జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

మనిషి ఎలా ఆలోచిస్తే అలా..

 " మానవుడు సాధించేది మరియు సాధించలేనిది ప్రత్యక్షంగా అతని ఆలోచనల ఫలితమే " 

- జేమ్స్ అల్లెన్ 

ప్రఖ్యాత తత్వవేత్త జేమ్స్ అల్లెన్ రాసిన 'As a Man Thinketh ' పుస్తకం 1902లో ప్రచురితమైంది. జేమ్స్ అల్లెన్ చనిపోవడానికి సరిగ్గా పది సంవత్సరాల ముందు ఈ పుస్తకం ప్రపంచం ముందుకు వచ్చింది. అప్పటికే జేమ్స్ అల్లెన్ ప్రఖ్యాత తత్వవేత్తగా, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే గొప్ప రచయితగా పేరు పొందాడు. ఇప్పటి వ్యక్తిత్వ వికాస రచయితలకు జేమ్స్ అల్లెన్ ఆద్యుడు. ఆయన ఆలోచనల సారాన్ని మొత్తం As a Man Thinketh లో పొందుపరిచాడు. కోట్ల మంది పాఠకులను ప్రభావితం చేసిన ఈ చిన్న పుస్తకం ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదింపబడింది. తెలుగులో కూడా ' మనిషి ఎలా ఆలోచిస్తే అలా..' అన్న పేరుతో అందుబాటులో ఉంది. ఈ పుస్తకం కేవలం 39 పేజీల చిన్న పుస్తకం. ఇందులో 7 వ్యాసాలు మాత్రమే ఉంటాయి. ఒక్కో వ్యాసం ఐదు పేజీలకు మించి ఉండదు. మనసుపెట్టి చదివితే గంటలోపే ఈ విలువైన పుస్తకాన్ని ఆసాంతం చదివేయవచ్చు. కానీ, ఒక మనిషి జీవితానికి సరిపడా వ్యక్తిత్వ పాఠాలు ఇందులో కనిపిస్తాయి. ఇది ఒక్క సారి చదివి వదిలేసే పుస్తకం కాదు. మళ్ళీ మళ్ళీ చదువుతూ మన లైబ్రరీలో ఎప్పటికీ ఉండాల్సిన పుస్తకం. ఈ పుస్తకంలో కనిపించే ప్రతి పదం నేరుగా మన మనసులో నాటుకు పోతుంది. జేమ్స్ అల్లెన్ తరువాత ఎందరో వ్యక్తిత్వ వికాస రచయితలు ప్రభావవంతమైన రచనలు, పుస్తకాలు రాసినప్పటికీ వాటి మూలం As a Man Thinketh పుస్తకంలో కనిపిస్తుంది.

1. మానవునికి ఆశించడం వలన, ప్రార్ధన వలన ఏది లభించదు. అతడు ఏదైనా న్యాయబద్ధంగానే సంపాదించుకోగలడు. అతని కోరికలు, ఆశలు ఫలించేది కేవలం అతని ఆలోచనలు వాటికి తగ్గట్టుగా ఉన్నప్పుడే.

2. అతి గొప్ప విజయం ఒకప్పుడు మొదట కొంత కాలం కేవలం ఒక కలే.

3. మంచి ఆలోచనల వలన చెడు జరగదనీ, చెడ్డ ఆలోచనల వలన మంచి జరగదనీ ఇది అత్యంత ఖచ్చితమైన న్యాయమైన సత్యం అని తెలుసుకోవాలి.

4. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం.

5. ఒక వ్యక్తి తన పరిస్థితులను నేరుగా తనకు కావలసిన విధంగా ఎంచుకోలేడు. కానీ, తన ఆలోచనను మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ఎన్నుకొని వాటి ద్వారా తన పరిస్థితులను ఖచ్చితంగా రూపొందించుకోగలడు.

6. శరీరం మనసు అడిగే ప్రతి పనిని విధేయతతో చేస్తుంది.

7. బాధ ఎప్పుడూ ఒక చెడ్డ ఆలోచనా ఫలితమే.

8. అనుమానం, భయం ఎప్పుడు ఏది సాధించింది లేదు. ఎప్పుడు సాధించలేవు కూడా. అవి ఎప్పుడు ఓటమికి దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్పశక్తి అన్ని పనిచేయడం ఆగిపోతాయి.

9. ఈ ప్రపంచాన్ని రక్షించేది భవిష్యత్తు గురించి కలలు కనే వారే.

10. మీ ఊహలను ప్రేమించండి, మీ ఆదర్శాలను ప్రేమించండి, మీ హృదయాన్ని కదిలించే సంగీతాన్ని, మీ మదిలో మెదిలే అందమైన దృశ్యాలను, నిర్మలమైన మీ ఆలోచనలను సుందరంగా అలంకరించే ఊహలను ప్రేమించండి. ఎందుకంటే వాటి నుండే సంతోషకరమైన అన్ని పరిస్థితులూ, స్వర్గతుల్యమైన వాతావరణం ఏర్పడతాయి. మీరు వీటిపట్ల నిజాయితీగా ఉంటే చివరకు మీ ప్రపంచం నిర్మించబడుతుంది.

As a Man Thinketh లో కనిపించే ఇలాంటి జెమ్స్ అల్లెన్ మాటలు మన మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన గొప్ప పుస్తకం ఇది.

- శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్