పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

ది ప్రోఫెట్ ( The Prophet )

చిత్రం
                 " అర్ధం లేని అన్వేషణ చేయను "                       - ఖలీల్ జీబ్రాన్ ఖలీల్ జీబ్రాన్ గొప్ప తాత్వికుడు. లెబనాన్ దేశానికి చెందిన రచయిత. దానికన్నా ముందు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు. జీవితాన్ని అమితంగా ప్రేమించిన ఖలీల్ కేవలం 49 ఏళ్ల వరకే ఈ భూమిపై ఉన్నాడు. అయితేనేం, ప్రపంచానికి కావలసినంత తత్వాన్ని, కవిత్వాన్ని అందించాడు. ఖలీల్ క్రైస్తవ మతానికి చెందిన క్యాథలిక్. కానీ, తన 14వ ఏటనే " నేను ఎంతో కాలం క్యాథలిక్ గా ఉండబోను, నేను మత వ్యతిరేకినైపోతాను.." అని చెప్పాడు. మతాన్ని వ్యతిరేకించాడే కానీ మనిషిని ప్రేమించాడు. తానే ఓ ప్రవక్తలా మారి మానవత్వాన్ని బోధించాడు. కొన్నిసార్లు విషాదం, ఒంటరితనంలో నుంచి ప్రపంచాన్ని మార్చగలిగే ఆలోచనలు పుడతాయి. లోతైన ఆలోచనలే అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధాలు. ఆలోచనలో నుంచి పుట్టే అర్థవంతమైన సిద్ధాంతాలు ప్రపంచ గతిని కూడా మార్చగలవు. ఖలీల్ కూడా గొప్ప ఆలోచనాపరుడు. అత్యంత పేదరికం, వలస జీవితం కుటుంబంలో తల్లి, చెల్లి, అన్న చనిపోవడం, విషాదం, ఒంటరితనం ఖలీల్ తాత్విక ...

లైబ్రరీ లేదూ.. చందమామా లేదు..

చిత్రం
ఆదివారం వచ్చిందంటే చాలు లైబ్రరీకి పరిగెత్తే వాళ్ళం. ఎనిమిదో తరగతిలో మా నాన్న చేయి పట్టుకుని మొదటిసారి లైబ్రరీకి వెళ్లినట్టు గుర్తు. ఆ ఒక్కసారే. ఆ మర్నాటి ఆదివారానికల్లా ఒంటరిగా వెళ్లడం అలవాటయ్యింది. నాతో పాటూ మా అన్నయ్య, మా ఫ్రెండ్స్ అందరం లైబ్రరీని ఇష్టపడే వాళ్ళం. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల కల్లా మా ఊరు పెద్ద బజారు సందులో ఉన్న  లైబ్రరీకి ఎవరు ముందు వెళ్తారా అని పరుగులు తీసే వాళ్లం. లైబ్రరీ వాతావరణం బలే ఉండేది. చిన్నదైనా ముచ్చటగా ఉండేది. ముఖ ద్వారం దగ్గర లైబ్రరీ తాత రాజులా కూర్చుని కనిపించేవాడు. లైబ్రరీ అంటెండర్ అయిన ఆయన్ని అందరూ లైబ్రరీ తాత అనేవాళ్ళు. ఆయన ఎప్పుడు ఉద్యోగంలో చేరాడో తెలీదు కానీ, తాతగా మారినప్పుడే ఆ లైబ్రరీకి అందం చేకూరినట్లు ఉండేది. లైబ్రరీ వరండాలో పెద్ద పెద్ద టేకు బల్లలూ, కుర్చీలు ఉండేవి. లైబ్రరీ తాత పక్కనే మమ్మల్ని హెచ్చరిస్తున్నట్లు నిశ్శబ్దం అన్న బోర్డు కత్తిలా వేలాడుతూ కనిపించేది. మా లాంటి పిల్లలు కాస్త కిక్కురుమన్నా ఉరుము ఉరిమినట్లు లైబ్రరీ తాత కళ్ళతోనే మమ్మల్ని హెచ్చరించే వాడు. ఆ లైబ్రరీలో ' పిన్ డ్రాప్ సైలెంట్ ' అన్న పదం నూటికి నూరుపాళ్లు నెరవేరుతుంది. వరం...

