జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20 చివరి తేదీ. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుత నోటిఫికేషన్లో అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే దరఖాస్తు, ఒకే ఫీజు ఉండడం మంచి విషయం. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులందరూ వివిధ యూనివర్సిటీల నోటిఫికేషన్లను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. అవసరమైన సర్టిఫికెట్లు, పరిశోధన పత్రాలు, పాస్పోర్ట్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం దగ్గర పెట్టుకొని దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవ్వాలి. ఉన్నత విద్యాశాఖ అధికారికి వెబ్సైట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు స్టెప్ 1, స్టెప్ 2 విధానాన్ని పొందుపరిచారు.
స్టెప్ 1 :
ముందుగా స్టెప్ 1 లో అభ్యర్థుల ప్రాథమిక వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. ఇందులో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది, ఇందులో పేరు, పుట్టిన తేదీ, కేటగిరి, ఆధార్ నెంబర్తో పాటూ పాస్పోర్ట్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెండో భాగంలో శాశ్వత చిరునామా, మొబైల్ నంబర్, ఈ మైల్ ఐడి నమోదు చేయాలి. మూడో భాగంలో యూజర్ ఐడి, పాస్వర్డ్ నమోదుతో మన అకౌంట్ క్రియేట్ అయి స్టెప్ 1 నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
స్టెప్ 2 :
దరఖాస్తు ప్రక్రియలో స్టెప్ 2 ముఖ్యమైన విభాగం. మన యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అయి స్టెప్ 2 లోకి వెళ్లాల్సి ఉంటుంది. స్టెప్ 2 లో ముఖ్యమైన వివరాలు నమోదు చేయాలి కాబట్టి, అభ్యర్థులు జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ప్రతి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నమోదు చేయడం ఉత్తమం.
స్టెప్పు 2 లో ముందుగా ఏ ఉద్యోగానికి , ఏ డిపార్ట్మెంట్ కు దరఖాస్తు చేస్తున్నారో నమోదు చేయాలి. ఆ తరువాత ఏ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటున్నారో నమోదు చేయాలి. ఒకే ఫీజు ఒకే దరఖాస్తు కాబట్టి మీ విభాగం వారీగా అన్ని యూనివర్సిటీలకు నమోదు చేసుకోవడం మంచిది. ఆ తర్వాత విద్యార్హతలు.. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ, ఎంఫిల్, పిహెచ్.డి., జెఆర్ఎఫ్, నెట్, సెట్ వంటి విద్యార్హతలు ఏ సంవత్సరంలో, ఏ యూనివర్సిటీ/ కాలేజీ నుంచి ఎంత పర్సంటేజ్ తో ఉత్తీర్ణత సాధించారు అనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమైన విభాగం రీసెర్చ్ పబ్లికేషన్స్ గురించి.. మీరు రాసిన పరిశోధనా పత్రాలు ఏ జర్నల్లో ప్రచురితమయ్యాయి, వాల్యూమ్ నెంబర్, పేజీ నెంబర్, పబ్లిషర్ పేరు, ఐ.ఎస్.ఎస్.ఎన్ నెంబర్, పరిశోధన పత్రం శీర్షిక, పరిశోధనా పత్రాన్ని ఒక్కరే రాశారా, ఇతరులతో కలిసి రాశారా, పరిశోధనా పత్రం ప్రచురించిన జర్నల్ వెబ్ లింక్ వంటి అంశాలు పొందుపరచాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా చదివిన తర్వాత వివరాలు నమోదు చేయడం ఉత్తమం. ఆ తరువాత ఎక్స్పీరియన్స్, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు ఏమైనా ఉంటే నమోదు చేయాలి.
చివరిగా మనకు అనుకూలమైన పరీక్షా కేంద్రాలను మూడు ఎంపిక చేసుకుని వరుస క్రమంలో ఇవ్వాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్, ఇతర ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రింటెడ్ దరఖాస్తుకు అవసరమైన సర్టిఫికెట్లు జత చేసి విడివిడిగా ఆయా యూనివర్సిటీలకు ఈనెల 27 లోపు రిజిస్టర్ పోస్టులో పంపిస్తే దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తయినట్లే. అత్యున్నతమైన ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారన్న విషయాన్ని మరవకుండా ఒకటికి రెండుసార్లు తమ వివరాలను సరిచూసుకొని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.
Good importation
రిప్లయితొలగించండి