జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. అర్ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ రెండు విడతలుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు తిరిగి 17 నుంచి 18 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్ సెట్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు. తెలుగు సాహిత్యంలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. పీహెచ్డీ ప్రవేశం కోసం గతంలో ఆయా విశ్వవిద్యాలయాలు ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. అలా కాకుండా అర్ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఒకే చోట ఇంటర్వ్యూలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఏ అభ్యర్థికి ఏ సమయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అనే పూర్తి వివరాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఆర్ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యంలో 32 ఫుల్ టైం, 20 పార్ట్ టైమ్ సీట్లను భర్తీ చేయనున్నారు.
ఇంటర్వ్యూ కోసం కొద్ది సమయమే మిగిలి ఉండడంతో అర్హత సాధించిన అభ్యర్థులందరూ "రీసెర్చ్ ప్రపోజల్" పై పూర్తిగా దృష్టి సారించాలి. తెలుగు సాహిత్యంలో పరిశోధన కోసం తక్కువ సీట్లు అందుబాటులో ఉండడం, పరిశోధన చేయాలనే ఆసక్తి ఎక్కువ మందికి ఉండడంతో పోటీ తీవ్రంగానే ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అభ్యర్థులు ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కొన్నారు అన్న అంశంపై తుది ఫలితాలు ఉండే అవకాశం లేకపోలేదు. ఇది వరకే జేఅర్ఎఫ్ అవార్డు సాధించిన వారు, నెట్, సెట్ అర్హత ఉన్న వారు, ఇవేమీ లేకుండా కేవలం ఆర్ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ సబ్జెక్టుపై మంచి పట్టు ఉంటుంది. దీంతో పాటు ఇంటర్వ్యూ సమయంలో " రీసెర్చ్ ప్రపోజల్ " మీద పూర్తి సన్నద్ధత కలిగి ఉండటం మంచిది. అభ్యర్థులందరూ తాము చేయాలనుకునే పరిశోధనకు సంబంధించిన రీసెర్చ్ ప్రపోజల్ ను తయారు చేసుకోవాలి. తాము ఏ అంశంపై పరిశోధన చేయాలి అనుకుంటున్నారు, ఆ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ఎలా సేకరించాలి, తాము పరిశోధన చేయాలనుకునే అంశం పై ఇదివరకే పరిశోధన జరిగి ఉంటే ఏ కోణంలో పరిశోధన జరిగింది, తాము కొత్తగా ఎలాంటి సిద్దాంతాలు ప్రతిపాదించాలి.. వంటి అంశాలతో కూడిన రిసెర్చ్ ప్రపోజల్ తయారు చేసుకోవాలి. ఈ విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. యూనివర్శిటీలో ప్రొఫెసర్లు, ఇదివరకే పీహెచ్డి పూర్తయిన వారు, ప్రస్తుతం పీహెచ్డి చేస్తున్న వారితో చర్చించడం ఉత్తమ మార్గం.
తెలుగు సాహిత్యం, మీరు ఎంచుకున్న పరిశోధన అంశం, వీటితో పాటు పరిశోధనా పద్ధతులకు సంబంధించిన అంశాలు కూడా ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. రీసెర్చ్ ప్రపోజల్ తయారు చేసుకోవడం పూర్తయితే, ఇంకా సమయం వుంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న పరిశోధనకు సంబంధించిన పుస్తకాలను పరిశీలించడం మంచిది. ఆచార్య వెలుదండ నిత్యానందరావు సంకలనం చేసిన "తెలుగు పరిశోధన వ్యాస మంజరి", డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ రాసిన "మద్రాసులో తెలుగు పరిశోధన, ప్రచురణ" వంటి పుస్తకాలను పరిశీలిస్తే పరిశోధన అంశాలపై అవగాహన పెరగడంతోపాటు మనం ఎంచుకునే సిద్ధాంత వ్యాసానికి, " టైటిల్ "ఎలా పెట్టాలనే అంశాలు తెలుస్తాయి. అలాగే, పరిశోధన పద్ధతులకు సంబంధించి ప్రొఫెసర్ గంధం అప్పారావు, ఆర్వీయస్ సుందరం, డాక్టర్ జయప్రకాష్ లు రచించిన పరిశోధన పద్ధతులు వంటి పుస్తకాలు ఓ మారు చూడడం మంచిది. పీహెచ్డిలో ప్రవేశం పొందిన తరువాత కూడా ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి. అన్నిటి కన్నా ఇంటర్వ్యూ లో కీలకంగా మారే అంశం " రీసెర్చ్ ప్రపోజల్ ". కాబట్టి, ఈ కొద్ది సమయాన్ని రీసెర్చ్ ప్రపోజల్ కోసం కేటాయించటం ఆన్ని విధాలా మంచిది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి