జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
ఈ రెండు సినిమాలూ తమిళ సినిమాలు కావటం, ఈ సంవత్సరంలోనే రావటం, గిరిజన నేపధ్యం ఉన్న కథలే అవడం, ఈ రెండూ ధియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ కావడం పోల్చదగిన యాదృచ్ఛికం. జైభీమ్, కర్ణన్ సినిమాలను పోల్చుతూ ఏ సినిమా గొప్పదో తేల్చాలని నా ఉద్దేశం కాదు. ఈ ఏడాది మొత్తంలో నేను చూసిన గొప్ప సినిమాలుగా చెప్పాలని మాత్రమే నా ఆలోచన. సత్యజిత్ రే అన్నట్లు సామాన్యుడి జీవితాన్ని సినిమాగా తీయడమే అత్యంత కష్టమైన విషయం. ఇక, అణగారిన వర్గాల చీకటి కోణాలను కళ్ళకు కట్టినట్లు చూపించడం మరింత కష్టం.ఈ కష్టమైన మరో కోణాన్ని నేటి తరం తమిళ యువ దర్శకులు ఎంతో ఇష్టంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు అత్యంత ప్రజాదరణ లభించడమే కాకుండా, IMDb టాప్ రేటెడ్ సినిమాల జాబితాలో దూసుకుపోతున్నాయి. ఈ కోవలోనే జై భీమ్, కర్ణన్ సినిమాలు ఈ ఏడాదిలో నేను చూసిన అత్యంత పవర్ ఫుల్ సినిమాలు. జై భీమ్, కర్ణన్ అనంతర సోషల్ మీడియా చర్చ నా లాంటి వాళ్లకు ఎంతో కొంత నేర్పింది. అందుకే జై భీమ్ చుసి కర్ణన్ చూడని వాళ్లూ, కర్ణన్ చుసి జై భీమ్ చూడని వాళ్లూ, మళ్ళీ రెండు సినిమాలు చుస్తే బాగుంటుందన్నదే నా అభిప్రాయం.
ఈ రెండు సినిమా కథల్లోనూ అణగారిన వ్యక్తులు చేసే "యుద్ధం" అంతర్లీనంగా సారూప్యంగా ఉంటుంది. అది కత్తులతో చేసే యుద్ధం కాదు. రాజ్యాల కోసం, రాణుల కోసం, మణులూ మాణిక్యాల కోసం చేసే యుధ్ధం కానే కాదు. అది, మన కాలపు యుధ్ధం. మన లాంటి వాళ్ళు, అణచివేయబడ్డ వాళ్ళు చేసే యుధ్ధం. పోరాటం చేయడం మొదలెట్టాక అనివార్యంగా చేయాల్సిన ఒక యుధ్ధం. ఓ సినిమాలో హక్కుల కోసం యుద్ధం చేస్తే, మరో సినిమాలో ఆత్మగౌరవం కోసం యుధ్ధం చేస్తారు. ఇలాంటి యుద్దాలు సంవత్సరాలుగా ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నా కళ్ళకు కట్టినట్లు చూడటం ఈ రెండు సినిమాల ద్వారానే సాధ్యమైంది.
ఈ రెండు సినిమాలూ 1995లో తమిళనాడులో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తీసినవి. ఈ రెండు సినిమాల్లోనూ గిరిజన నేపథ్యం కనిపిస్తుంది.అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాట కథలే ఈ రెంటి ఇతివృత్తం.జై భీమ్ సినిమా కడలూరు జిల్లా కమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన అయితే, కర్ణన్ సినిమా తుత్తుకూడి జిల్లా కొడియాంకులం అనే గ్రామంలో జరిగిన కుల ఘర్షణ నేపథ్యాన్ని తీసుకున్నారు. జై భీమ్ సినిమా ఒక అమాయక గిరిజన కుటుంబానికి జరిగిన ఘోరాన్ని చూపిస్తే, కర్ణన్ సినిమా ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఉండే గూడెం.. అందులోని అమాయక జనాలకు జరిగిన వివక్ష, అన్యాయాన్ని చూపిస్తుంది.ఈ రెండు సినిమాల్లోనూ అణగారిన వర్గాల పట్ల వ్యవస్థ వైఫల్యాన్ని చూపిస్తాయి.కర్ణన్ సినిమాలో ఆత్మగౌరవం కోసం పోరాడితే, జై భీమ్ సినిమాలో హక్కుల కోసం ఎంతగా పోరాడాల్సి వస్తోందో చూపించారు. ఇంతకు ముందెన్నడూ ఇంత స్పష్టంగా, సూటిగా ఇలాంటి నేపథ్య కథలని చూడని ప్రేక్షకులను ఈ సినిమాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా అనేది అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం.దర్శకులు చెప్పాలనుకునే విషయం ప్రజలలోకి ఎంత బలంగా వెళ్తుందో కర్ణన్, జై భీమ్ సినిమాలు నిరూపించాయి.ఇంత గొప్ప సినిమాలను అందించిన దర్శకులు జ్ఞాన్ వేల్(జై భీమ్), మారి సెల్వరజ్(కర్ణన్ )లు తెలుగు ప్రేక్షకుల మనసులూ గెలిచారు.ఈ రెంటిల్లో ఏ సినిమా గొప్పది ఆన్న చర్చే లేదు.ఏది ముందు ఆన్న ప్రశ్నే లేదు. కాకుంటే జై భీమ్ చరిత్ర సృష్టించి IMDbలో10 కి 9.6 రేటింగ్ సాధించి మొదటి స్థానం సాధించింది. సామాన్యుల కథలు ఇంత విజయం సాధించి సంచలనం సృష్టించడం చాలా గొప్ప విషయం. వీటితో పాటు అసురన్, విచారణ, సార్పట్ట, కబాలి, కాలా, పెరియారుం పెరుమాళ్ అస్సలు మిస్ అవ్వద్దు.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి