జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటు ఏపీసెట్-2021 అధికారిక వెబ్ సైట్ లో వివిధ సబ్జెక్టుల కటాఫ్ మార్కులు పొందుపరిచారు.డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా నియామకం పొందాలంటే ఏపీసెట్ లేదా యూజీసి-నెట్ అర్హత సాధించాలన్న విషయం తెలిసిందే.
తెలుగు సాహిత్యంలో కటాఫ్..
తెలుగు సబ్జెక్టు కటాఫ్ మార్కులను పరిశీలిస్తే..ప్రతి ఏడాది పరీక్ష కూడా కఠినంగా మారుతున్న విషయం అర్థమవుతుంది. పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య పెరుగడంతో పోటీ తీవ్రత కూడా పెరుగుతూనే ఉంది.సబ్జెక్టు లో పూర్తి పట్టు సాధించిన వాళ్ళే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఏపీసెట్-2021 కటాఫ్ మార్కులను పరిశీలిస్తే.... అన్ రిజర్విడ్ కేటగిరీలో 48.00 పర్సెంట్ సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు. పోయిన ఏడాది ఏపీసెట్ పరీక్షలో అన్ రిజర్వడ్ కేటగిరీలో46 శాతం అర్హత ఉంది. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రెండు శాతం అర్హత మార్కులు పెరిగాయి.అలాగే ఇప్పటి ఏపీసెట్ లో బిసి- ఏ (43.33), బిసి- బి (44.67), బిసి- సి(44.67), బిసి-డి (44.00), బిసి- ఈ (44.00) అర్హత సాధించారు.ఇక ఎస్సి లో 41.33, ఎస్టీ లో 38.67, ఈడబ్ల్యూఎస్ లో 45.33 శాతం స్కోర్ చేసిన అభ్యర్థులు అర్హత సాధించారు.మహిళా కేటగిరిలో ఒక శాతం అటూ ఇటూ ఇవే మార్కులతో అర్హత సాధించారు. కొద్ది మార్కులతో అర్హత కోల్పోయిన విద్యార్థులు ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా ఐదే ప్రిపరేషన్ కొనసాగిస్తే డిసెంబర్ లో జరిగే యూజీసి- నెట్ పరీక్షలో, వచ్చే ఏడాది ఏపీసెట్ లో అర్హత సాధించవచ్చు.
Good analysis
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిమంచి సమాచారం
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిధన్యవాదాలు
రిప్లయితొలగించండిధన్యవాదాలు
రిప్లయితొలగించండి