జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

పార్ట్ టైమ్ పీహెచ్.డి

 

డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్.డి) పూర్తిచేయడం ఉన్నత విద్యావిధానంలో అత్యున్నత విద్యార్హత. మన విద్యా వ్యవస్థలో పీహెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందడం ఉన్నత శిఖరాన్ని అధిరోహించడం లాంటిది. డాక్టరేట్ పట్టా పొందితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎంచుకున్న సబ్జెక్టును బట్టి కెరియర్ పరంగా దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పీహెచ్.డి పూర్తిచేసి డాక్టరేట్ పట్టా పొందడం గౌరవప్రదమైన ఒక హోదా పొందడం లాంటిది. ఒకే అంశంపై పరిశోధన చేసి కొత్త విషయాలను కనుగొనడం, నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించి మేధావుల చేత ఆమోదింపజేయడం చాలా గొప్ప విషయం. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న చాలామందికి పీహెచ్.డి పట్టా పొందడం ఒక కలగా మిగిలి ఉంటుంది. వివిధ కారణాల రీత్యా డిగ్రీ, పీజీ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందిన చాలా మందికి పరిశోధన చేయాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారి కోసమే వివిధ విశ్వవిద్యాలయాలు పార్ట్ టైం విధానంలో పరిశోధన చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఉద్యోగం చేస్తూనే ఎంచుకున్న రంగంలో పరిశోధన పూర్తి చేసి పీహెచ్.డి పట్టా పొందవచ్చు.

పార్ట్ టైమ్ పీహెచ్.డిలో ప్రవేశం ఇలా..

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం రెగ్యులర్ పీహెచ్.డితో సమానంగా పార్ట్ టైం పీహెచ్.డిని  పరిగణిస్తారు. ఫుల్ టైమ్ పీహెచ్.డిలో ప్రవేశం పొందితే యూనివర్సిటీలో ఉంటూ ప్రతిరోజూ డిపార్ట్మెంట్ కి వెళ్లి పరిశోధన చేయాల్సి ఉంటుంది. అదే పార్ట్ టైమ్ పీహెచ్.డి విధానాన్ని ఎంచుకుంటే ఉద్యోగం చేస్తూనే పరిశోధన పూర్తి చేయాలి. పార్ట్ టైమ్ పీహెచ్.డిలో ప్రవేశం కల్పించడానికి ఆయా యూనివర్సిటీలు వేరువేరుగా విధివిధానాలు నిర్ణయిస్తాయి. రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ వంటి అత్యున్నత జాతీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్.డి ప్రవేశానికి వేరువేరు మార్గదర్శకాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీలలో పార్ట్ టైం పీహెచ్.డి ప్రవేశం పొందడానికి రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (అర్ సెట్) రాయాల్సి ఉంటుంది. అర్ సెట్ లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు మాత్రమే పార్ట్ టైమ్ పీహెచ్.డి చేయడానికి అర్హత సాధిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల్లో సుమారు 62 సబ్జెక్టుల్లో పీహెచ్.డి ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. యూజీసీ నెట్, ఏపి సెట్, గేట్ వంటి అర్హతలు ఉన్నప్పటికీ ఆర్ సెట్ ప్రవేశ పరీక్షలో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. మనం ఎంచుకున్న సబ్జెక్టులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా విశ్వవిద్యాలయాలు మౌఖిక పరీక్ష నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి పరిశోధన చేయడానికి అవకాశం కల్పిస్తాయి. పార్ట్ టైమ్ విధానంలో పరిశోధన చేయాలనుకునేవారు ఆరు సంవత్సరాల లోపు వారి పరిశోధన పూర్తి చేయాల్సి ఉంటుంది.

పార్ట్ టైమ్ పీహెచ్.డి అర్హతలు..

పార్ట్ టైమ్ పీహెచ్.డి చేయాలనుకునే వారు 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పార్ట్ టైమ్ పరిశోధకులకు వయో పరిమితి నిబంధన లేదు. ప్రభుత్వ, ప్రైవేట్  ఉద్యోగాలు చేస్తున్న వారికి రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు బోధన, ఉద్యోగ అనుభవం ఉండాలి. విశ్వవిద్యాలయాలు, అనుబంధ పీజీ సెంటర్లలో టీచింగ్ ఫ్యాకల్టీ, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, వివిధ సంస్థలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచింగ్ సిబ్బందికి ఆయా విశ్వవిద్యాలయాల మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా పార్ట్ టైమ్ పీహెచ్.డి చేయడానికి అర్హులే. ఉపాధ్యాయులకు నాలుగు సంవత్సరాల పాటు బోధన అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ సమయంలో ఆయా విశ్వవిద్యాలయాలకు వారి సర్వీస్ సర్టిఫికెట్ తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్.ఓ.సీ) సమర్పించాల్సి ఉంటుంది. నాలుగు సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఆర్ సెట్ లో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసి పార్ట్ టైమ్ విధానంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందవచ్చు.






కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్