జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
మనుషుల్ని చంపే పులి అంటే అందరికీ భయం. అలాంటి సినిమాలంటే ఉత్కంఠ, సస్పెన్స్, థ్రిల్లర్ ఉంటుంది. ఏ మూల నుంచి పులి గాండ్రింపు వినిపిస్తుందా, ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందా.. అని సినిమా హాల్లో కుర్చీ చివరి అంచు మీద కూర్చుని మరీ చూస్తాం. అలాంటి సినిమాలకు భిన్నంగా.. షెర్ని సినిమాలో మ్యాన్ ఈటర్ మీద మనకు ప్రేమ కలుగుతుంది. సినిమా చివరికి మనుషుల్ని చంపే ఆ ఆడపులి మీద జాలి కలుగుతుంది. సినిమా చూసిన తర్వాత , ఎందుకు ఇలా జరుగుతుందా అని కొద్దిసేపైనా ఆలోచన కలుగుతుంది. దర్శకుడు అమిత్ వి. మసూర్కర్ అద్భుతంగా తెరకెక్కించి, ఇటీవల విడుదలైన హిందీ సినిమా షెర్ని.
అడవికి, మనిషికి మధ్య ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. జనావాసాలు పెరిగేకొద్ది ఈ ఘర్షణ పెరుగుతూనే ఉంటుంది. మనిషికి , మృగానికీ మధ్య సమతుల్యత దెబ్బతిననంతకాలం అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తు మనిషి ఆలోచన ఈ సమతుల్యతను దెబ్బతీస్తే... అడవుల్లో ఉండాల్సిన ప్రాణుల్ని మనం జంతు ప్రదర్శనశాలల్లోనూ, మ్యూజియంలోనూ చూడాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితమైన కోణాన్ని దర్శకుడు అమిత్ వి. మసూర్కర్ షెర్ని సినిమాగా అద్భుతంగా తెరెక్కించారు.
ఒక పెద్ద అడవి. దానిని ఆనుకొని జనావాసం. అనుకోకుండా వాళ్లని చంపే పెద్దపులి.ఈ పులిని ఏం చేయాలి....ఈ సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. కానీ డైరెక్టర్ ఎంతో సహజంగా ఈ సినిమాని చిత్రీకరించాడు.రెండు గంటల పదినిమిషాల ఈ సినిమాలో మనకు పెద్దపులి ఒకటి, రెండు సార్లు కొన్ని సెకన్లు నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. కనీసం పులి గాండ్రింపు కూడా వినబడదు.అత్యంత సహజంగా ఈ సినిమా తీశారు. కొత్తగా ఫారెస్ట్ సర్వీస్ శిక్షణ ముగించుకున్న సిన్సియర్ డీ.ఎఫ్.ఓ.గా విద్యాబాలన్ నటన అద్భుతం. ఈ సినిమాలోని ప్రతి సీన్ అత్యంత సహజంగా ఉంటుంది .ఒక మ్యాన్ ఈటర్ ని, మనుషుల్ని చంపే పులిని.. చంపాలా.. రక్షించాలా... ఎం చేయాలి..అన్న ప్రశ్న తలెత్తినప్పుడు.. అందులో రాజకీయం చొరబడినప్పుడు .. సిన్సియర్ ఫారెస్ట్ అధికారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఎలాంటి ఘర్షణకు లోనవుతారు.. చివరికి ఏం జరుగుతుంది.....సినిమా బాగుందా ,లేదా అన్నది ప్రశ్నే కాదు.ఇది చూడాల్సిన సినిమా,తెలుసుకోవాల్సిన కథ.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి