జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

ఇప్పుడు చూడాల్సింది ' అంబేద్కర్ '

ఈ మధ్య కాలంలో భారతీయ సినిమాలపై పెద్ద చర్చే నడుస్తోంది. కొన్ని సినిమాల్లో హింస, విద్వేషాలు పెంచి పోషిస్తున్నారనీ, చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తున్నారనీ దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి మేధావుల వరకూ అలుపెరుగని చర్చ చేస్తున్నారు. ఎంత చర్చ నడుస్తున్నప్పటికీ, చరిత్రను సినిమాగా తీయాలనుకున్నప్పుడు వక్రీకరణకి గురి కాకుండా వాస్తవాన్ని ప్రతిభింభించేలా ఉండాల్సిన అవసరం ఉందనేది అందరి ఏకాభిప్రాయం. చరిత్రని ఉన్నది ఉన్నట్లుగా చూపించినప్పుడే సినిమాలో జీవం కనిపిస్తుంది. అలాంటి అరుదైన చారిత్రక సినిమాని చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు కూడా ఆనాటి కాలానికి వెళ్లగలిగే అనుభూతి పొందాలి. సినిమాని చూస్తూ అందులోని పాత్రలతో లీనమవ్వాలి. అంతటి గొప్ప అనుభూతినీ, చారిత్రక వాస్తవాన్ని అందించే భారతీయ సినిమాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఈ కోవకు చెందిన గొప్ప భారతీయ సినిమానే " డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ". ఇది మనందరికీ తెలిసిన ఒక వాస్తవిక జీవిత చరిత్ర. కళ్లకు కట్టినట్టు ప్రతి ఒక్కరూ తెరపై చూడాల్సిన అద్భుత కళాఖండం. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలియని భారతీయులు లేరు. ప్రపంచ మేధావుల జాబితాలో ప్రథమంగా వినిపించే పేరు అంబేద్కర్. అంతటి గొప్ప మహనీయుని నిజ జీవిత చరిత్రను సినిమాగా తీయాలనుకున్నప్పుడు ఎంతో ఓర్పు, నేర్పు అంతకుమించిన పరిశోధన అవసరం. వీటన్నిటినీ అధికమించి ప్రఖ్యాత మరాఠా దర్శకుడు డాక్టర్ జబ్బర్ పటేల్ అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.

రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించి నిర్మించిన " గాంధీ "  సినిమా అందరికీ తెలిసిందే, చూసిందే. ఇది చాలా గొప్ప సినిమా. గాంధీ సినిమా సాంకేతిక పరిజ్ఞానానికి ఏ మాత్రం తగ్గకుండా, అంబేద్కర్ సినిమాను నిర్మించాలని 1997లో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భావించి అంబేడ్కర్ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. సినిమా దర్శకత్వ బాధ్యతను డాక్టర్ జబ్బర్ పటేల్ స్వీకరించాడు. అప్పట్లోనే ఈ సినిమా కోసం సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అంబేద్కర్. యువకుడిగా, విద్యార్థిగా సినిమా ప్రారంభం నుంచి చనిపోయేంత వరకు సింగిల్ హీరోగా నటించాల్సిన గొప్ప పాత్ర అది. నిజ జీవిత పాత్ర కాబట్టి అంబేద్కర్ మేనరిజమ్స్, హావభావాలకు దగ్గరగా సరిపోయే నటుడి కోసం అప్పట్లో పెద్ద ప్రయత్నమే చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప హీరోలనే సంప్రదించారు. చివరికి ఈ అదృష్టం మలయాళ నటుడు మమ్ముట్టి సొంతమైంది. మమ్ముట్టి కెరియర్ మొత్తంలో ఎంతో గొప్పగా చెప్పుకోదగిన పాత్ర అంబేద్కర్. ఈ సినిమాలో మమ్ముట్టి నటన అత్యద్భుతం. అంబేద్కర్ పాత్రలోకి మముట్టి పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా ఆసాంతం సింగిల్ హీరోగా మమ్ముట్టి ప్రతిభ చాలా గొప్పగా కనిపిస్తుంది. మొదట్లో ఈ సినిమాని ఇంగ్లీష్ లో తీసినప్పటికీ ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విద్యార్థిగా ఉన్నప్పుడు సినిమా కథ ప్రారంభమవుతుంది. విజ్ఞానం అంటే సమాజాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని మార్చడం కూడా అన్న బలమైన భావనతో బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా, లండన్ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటాడు. అక్కడి నుంచి ఇండియా వచ్చిన తర్వాత కొంత కాలం ఉద్యోగం, అస్పృశ్యతను నిర్మూలించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రత్యక్ష ఉద్యమాల్లోకి రావడం, రౌండ్ టేబుల్ సమావేశం, పూనా ఒప్పందం, న్యాయశాఖా మంత్రిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ జీవితంలోని ఆన్ని ఘట్టాలను ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించారు. 1910 నుంచి 1960 మధ్యకాలంలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడంలో సినిమా సాంకేతిక వర్గం గొప్ప విజయాన్ని సాధించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమా ఉత్తమ చిత్రంగా, ఉత్తమ కళా దర్శకత్వం నితిన్ చంద్రకాంత్ దేశాయ్, అంబేద్కర్ పాత్రలో నటించిన మమ్ముట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తప్పకుండా చూడాల్సిన మన సినిమాల జాబితాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాను ముందు వరసలో ఉంచాలి.

- శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్