జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
" నాకు జీవితమంటే ఒక్క క్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తి కాదు; అది చేతికందిన కాంతులు వెదజల్లే టార్చ్ వంటిది; రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక."
- జార్జ్ బెర్నార్డ్ షా
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాల జాబితాలో ' The Monk who sold his Ferrari ' ముందు వరుసలో ఉంటుంది. ప్రఖ్యాత కెనడియన్ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాబిన్ శర్మ ఈ పుస్తక రచయిత. The Monk who sold his Ferrari ఇప్పటికే 76 భాషల్లో అనువదించారు. భారతీయ మూలాలు ఉన్న రాబిన్ శర్మ ఇరవైఐదేళ్లకే న్యాయవాద వృత్తిని వదిలేసి రచయితగా మారాడు. The Monk who sold his Ferrari పుస్తక రచనతో రాబిన్ శర్మ ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో చేరిపోయాడు. తత్వం, తర్కం, ఆధ్యాత్మికత కలగలిపిన రచనాశైలి రాబిన్ శర్మ ప్రత్యేకత. పాఠకుల ఆలోచనలు ప్రభావితం చేయడంలో రాబిన్ శర్మ దిట్ట.
ఈ పుస్తకంలో జీవితానికి ఉపయోగపడే ఏడు జ్ఞాన సూత్రాలను రాబిన్ శర్మ చెబుతాడు.1. నీ మనసును నియంత్రించు 2. నీ లక్ష్యాన్ని అనుసరించు 3. కైజెన్ అభ్యసించు 4. క్రమశిక్షణతో జీవించు 5. కాలాన్ని గౌరవించు 6. నిస్వార్థ సేవ చెయ్యి 7. ప్రస్తుతాన్ని ప్రేమించు. ఈ ఏడు అంశాల గురించి జూలియస్, జాన్ మధ్య జరిగే సంభాషణ చదువు తున్న పాఠకులకు మరింత ఆసక్తి కలిగిస్తుంది.
1. సుఖంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి చాలా తేడా ఉంది.
2. జీవితంలో పెద్ద పెద్ద ఆనందాల వెంట పరిగెత్తటం మానేస్తే.. చిన్న చిన్న ఆనందాల విలువ తెలుస్తుంది.
3. ప్రతి సంఘటనకూ ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రతి విఘాతంలోనూ ఒక గుణపాఠం ఉంటుంది. వైఫల్యం అన్నది మన వ్యక్తిత్వ విస్మృతికి అత్యవసరం. అది అంతరంగిక ఎదుగుదలకు, మానసిక వికాసానికి దోహదం చేస్తుంది.
4. నీ పై నీకు శ్రద్ధ లేకపోతే ఇతరులకు నువ్వేం చేయగలవు ? నీకు నువ్వు మేలు చేసుకోక పోతే ఇంకొకరికి ఎలా మేలు చేయగలవు ? నన్ను నేను ప్రేమించుకోకపోతే నిన్ను మాత్రం ఎలా ప్రేమిస్తాను ?
5. నీ ప్రతి ఆలోచనపై నీకు బాధ్యత ఉండటమే గొప్పదనానికి నువ్వు చెల్లించే మూల్యం.
6. ఇతరులను అధ్యయనం చేసే వారు వివేకులు. కానీ, తమని తాము అధ్యయనం చేసుకునేవారు జ్ఞానులు.
7. భయమనేది మానసిక నియంత్రణకు సంబంధించిన స్పందన. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే అది నీ శక్తినీ, సృజనాత్మకతనూ, ప్రేరణ శక్తిని కూడా పీల్చేస్తుంది.
.... ఇలా మన ఆలోచనలను సైతం మార్చివేసే ఈ పుస్తకం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిందే.
- శిఖా సునీల్
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు మీరు చెప్పిన తర్కం నాకు బాగా నచ్చింది. జీవితం అంటే ఏమిటో ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు రాసే విధానం పాఠకుల మనసులను ఆలోచింపజేస్తాయి.మీరు రాసే ప్రతి ఆర్టికల్ చాలా బాగుంటాయి. మీరు ప్రతి ఆర్టికల్ లో ఏదో ఒక కొత్త కోణాన్ని చూపిస్తారు. జీవితమంటే? అన్న ప్రశ్నకు సమాధానాన్ని మనిషి వెతుకుతూనే ఉన్నాడు అనేది చాలా బాగుంది. ఇలాంటి ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్.
రిప్లయితొలగించండిథాంక్యూ
తొలగించండినమస్కారం సార్
రిప్లయితొలగించండిమీరు రాబిన్ శర్మ గారు చెప్పిన ఏడు సూత్రాలను మాకు చెప్పారు. అలాగే మీరు రాసే విధానం బాగా అర్థం అవుతుంది. ఇలాంటి పుస్తకాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. మీరు ఇలాంటి ఎన్నో మంచి పుస్తకాల గురించి తెలియజేయాలి అని కోరుకుంటున్నాను.