జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

అయ్యప్పనుమ్ కోషియుం(మూవీ రివ్యూ)

 


"అయ్యప్పనుమ్ కోషియుం" సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలిసి అర్జెంట్ గా ప్రైమ్ మూవీస్ లో చూసేసా.ఒక హిట్ సినిమాని రీమేక్ వెర్షన్ లో కాకుండా మొదటిసారిగా దాని ఒరిజినల్లోనే చూడాలనేది నా అభిప్రాయం.అందుకే మలయాళ వెర్షనలో తెలుగు సబ్ టైటిల్స్ తో చూశా.అప్పుడెప్పుడో మణిరత్నం డైరెక్షన్లో దళపతి సినిమాలో మమ్ముట్టి, రజినీకాంత్ యాక్షన్ సీన్లు గుర్తొచ్చాయి.హీరోయిజం, పౌరుషం అంటే ఇదే కదా అనిపించింది.ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగే మళ్ళీ అయ్యప్పనుమ్ కోషియుం సినిమా చూసినప్పుడు కలిగింది. ఇది మొత్తం మూడు గంటల యాక్షన్ డ్రామా.కానీ, చూస్తున్నంత సేపూఎక్కడా బ్రేక్ తీసుకోవాలనిపించలేదు. ఏకబిగిన కదలకుండా ఈ సినిమా మొత్తం సింగిల్ సిట్టింగ్లో చుసేసా. కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, యాక్షన్ ఒకటేమిటి సినిమా మొత్తం సూపర్గా అనిపించింది.

ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్లు లేకుండా, హీరో ఎంట్రన్స్ లు, ఫ్లాష్ బ్యాక్లు లేకుండా 'షో' ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే కథలోకి ఇన్వాల్వ్ అవ్వడం అరుదుగా కొన్ని సినిమాల్లోనే ఉంటుంది. 'అయ్యప్పనుమ్ కోషియుం' ప్రత్యేకత కూడా అదే. సినిమా ప్రారంభమైన మొదటి రెండు, మూడు నిమిషాల్లోనే మనం నేరుగా స్టోరీలోకి ఎంటరైపోతాం. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుకోకుండా జరిగే చిన్న గొడవే ఈ సినిమా కథ. ఇద్దరూ యూనిఫాం ఉద్యోగులే..కాకుంటే ఒకరు ఎక్స్ సర్వీస్, మరొకరు రెండేళ్ళలో రిటైర్డ్ అయ్యే సిన్సియర్ సబ్ ఇన్స్పెక్టర్.ఈ సినిమాలో స్టోరీ చాలా సాధారణమైన చిన్న కథ. ఊసుపోక, టీ స్టాల్ల దగ్గర మాట్లాడుకునే చిన్న చిన్న కథల లాంటిదే ఈ సినిమా కథ కూడా. కానీ, మూడు గంటలసేపు మనల్ని కట్టిపడేసి తెర ముందు కదలనీయకుండా చేసిన స్క్రీన్ ప్లే అద్భుతం. ఇంకో ప్రతేకమైన విషయం ఏంటంటే హీరోయిన్ అంటూ లేని నేను చూసిన మొదటి సినిమా ఇదే. మొత్తం ఇందులో యాంగ్రీ మెన్సే యాక్టర్లు. హీరోయిన్ల లేరు కాబట్టి ప్రేమ పాటలూ, విరహ గీతాలు, భావ సన్నివేశాలు, పెళ్లి గోలలూ లేకుండా నేరుగా సినిమాలోకి వెళ్లి పోతాం. సినిమా మొత్తం అయ్యప్పన్ నాయర్ గా బిజు మీనన్, కోషి కురియన్ గా పృధ్వీ రాజ్ సుకుమారన్ లు జీవించారు. కథ, దర్శకత్వం వహించిన "సాచి" ప్రతిభ అద్భుతం.

- శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్