జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

పీలే: బర్త్ ఆఫ్ ఎ లెజెండ్

మంచి సినిమా మంచి పుస్తకం లాంటిది. ఓ మంచి పుస్తకాన్ని చదివినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో మంచి సినిమా చూసినప్పుడూ అలాంటి అనుభూతే చెందుతాం. ఈ మధ్య ఓ సివిల్స్ విజేత "తానెప్పుడూ మంచి సినిమాలు చూస్తుంటాననీ, వాటిని వివిధ కోణాల్లో విశ్లేషించడం ద్వారా వచ్చిన పరిజ్ఞానం సివిల్స్ పరీక్షల్లో ఉపయోగపడిందని" చెప్పారు. మంచి సినిమాలు ప్రతి ఒక్కరూ చూడడం చాలా మంచిదే. చరిత్రలో నిజ జీవిత విజేతల సినిమాలు అస్సలు మిస్ కాకూడదు. ఇలాంటి, మనం మిస్ కాకూడని మంచి సినిమాల జాబితాలో ముందు వరసలో ఉండదగ్గ సినిమా "పీలే: బర్త్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌". 2016లో ఇంగ్లీష్ వెర్షన్లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ మూవీ.            


పీలే.. అంటే ఓ క్రీడా చరిత్ర. పీలే అంటే.. కోట్ల మంది సాకర్ ప్రేమికుల ఆరాధ్య దైవం. పీలే.. అంటే పేదరికాన్ని బద్దలు కొట్టి ఫుట్ బాల్ సామ్రాజ్యాన్ని అతి చిన్న వయసులోనే ఎలిన సాకర్ చక్రవర్తి. ఇలాంటి గొప్ప ఫుట్ బాల్ క్రీడా దిగ్గజం నిజ జీవితాన్ని తెర మీద చూడటం మంచి అనుభూతిని ఇస్తుంది.1958 ప్రపంచ కప్ ఫుట్ బాల్ క్రీడల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అంతకు ముందెప్పుడూ ప్రపంచ కప్ విజేతగా నిలవని బ్రెజిల్ కు "1958" గొప్ప విజయాన్ని తెచ్చి పెడుతుంది. ఈ విజయం కేవలం 17 ఏళ్ళ టీనేజర్ "పీలే"  ద్వారా దక్కిన విజయం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పేదరికాన్ని జయించి,17 ఏళ్లకే ప్రపంచ ఫుట్ బాల్ క్రీడల్లో పాల్గొని చరిత్ర సృష్టించిన పీలే జీవితం అందరిలా సాఫీగా జరిగిపోలేదు. పేదరికం, వివక్షల మధ్య విజేతగా నిలబడడం అంత సామాన్య మైన విషయం కానే కాదు. పీలే తల్లి ఓ పనిమనిషి. తండ్రి పారిశుధ్య కార్మికుడు. ఇలాంటి నిరుపేద నేపధ్యం నుంచి కేవలం 17 ఏళ్లకే పీలే విశ్వ విజేతగా ఎలా నిలిచాడు అన్న కథే ఈ సినిమా ఇతివృత్తం. గంటా యాభై నిమిషాల ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో పీలే బాల్యం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇది తెరపై చూడాల్సిందే. ఇంతటి గొప్ప సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకులు జెఫ్ జింబాలిస్ట్, మైఖేల్ జింబాలిస్ట్ లకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం గొప్పగా ఉంటుంది. బ్రెజిల్ స్టైల్ సంగీతం వినసొంపుగా ఉంటుంది. ఇంత మంచి సంగీతాన్ని అందించింది మన ఏ ఆర్ రెహమాన్. సంగీతంలో రెండో సారి ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమా "పీలే: బర్త్ ఆఫ్ ఎ లెజెండ్". Don't Miss..

  - శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్