ఆస్తులు అమ్ముకుని...ఒక యోగి ప్రస్థానం ( రాబిన్ శర్మ )

చిత్రం
" నాకు జీవితమంటే ఒక్క క్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తి కాదు; అది చేతికందిన కాంతులు వెదజల్లే టార్చ్ వంటిది; రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక." - జార్జ్ బెర్నార్డ్ షా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాల జాబితాలో ' The Monk who sold his Ferrari ' ముందు వరుసలో ఉంటుంది. ప్రఖ్యాత కెనడియన్ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాబిన్ శర్మ ఈ పుస్తక రచయిత. The Monk who sold his Ferrari ఇప్పటికే 76 భాషల్లో అనువదించారు. భారతీయ మూలాలు ఉన్న రాబిన్ శర్మ ఇరవైఐదేళ్లకే న్యాయవాద వృత్తిని వదిలేసి రచయితగా మారాడు. The Monk who sold his Ferrari పుస్తక రచనతో రాబిన్ శర్మ ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో చేరిపోయాడు. తత్వం, తర్కం, ఆధ్యాత్మికత కలగలిపిన రచనాశైలి రాబిన్ శర్మ  ప్రత్యేకత. పాఠకుల ఆలోచనలు ప్రభావితం చేయడంలో రాబిన్ శర్మ దిట్ట.  ఆలోచన పుట్టినప్పుడే తర్కం పుట్టింది. తర్కం పుట్టినప్పటి నుంచి " జీవితమంటే...?? " అన్న ప్రశ్నకు సమాధానాన్ని మనిషి వెతుకుతూనే ఉన్నాడు. రూసో, వోల్టేర్, కాంట్, షోపెన్ హూవర్, నీషే, బెర్ట్రాండ్ రస్సెల్, జీన్-పాల్ సా...

ఓరు కుప్పై కథై ( ఒక మురికి కథ )

చిత్రం
లేచిపోయింది. 1927లో చలం మైదానంలో ' రాజేశ్వరి ' కూడా లేచిపోయింది. అంతకు ముందూ, ఆ తరువాత ఎంతో మంది లేచిపోతూనే ఉన్నారు. ప్రతిరోజూ ఏదో ఓ దినపత్రికలో లేచిపోయే సింగిల్ కాలం వార్తలను మనం చదువుతూనే ఉన్నాం. ఓరు కుప్పై కథై లో ' పోంగొడి ' కూడా లేచిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది. లేచిపోవడానికి ముందు ఏం జరిగేది. ఇలాంటి లేచిపోయిన సంఘటనల కథలు మనకు అంతగా తెలియకపోవచ్చు. లేచిపోయిన కథలన్నీ విషాదాంతాలు కావడం మాత్రం సహజంగా అందరికీ తెలుసు. లేచిపోవడాన్ని సమర్ధించుకున్న చలం మైదానం నవల కూడా విషాదాంత కథే. ఓరు కుప్పై కథై చిత్రం కూడా విషాదాంత చిత్రమే. కానీ, ఇలాంటి విషాదాంత కధలు కళ్ళకు కట్టినట్లు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇలాంటి సంఘటనలు నిజంగా చూస్తే భయం కలుగుతుంది. ఇలాంటి సంఘటనలు మనిషిని హెచ్చరిస్తాయి. అందుకే, ఓరు కుప్పై కథై చిత్రం ఇరవైఒక్క ఏళ్లు దాటిన వాళ్ళు చూడాల్సిన చిత్రం. ఓరు కుప్పై కథై అంటే ' ఓ మురికి కథ ' అని అర్థం. చెన్నై మురికి వాడలో ఓరు కుప్పై కథై సినిమా ప్రారంభమవుతుంది. ఏదైనా కొత్త సినిమాని పరిచయం చేస్తున్నప్పుడు దాని కథ జోలికి వెళ్లక పోవడం మంచిది. కథ ముందుగానే తెలిస్తే సినిమాపై...

సాహిత్య చరిత్ర... ఏ పుస్తకం చదవాలి..?

చిత్రం
తెలుగు సాహిత్య అధ్యయనంలో " ఆంధ్ర సాహిత్య చరిత్ర " ప్రధానమైన అంశం. తెలుగు సాహిత్యం ఎలా పుట్టింది, ఎలా మొదలైంది, ఎలా పరిణామం చెందింది అని చెప్పే శాస్త్రమే తెలుగు సాహిత్య చరిత్ర లేదా ఆంధ్ర సాహిత్య చరిత్ర. యూజీసీ నెట్ అర్హత సాధించాలన్నా, జేఆర్ఎఫ్ అవార్డు పొందాలన్నా ఇతర తెలుగు పోటీ పరీక్షల్లో నెగ్గలన్నా ఆంధ్ర సాహిత్య చరిత్రను విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యం చదివే విద్యార్థులకు ఆంధ్ర సాహిత్య చరిత్ర పాఠ్యాంశం గుండె లాంటిది. డిగ్రీ స్థాయిలోనే తెలుగు సాహిత్య అధ్యయనం ప్రారంభించినప్పుడే సాహిత్య చరిత్ర అధ్యయనాన్ని కూడా ప్రారంభిస్తాం. డిగ్రీ విద్యార్థుల కోసం గతంలో తెలుగు అకాడమీ ప్రచురించిన " ఆంధ్ర సాహిత్య చరిత్ర " పుస్తకం అమూల్యమైనది. సాహిత్య చరిత్ర పట్ల ప్రాథమిక అవగాహన కలిగించడంలో ఈ పుస్తకానికి సాటి లేదు. డిగ్రీ తరువాత పీజీ స్థాయిలో, యూజీసీ నెట్, జేఅర్ఎఫ్ ఇతర పోటీ పరీక్షలకోసం ఆంధ్ర సాహిత్య చరిత్రను విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యంలో నెట్ అర్హత సాధించడానికి యూజీసీ పొందుపరిచిన సిలబస్ లో తెలుగు సాహిత్య చరిత్ర యూనిట్ -3 లో ఉంటుంది. న...

మనిషి ఎలా ఆలోచిస్తే అలా..

చిత్రం
 " మానవుడు సాధించేది మరియు సాధించలేనిది ప్రత్యక్షంగా అతని ఆలోచనల ఫలితమే "  - జేమ్స్ అల్లెన్  ప్రఖ్యాత తత్వవేత్త జేమ్స్ అల్లెన్ రాసిన 'As a Man Thinketh ' పుస్తకం 1902లో ప్రచురితమైంది. జేమ్స్ అల్లెన్ చనిపోవడానికి సరిగ్గా పది సంవత్సరాల ముందు ఈ పుస్తకం ప్రపంచం ముందుకు వచ్చింది. అప్పటికే జేమ్స్ అల్లెన్ ప్రఖ్యాత తత్వవేత్తగా, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే గొప్ప రచయితగా పేరు పొందాడు. ఇప్పటి వ్యక్తిత్వ వికాస రచయితలకు జేమ్స్ అల్లెన్ ఆద్యుడు. ఆయన ఆలోచనల సారాన్ని మొత్తం As a Man Thinketh లో పొందుపరిచాడు. కోట్ల మంది పాఠకులను ప్రభావితం చేసిన ఈ చిన్న పుస్తకం ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదింపబడింది. తెలుగులో కూడా ' మనిషి ఎలా ఆలోచిస్తే అలా..' అన్న పేరుతో అందుబాటులో ఉంది. ఈ పుస్తకం కేవలం 39 పేజీల చిన్న పుస్తకం. ఇందులో 7 వ్యాసాలు మాత్రమే ఉంటాయి. ఒక్కో వ్యాసం ఐదు పేజీలకు మించి ఉండదు. మనసుపెట్టి చదివితే గంటలోపే ఈ విలువైన పుస్తకాన్ని ఆసాంతం చదివేయవచ్చు. కానీ, ఒక మనిషి జీవితానికి సరిపడా వ్యక్తిత్వ పాఠాలు ఇందులో కనిపిస్తాయి. ఇది ఒక్క సారి చదివి వదిలేసే పుస్తకం కాదు. మళ్ళీ మళ్ళీ ...

హార్సిలీ హిల్స్ లో..

చిత్రం
" ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకీ ప్రాంతం ఎంతో విచిత్రంగా కనిపిస్తుంటుంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించినప్పుడు, ఇక్కడి నిశబ్దం, శోభ గమనించినప్పుడు ఆశ్చర్యానందాలు కలుగుతూ ఉంటాయి. ఆ కనిపించే కొండల్ని చూస్తున్నప్పుడు, ఇక్కడి పక్షుల కిలకిలరావాలు, ఆ చెట్ల ఆకుల మధ్య గుండా వీచే గాలి, అటున్న చింత చెట్టు, చిగురించిన మామిడి చెట్టు, సూర్యోదయాన, సంధ్య వేళ ఆ పక్షుల కుహూరవాలు, నిర్మలమైన ఆకాశం, ఇప్పుడిప్పుడే పొడసూపుతున్న నక్షత్రాలు, ఆ పశ్చిమాన సూర్యాస్తమయం ఎంత అద్భుతంగా ఉన్నదో కదా..! వింత వింత రంగులు, చెట్ల ఆకుల మీద తేలియాడే ఆ కాంతి, ఈ నేల సౌందర్యం, అతి సుసంపన్నమైన ఈ భూమిని చూసారా.. "  అంటూ తూర్పు కనుమలలోని దక్షిణ భాగపు కొండల్లో ఉన్న రిషివ్యాలీ, హార్సిలీ హిల్స్ కొండలను చూసినప్పుడు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పరవశించి పోయేవాడు. ఆయన తాత్విక చింతనకు ఇంతటి ప్రశాంతమైన వాతావరణం కూడా ఓ కారణమై ఉండవచ్చు. అంతటి అందమైన హార్సిలీ హిల్స్ పైకి మిట్టమధ్యాహ్నం మేము అడుగుపెట్టాం. రోహిణి కార్తె ఎండలను కొండ కింద మదనపల్లెలోనే వదిలేసి చల్లటి వాతావరణంలోకి మా ప్రయాణం చేరింది. బస్సు దిగిన వెంటన...