జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2017లో విడుదలైన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్, స్క్రీనింగ్ టెస్ట్ విధానాన్ని పరిశీలించడం మంచిది. 2017కు ముందు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ విధానం ఆయాయూనివర్సిటీలు ఇంటర్వ్యూ విధానం ద్వారా చేపట్టే వారు. ఈ ప్రక్రియను మార్చాలనీ, మరింత పారదర్శక భర్తీ ప్రక్రియా విధానాన్ని చేపట్టాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 2017 నోటిఫికేషన్ ద్వారా వడపోత విధానాన్ని ప్రవేశపెట్టారు. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయా విశ్వవిద్యాలయాలు విడివిడిగా, వారి నిబంధనలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలను పూర్తి చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే 2017 నోటిఫికేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు.


2017 నోటిఫికేషన్..

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఏపీలోని 13 యూనివర్సిటీలు 2017లో నోటిఫికేషన్లు విడుదల చేశాయి. విశ్వవిద్యాలయాల నిబంధనలకు అనుగుణంగా ఖాళీలను నోటిఫై చేశాయి. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీల్లో సుమారు 63 సబ్జెక్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రోస్టర్ పాయింట్లకు కనుగుణంగా ఖాళీలను చూపించారు. ఉదాహరణకి వి.ఎస్.యు.లోని తెలుగు శాఖలో 4 ఖాళీలు ఉంటే, ఓసి కి 2 , ఎస్సీ కి 1, ఎస్టీ కి 1 కేటాయించారు. ఇలా ప్రతి విశ్వవిద్యాలయంలో రోస్టర్ నిబంధనలకు అనుగుణంగా ఖాళీలు నోటిఫై చేశారు. ఈ నోటిఫికేషన్లన్నీ 2017 డిసెంబరు, 2018 జనవరి నెలల్లో విడుదల అయ్యాయి. అభ్యర్థులు వారి సబ్జెక్టులు, ఖాళీలు, రోస్టర్ పాయింట్ల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయానికి విడివిడిగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత విశ్వవిద్యాలయాల ఏకాభిప్రాయంతో స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకుంది. పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసిన తర్వాత, పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు విశ్వవిద్యాలయాలు విడివిడిగా ఇంటర్వ్యూలు నిర్వహించుకునే ఏర్పాట్లు చేశారు. 


స్క్రీనింగ్ పరీక్ష విధానం..

స్క్రీనింగ్ పరీక్షలన్నీ ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్ష యూజీసీ నెట్ తరహాలోనే రెండు పేపర్లుగా విభజించారు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ పరీక్షను పేపర్ - 1 గా 120 మార్కులకు నిర్వహించారు. సబ్జెక్టు పేపర్ ను 180 మార్కులకు నిర్వహించారు. మొత్తం 300 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. పేపర్ - 1 కోసం రెండు గంటల వ్యవధి, పేపర్-2 కోసం మూడు గంటల వ్యవధి కేటాయించారు. 2018 జనవరిలో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. దరఖాస్తు, స్క్రీనింగ్ పరీక్ష మధ్య సుమారు రెండున్నర నెలల వ్యవధి మాత్రమే ఉన్నట్లుగా గుర్తించవచ్చు. మైనస్ మార్కులు ఉండటం, పరీక్ష స్థాయి పెరగడంతో పరీక్షలు రాసిన అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ చాలా కఠినంగా ఉందన్న అభిప్రాయాన్ని అప్పట్లో వ్యక్తం చేశారు. తెలుగు సబ్జెక్ట్ లో సుమారుగా 1450 మంది పరీక్షలు రాసినట్లు సమాచారం. ఫలితాలు విడుదలైన తరువాత ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందు పరిచిన మార్కుల జాబితాను పరిశీలిస్తే తెలుగు విభాగంలో 300 మార్కులకు 175.95 మార్కులు మొదటి స్థానంలో ఉన్నట్లు కనిపించాయి. దీనిని బట్టి పరీక్ష ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు

త్వరలో ఏపీ, తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నత విద్యావంతులు ఎదురుచూస్తున్నారు. భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది అన్న విషయంలో స్పష్టత లేదు. ఇంటర్వ్యూ విధానం ద్వారానే భర్తీ చేస్తారా.? మళ్లీ స్క్రీనింగ్ టెస్ట్ వైపే మొగ్గు చూపుతారు అన్న విషయం అధికారికంగా తెలియాల్సి వుంది. గత అనుభవాల దృష్ట్యా " స్క్రీనింగ్ పరీక్ష " నిర్వహిస్తే పరీక్ష స్థాయి కఠినంగా ఉండే అవకాశం లేకపోలేదు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కొనసాగించటం ఉత్తమం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్