పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

వీధి బడి నుంచి..

చిత్రం
వీధి బడి నుంచి విశ్వవిద్యాలయ సాహిత్య పీఠాధిపతిగా ఎదిగిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జీవిత ప్రయాణం చాలా గొప్పది. " తెలుగు చదివితే ఏమొస్తుంది.." అనుకునే రోజుల్లో తెలుగు మాత్రమే చదివి సాహిత్య చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించిన మేధావి ఆచార్య ఎండ్లూరి సుధాకర్. తెలుగు సాహిత్యంలో మార్గదర్శి, ఆదర్శ గురువు, అంతకు మించిన అభ్యుదయవాది ఆచార్య ఎండ్లూరి సుధాకర్. యాదృచ్ఛికమే కానీ, మహాకవి గుర్రం జాషువా వందేళ్ల క్రితం బడిపంతులు ఉద్యోగాన్ని వదిలి బతుకుదెరువు కోసం రాజమండ్రి వెళ్ళాడు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కూడా హైదరాబాదులో బడిపంతులు ఉద్యోగం వదిలి 1990లో రాజమండ్రిలో తెలుగు అధ్యాపకుడిగా సరి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. మహాకవి గుర్రం జాషువా సాహిత్యాన్ని ఆసాంతం చదివిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్, మహాకవి చూపిన మార్గాన్నే ఎంచుకున్నాడు. గుర్రం జాషువా రచించిన " గబ్బిలం " కావ్య స్ఫూర్తితో ఆచార్య ఎండ్లూరి "కొత్త గబ్బిలం" అనే దీర్ఘ కావ్యం రచించి ఆధునిక కవిత్వంలో కొత్త ఒరవడి సృష్టించారు.  1962 ప్రాంతంలో హైదరాబాద్ లోని కృపానందం వీధి బడిలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ తెలుగు అక్షరాలు దిద్దాడ...

మన కాలపు మేధావి

చిత్రం
అణువణువూ స్పూర్తిని నింపే మన కాలపు మేధావి 'జంగం చిన్నయ్య'. చదువు మాత్రమే తరాన్ని మార్చగలదు అని నమ్మి, నిరూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ జంగం చిన్నయ్య. అణగారిన వర్గాల నుంచి పుట్టే ప్రపంచ మేధావులు అరుదుగానే ఉంటారు. వారి జీవిత ప్రయాణం నేర్చుకోదగ్గ పాఠ్యాంశం. డాక్టర్ జంగం చిన్నయ్య గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి ప్రయాణం మొదలెట్టి, ప్రభుత్వ హాస్టల్లో చదువుకొని యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి పీహెచ్డీ, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పీడీఎఫ్ చేసిన మేధావి అంటే కచ్చితంగా తెలుసుకుంటాం.. డాక్టర్ జంగం చిన్నయ్యది నిజామాబాద్ జిల్లా కొమ్మన్ పల్లి గ్రామంలో అత్యంత నిరుపేద, అణగారిన వర్గానికి చెందిన కుటుంబ నేపథ్యం. పాఠశాల వయసులోనే ఎంతో కష్టపడి పెంచిన తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రి లేడు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ పదో తరగతి, ఉట్నూరు ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. నాగార్జున సాగర్ లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 1990-93 లో డిగ్రీ పూర్తి చేశాడు. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అంటే నిరుపేద, అణగారిన వర్గాల విద్యార్థులను మేధావులుగా త...

నెట్ ప్రాథమిక " కీ " విడుదల

చిత్రం
గత నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన జాతీయ అర్హత పరీక్ష( నెట్) ఆన్సర్ కీలు విడుదలయ్యాయి. యూజీసీనెట్/ ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో నెట్ ప్రాథమిక కీ వివరాలను పొందుపరిచారు. ప్రాథమిక కీలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కూడా కల్పించారు. సరైన ఆధారాలతో అభ్యంతరాలు పంపవచ్చు. అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం త్వరలో నెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సాహిత్యంలో 2020 జూన్ కటాఫ్... తెలుగు సాహిత్యంలో 2020 జూన్ ఫలితాలను పరిశీలిస్తే 261 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించినట్లు గమనించవచ్చు. వీరిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అన్ని కేటగిరీలలో కలిపి కేవలం 33 మంది మాత్రమే అర్హత సాధించారు. 2020 జూన్ నెట్ ఫలితాలను గమనిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ కట్ఆఫ్ మార్కుల శాతం 54.67(ఓ సీ), 50.67(ఓ బీసి), 46.67(ఎస్సీ), 43.33(ఎస్టీ) కటాఫ్ గమనించవచ్చు .

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్

చిత్రం
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2017లో విడుదలైన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్, స్క్రీనింగ్ టెస్ట్ విధానాన్ని పరిశీలించడం మంచిది. 2017కు ముందు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ విధానం ఆయాయూనివర్సిటీలు ఇంటర్వ్యూ విధానం ద్వారా చేపట్టే వారు. ఈ ప్రక్రియను మార్చాలనీ, మరింత పారదర్శక భర్తీ ప్రక్రియా విధానాన్ని చేపట్టాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 2017 నోటిఫికేషన్ ద్వారా వడపోత విధానాన్ని ప్రవేశపెట్టారు. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయా విశ్వవిద్యాలయాలు విడివిడిగా, వారి నిబంధనలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలను పూర్తి చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే 2017 నోటిఫికేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. 2017 నోటిఫికేషన్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఏపీలోని 13 యూనివర్సిటీలు 2017లో నోటిఫికేషన్లు విడుదల చేశాయి. విశ్వవిద్యాలయాల నిబంధనలకు అనుగుణంగా ఖాళీలను నోటిఫై చేశాయి. రాష్ట్రంలోని 13 యూనివర...

మన వినుకొండ - చరిత్ర, సాహిత్యం

చిత్రం
చారిత్రక, సాంస్కృతిక, సాహిత్యాల నిలయం  మన వినుకొండ.  శైవ, జైన, బౌద్ధ, మహమ్మదీయ, క్రైస్తవ సంస్కృతికి ప్రతీకగా భిన్నత్వంలో ఏకత్వంలా మన వినుకొండ ప్రాంతం విరాజిల్లింది. విష్ణుకుండినుల వంటి గొప్ప రాజ వంశీయుల పరిపాలనలో వర్ధిల్లిన మన వినుకొండ ప్రాంతం అంతే గొప్ప సాహిత్యకారులను అందించి తెలుగు సాహిత్య చరిత్రకు వన్నె తెచ్చింది. మన వినుకొండ నేలను ముద్దాడిన ఎందరో కవులు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవచేసారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నటికీ నిలిచిపోయే గొప్ప కావ్యాలను రచించి ప్రపంచ పటంలో మన వినుకొండ ఖ్యాతిని రెపరెపలాడించారు. తెలుగు సాహిత్య పరిమళాలు చేరిన ఏ ప్రాంతానికి వెళ్లినా మన వినుకొండ గురించి తెలియని వారుండరు. "వినుకొండ ప్రాంత" ప్రస్తావన త్రేతాయుగంలోనే కనిపిస్తుందని పురాణకారుల నమ్మకం. చారిత్రక, శాసన ఆధారాలను పరిశీలిస్తే విష్ణుకుండినుల కాలంలో " వినుకొండ ప్రాంత "  ఆధారాలు పూర్తిగా లభిస్తాయి. ఆంధ్ర దేశాన్ని ఏలిన గొప్ప రాజవంశాలలో విష్ణుకుండినులు పేరెన్నికగన్న వారు. విష్ణుకుండినులు క్రీ.శ. 5, 6 శతాబ్దంలోనే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తరువాత వీరి సామ్రాజ్యాన్ని విస్తరించి ఆంధ...

ఆర్ సెట్ ఇంటర్వ్యూ

చిత్రం
  రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. అర్ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ రెండు విడతలుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు తిరిగి 17 నుంచి 18 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్ సెట్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు. తెలుగు సాహిత్యంలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. పీహెచ్డీ ప్రవేశం కోసం గతంలో ఆయా విశ్వవిద్యాలయాలు ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. అలా కాకుండా అర్ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఒకే చోట ఇంటర్వ్యూలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఏ అభ్యర్థికి ఏ సమయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అనే పూర్తి వివరాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఆర్ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యంలో 32 ఫుల్ టైం, 20 పార్ట్ టైమ్ సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ కోసం కొద్ది సమయమే మిగిలి ఉండడంతో అర్హత సాధించిన అభ్యర్థులందరూ "రీసెర...