జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
- మదర్ థెరెసా
"మనిషిగా జీవించి మరణాన్ని చేయించు" అనే పుస్తకం ప్రఖ్యాత రచయిత రాబిన్ శర్మ రాసిన మంచి పుస్తకం. ఈ చిన్న పుస్తకాన్ని రెండు మూడు గంటల్లో ఆసాంతం చదివేయవచ్చు. ఇలా ఏకబిగిన ఈ పుస్తకాన్ని చదివే క్రమంలో... "మన జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే శక్తి కొన్ని 'పదాల్లో' ఉండవచ్చు" అనే ప్రఖ్యాత తత్వవేత్త హెన్రీ డేవిడ్ దోరో మాటలు మనకి కనిపిస్తాయి. పుస్తకాలకు.. పుస్తక పఠనానికి ఉన్న గొప్ప శక్తి ఈ పుస్తకాన్ని చదివిన తరువాత మనకి పూర్తిగా అర్థమవుతుంది.
చాలా పుస్తకాలు మనం అలా చదివి ఇలా పక్కన పెడుతూ ఉంటాం. అందులోని సారాన్ని అప్పటికప్పుడు ఆస్వాదిస్తాం. కొన్ని సందర్భాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ, ఈ పుస్తకం పక్కన పెట్టేసే పుస్తకం కానేకాదు. ఒకసారి చదివిన తర్వాత మన వ్యక్తిత్వాన్ని మనం అద్దంలో చూసుకున్నట్లుగా ఉంటుంది. మళ్లీ ఈ పుస్తకాన్ని చదువుతాం. మళ్లీ ..మళ్లీ.. చదువుతూనే ఉంటాం. చదువుతూ.. నేర్చుకుంటూ.. మనల్ని మనం పోల్చుకుంటూ.. మనల్ని మనం మార్చుకుంటూ.. మెరుగైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది జీవన విధానాన్ని సరిచేసే పుస్తకం. రోమన్ తత్వవేత్త సెనెకా చెప్పినట్లు.." నువ్వు జీవించినంత కాలం ఎలా జీవించాలో నేర్చుకుంటూ ఉండు". అందుకే, మెరుగైన జీవితాన్ని జీవించటానికి సరిపడే మెలకువలు ఈ చిన్న పుస్తకం మనకు నేర్పిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అర్థమయ్యేలా రాబిన్ శర్మ రచనా శైలి అత్యద్భుతం.
గతాన్ని గౌరవించండి.. జర్నల్ రాయండి.. ప్రకృతితో అనుబంధం పెంచుకోండి.. నిత్యం సంగీతం వినండి.. మౌనం అలవరుచుకోండి.. హాయిగా నవ్వండి.. అడగడం నేర్చుకోండి.. మార్చలేని విషయాల గురించి చింతించకండి.. నడవడం నేర్చుకోండి.. "ఆలయాన్ని" మరువకండి.. ఒక ప్రేమ పద్దు తెరవండి...క్షమించడం అలవర్చుకోండి.. నటించటం నేర్చుకోండి.. ఇలా, ఈ పుస్తకంలో రాబిన్ శర్మ 101 జీవన విధానాలను అద్భుతంగా వివరించాడు. ఇందులో కనీసం 30 అలవాట్లు మనలో ఉన్నట్లయితే మనం పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదిస్తునట్లే.
"జీవితంలో ఉన్న విషాదం మరణించడం కాదు; మనం జీవించి ఉండగానే మనమే కొన్ని గుణాలను చంపుకోవడం" - నార్మన్ కజిన్స్
(శిఖా సునీల్)
కలలు/ లక్ష్యాల వెంట పరుగుతీయడం జీవిత విధానంగా మారిపోయిన ఈ రోజుల్లో మనిషిగా జీవించడం అనేది చేతకానితనమో, వానప్రస్థం స్వీకరించాక చేసే పనిగానో అర్ధం చేసుకుంటున్నారు. ఒకప్పుడు పక్కవాడిని మోసం చేస్తే అనైతికం అనేవారు, అదే ఇప్పుడు లౌక్యంగా, బతకనేర్చిన తనంగా చలామణి అవుతోంది. ఒకప్పుడు లంచం తీసుకోవడం హేయం, ఇప్పుడు సంపాదనా నైపుణ్యం. ఒకప్పటి వక్రబుద్ది ఇప్పుడు తెలివితేటలు. పుస్తక పఠనం మృగ్యమైపోయిన ఈ కాలంలో ఇలాంటి పుస్తకాల సారాన్ని ఏదొరకంగా ప్రజల ఆలోచనా విధానంలోకి చొప్పించాలి.
రిప్లయితొలగించండిచిన్న పేరాలో, కొన్ని విలువైన పదాల్లో.. పైనున్న పుస్తక సమీక్ష కన్నా గొప్పగా.. ఎంత చక్కగా రాసారు(చెప్పారు)...
తొలగించండి