జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..


ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వి.పద్మ తెలుగు సాహిత్యంలో యూజీసీ నెట్, ఏపీసెట్ రెండింటిలో అర్హత సాధించారు. ఉద్యోగం, చదువు రెంటినీ సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించారు. నెట్ పరీక్ష కోసం సిద్ధపడుతున్న విద్యార్థుల కోసం, వి.పద్మ తాను ఎలా ప్రిపేర్ అయ్యి నెట్ పరీక్షలో అర్హత సాధించారో చెప్పారు. నెట్ రాసే అభ్యర్థలు ఎలాంటి మెలకువలు పాటించాలి అనే విషయం ఆమె మాటల్లోనే....  

తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు నెట్ అర్హత సాధించటం ఎంతో అవసరం. పీజీ తరువాత పరిశోధనల వైపు వెళ్లాలన్నా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కావాలన్నా, యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా నియామకం పొందాలన్నా నెట్ లేదా ఏపిసెట్ అర్హత ఉండాలి. ఇదే కాకుండా పీజీ అర్హతతో ప్రైవేటు కళాశాలల్లో ఉద్యోగాలను చేయాలనుకునే వారు తమ రెజ్యూమ్ లో నెట్ అర్హత ప్రధానంగా చూపించుకోవచ్చు. నెట్ అర్హత సాధిస్తే సబ్జెక్టు మీద మంచి పట్టు ఉన్నట్లు భావిస్తారు. తెలుగు సాహిత్యంలో వందల మంది అభ్యర్థులు నెట్ పరీక్ష రాస్తున్నప్పటికీ కేవలం ఆరు శాతం మంది మాత్రమే అర్హత సాధిస్తారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యం చదివిన అభ్యర్థులు కూడా ఉంటారు..

ఎలా చదవాలంటే..

మనం ప్రాథమికంగా చేసే మిస్టేక్ ఏమిటంటే నెట్ నోటిఫికేషన్ వెలువడిన తరువాత ప్రిపరేషన్ ప్రారంభిస్తాం. ఇది సరైన విధానం కాదు. నెట్ పరీక్షకు కూడా దీర్ఘకాలం, ప్రణాళికాబద్ధ ప్రిపరేషన్ అవసరం. తెలుగు సాహిత్యం, భాషా చరిత్ర, విమర్శ, వ్యాకరణం వంటి సబ్జెక్టుల మీద గట్టి పట్టు సాధించాలి. ప్రామాణిక పుస్తకాలు మార్కెట్లోఎన్నో అందుబాటులో ఉన్నప్పటికీ మనకి నచ్చిన ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకి తెలుగు సాహిత్య చరిత్రను ఆరుద్ర, పింగళి లక్ష్మీకాంతం, డాక్టర్ జి.నాగయ్య, ఆచార్య వెలమల సిమ్మన్న, ఆచార్య ఎస్వీ రామారావు...ఇలా చాలా గొప్ప రచయితలు రాశారు. వీటిలో మనకు బాగా అర్ధమయ్యి, నచ్చిన ఒక పుస్తకాన్ని ఎన్నుకోవాలి. ఇలా సిలబస్ వారీగా పుస్తకాలు సమకూర్చుకోవాలి. మనం సమకూర్చుకున్న పుస్తకాలను పదేపదే చదవాలి. నెట్ పరీక్షకు ముందు కనీసం ఆరు నెలల ప్రణాళిక రచించుకోవాలి. మనకు సబ్జెక్టు ఎంత ముఖ్యమో పేపర్ -1 జనరల్ నాలెడ్జ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కూడా అంతే ముఖ్యం. చాలా మంది సబ్జెక్టు బాగా చదువుతారు కానీ, మొదటి పేపర్ నిర్లక్ష్యం చేస్తారు. అలా కాకుండా రెండిటికీ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. రోజువారి ప్రిపరేషన్ టైం టేబుల్ కచ్చితంగా  వేసుకోవాలి. కనీసం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రిపరేషన్ ఉండేలా చూసుకోవాలి. మనం నెట్ లో జేఆర్ఎఫ్  సాధించాలనే లక్ష్యం పెట్టుకోవాలి. జేఆర్ఎఫ్ మిస్ అయినా నెట్ క్వాలిఫై అవుతాం. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా టైం టేబుల్ రచించుకోవాలి. 

అవగాహన ముఖ్యం..

మొదటిగా ప్రామాణిక పుస్తకాలను అవగాహనతో చదవాలి. ప్రామాణిక పుస్తకాలు చదవడం పూర్తయిన తర్వాత మార్కెట్లో దొరికే మెటీరియల్ చూసుకోవచ్చు. సొంత నోట్స్ తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. మనం తయారు చేసుకున్న నోట్స్ మనకు ఎప్పటికైనా ఉపయోగ పడుతుంది. మనం చదివే విషయాన్ని వివిధ కోణాల్లో అర్థం చేసుకొని చదవాలి. ఎందుకంటే నెట్ లో అడిగే ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. ఒక ప్రశ్నలో మూడు ప్రశ్నలు ఇమిడి ఉంటాయి. కాబట్టి అవగాహన ముఖ్యం. ఇలా ఆరు నెలలు ప్రణాళికతో చదివితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.నెట్ పరీక్ష ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. కాబట్టి ఒక సారి పరీక్షలో మనం అర్హత సాధించకపోయినా నిరుత్సాహ పడకూడదు. ప్రిపరేషన్ కొనసాగిస్తూ తరువాత పరీక్ష కోసం చదవాలి.ఇలా చదివితే తప్పకుండా విజయం సాధిస్తారు. నెట్ లో విజయం సాధించేదాకా పట్టు సడలించ వద్దు. ఆల్ ద బెస్ట్.

- వి పద్మ

బీఏ ( తెలుగు), ఎంఏ (తెలుగు), బీఈడీ(తెలుగు), డీఈడీ(తెలుగు), యూజీసీ-నెట్ (తెలుగు), ఏపీసెట్ (తెలుగు ), (పీహెచ్.డీ)

కామెంట్‌లు

  1. ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు. నేను కూడా మొదటి సారి చాలా నిర్లక్ష్యంగా (ముఖ్యంగా పేపర్ -1) చదివాను. తరువాత సొంతంగా నోట్స్ రాసుకోవడం, ప్రణాళిక ప్రకారం చదవడం ద్వారా అర్హత ‌సాధించాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
  2. మీ అనుభవాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు మేడమ్ గారు

    రిప్లయితొలగించండి
  3. చాలా మంచి విషయాలు తెలిపారు ధన్యవాదాలు మేడమ్

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్