ్యూలు, రేటింగ్ లూ అన్నీ కలిపి చూస్తే ఇది చాలా హిట్ సినిమా. హిట్ సినిమా అనడం కన్నా మంచి ఆకట్టుకునే కథ ఈ సినిమాలో ఉంది అనడం ఉత్తమం. రాచ్చసి సినిమా చూసిన తర్వాత ఇలాంటి కథలు కూడా సినిమాలుగా తియ్యవచ్చా అని ఆశ్చర్యం కలుగుతుంది.

తమిళనాడులోని ఓ గ్రామంలో ప్రభుత్వ సెకండరీ స్కూల్ ఉంటుంది. ఇంటర్ వరకూ ఆ గ్రామంలోని పిల్లలు ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాల అనగానే సహజంగానే సమస్యల నిలయంగా మన ముందు కనిపిస్తుంది. బాధ్యతలేని ఉపాధ్యాయులు, క్రమశిక్షణ లేని విద్యార్థులు, మౌలిక వసతుల కొరత, నిర్లక్ష్యం దీనికి తోడు అదే ఊరిలో ప్రభుత్వ విద్యార్థులను ఎప్పుడు తనలో కలిపేసుకుందామా అనే ప్రైవేట్ పాఠశాల. ఇన్ని సమస్యల నడుమ ఆ పాఠశాలకు కొత్తగా ప్రధానోపాధ్యాయురాలు వస్తుంది. అక్కడ నుంచి ప్రారంభమైన సినిమా కథ రకరకాల మలుపులు తిరుగుతూ, ఎక్కడా విసుగు లేకుండా, ఆసక్తి కలిగించే స్క్రీన్ ప్లే , కథనంతో  మనల్ని కూడా సినిమాలో నడిపిస్తూ రెండు గంటల పది నిమిషాల సినిమాని తెరకెక్కించిన సయ్యద్ గౌతమ్ రాజ్ దర్శకత్వ ప్రతిభకు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

ఇందులో స్కూల్ హెచ్ఎం గా జ్యోతిక నటన గొప్పగా ఉంటుంది. ఈ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. జ్యోతిక మెయిన్ రోల్. సిన్సియర్ హెచ్ఎం గా పాఠశాలలోని ప్రతి సమస్యనూ పరిష్కరించే విధానం చాలా బాగుంటుంది. మన స్కూల్లల్లో కూడా ఇలాంటి హెచ్ఎంలు ఉంటే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే సినిమా మొత్తం తీయడంలో బడ్జెట్ తక్కువే అయినప్పటికీ ఎక్కడా ఫీల్ మిస్ కాకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. జ్యోతిక ప్రభుత్వ పాఠశాలకు హెచ్ఎంగా రావడం వెనుక ఉన్న చిన్న ట్విస్ట్ సినిమా చివర్లో ఆకట్టుకుంటుంది. జ్యోతికతో పాటు ప్రైవేటు స్కూల్ డైరెక్టర్ పాత్రలో హరీష్ పేరడీ నటన అద్భుతంగా ఉంది..." చీకట్లో ఒట్టి చేతులతో వెళ్లే వ్యక్తికి, టార్చ్ లైట్ తో వెళ్ళే వ్యక్తి కన్నా ఎక్కువ గుండె నిబ్బరం ఉంటుంది." "  చంపడానికీ, గెలవడానికి మధ్య చాలా తేడా ఉంది." వంటి హరీష్ డైలాగుల్లో విలనిజాన్ని సున్నితమైన కోణంలో చూపించారు. మొత్తంగా ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే..." మీరు కేవలం అన్యాయం గురించి మాట్లాడుతుంటే.. అలాగే సాగుతుంది. ఎటువంటి ముగింపూ ఉండదు. అన్యాయానికి సాక్షిగా మిగిలిపోతారు. కానీ, ఎదురు తిరిగి పోరాడితే, చరిత్రను సృష్టిస్తారు. "

- శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్