జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
వాగై సూడ వా 2011లో విడుదలైన తమిళ సినిమా.2012 లో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. సహజంగానే, అవార్డు సినిమాల మీద కాస్త ఆసక్తి తక్కువగానే ఉంటుంది. అందుకే వాగై సూడ వా కూడా మన తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. ఈ సినిమాలో సస్పెన్స్ లేదు, థ్రిల్లర్ కాదు. విలన్లు లేరు... ఇవన్నీ లేకుండా సినిమా, అదీ రెండు గంటల సినిమా చూడాలంటే చాలా కష్టమే. కష్టపడుతూ సినిమా చూసే వాళ్ళ కోసం కాదు గానీ, కాస్త ఇష్టంగా.. ఏదైనా కొత్తగా.. మనసుకు హత్తుకునేలా ఉండే కథలు కోరుకునే వారి కోసం వాగై సూడ వా మంచి సినిమా. ఈ సినిమా కోసం అప్పట్లో రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. థియేటర్లలో 12 కోట్లు వసూలు చేసిందంటే సూపర్ హిట్ సినిమా కాక మరేంటి.
ఈ సినిమా నేపథ్యం 1960 ప్రాంతం. మారుమూల గ్రామంలో జరిగే కథ. నాగరికతకు దూరంగా విసిరేసినట్లు ఉంటుంది ఆ ఊరు. అక్కడ ఉండే జనాలు మట్టిని నమ్ముకుని జీవించేవారు.నిజమైన మట్టి మనుషులు. అక్షరాలు, అంకెలు తెలియని అమాయకులు. అలాంటి ఊరికి కొత్తగా టీచర్ శిక్షణ పొంది మొదటి ఉద్యోగం కోసం ఓ యువకుడు రావడంతో సినిమా ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి రకరకాల మలుపులు తిరిగి అన్ని సినిమాల్లాగే కథ సుఖాంతమవుతుంది.
వాగై సూడ వ దర్శకుడు ఎ. సర్కునం ప్రతిభ అత్యంత అద్భుతం. 1960లో బడిపంతులు జీవితం ఎలా ఉంటుందో చక్కగా చూపించాడు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ప్రేమతో.. ఓర్పుగా..ఓ అద్భుత చిత్రాన్ని గీసినట్టు.. శిల్పాన్ని చెక్కినట్లు ఫ్రేమ్ చేశాడు. అందుకే, ఈ సినిమా చూస్తున్నంత సేపు మన మనసుకు హాయిగా మంచి విజువల్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకి గిబ్రన్ సంగీతం మరో సూపర్ హిట్. సినిమా చూసిన తర్వాత ఇందులోని పాటలు కచ్చితంగా మన లైబ్రరీలో చేరిపోతాయు...
కాస్త ప్రశాంతమైన సినిమా చూడాలనుకునే వారు... మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలనుకునే వారు.. పల్లెటూరి స్వచ్ఛమైన ప్రేమని చూడాలనుకునే వారు ఈ సినిమా ట్రై చేయండి. కచ్చితంగా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
- శిఖా సునీల్
తెలుగులో డబ్ అయిందా ఈ చిత్రం సునీల్ గారూ
రిప్లయితొలగించండితెలుగు లేదు సర్ , IMDb 8.1/10
తొలగించండి