పోస్ట్‌లు

డిసెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

రంగస్థల లతాంగి 'రేబాల రమణ'

చిత్రం
  పద్య నాటకాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రోజులవి. గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం వంటి పౌరాణిక నాటకాల సరసన బలిజేపల్లి లక్ష్మికాంతం రచించిన "సత్య హరిశ్చంద్ర" చేరి జనాల చేత జేజేలు కొట్టించుకుంటున్న తొలినాళ్ళవి.రంగస్థల చరిత్ర సువర్ణ అక్షరాలతో రాయదగ్గ ఆ కాలంలో  పద్య నాటక కళాకారుడిగా జనాలను మెప్పించడం అంత సామాన్యమైన విషయం కానే కాదు. మధురమైన గాత్రంతో పాటు నవరసాలు పండించగల అభినయం కావాలి. ఇక స్త్రీ పాత్రలు ధరించడం కత్తి మీద సామే. వయ్యారాలు వలకబోయాలి,మధురమైన కంఠంతో పద్యాలాపన చేయగలగాలి, అంతలోనే కరుణ రసాన్ని పండించి ప్రేక్షకుల కంట కన్నీరు పుట్టించాలి. ఇలాంటి అభినయంతో,పురుషుడై ఉండి, స్త్రీ పాత్రలో ఇమిడిపోయి, స్త్రీ పాత్రకే జీవం పోసిన గొప్ప కళాకారుడు రేబాల రమణ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రంగస్థలంలో విరబూసిన లతాంగి. కరుణ రసాత్మక పాత్రోచిత నటనతో ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించిన నట భాగ్యరేఖ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో రేబాల రమణ 1939లో జన్మించాడు. తల్లిదండ్రులు పెంచలయ్య, అంకమ్మ. నటన పట్ల మక్కువతో పాఠశాల స్థాయిలోనే నాటకాల్లో నటించడమే కా...

పార్ట్ టైమ్ పీహెచ్.డి

చిత్రం
  డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్.డి) పూర్తిచేయడం ఉన్నత విద్యావిధానంలో అత్యున్నత విద్యార్హత. మన విద్యా వ్యవస్థలో పీహెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందడం ఉన్నత శిఖరాన్ని అధిరోహించడం లాంటిది. డాక్టరేట్ పట్టా పొందితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎంచుకున్న సబ్జెక్టును బట్టి కెరియర్ పరంగా దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పీహెచ్.డి పూర్తిచేసి డాక్టరేట్ పట్టా పొందడం గౌరవప్రదమైన ఒక హోదా పొందడం లాంటిది. ఒకే అంశంపై పరిశోధన చేసి కొత్త విషయాలను కనుగొనడం, నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించి మేధావుల చేత ఆమోదింపజేయడం చాలా గొప్ప విషయం. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న చాలామందికి పీహెచ్.డి పట్టా పొందడం ఒక కలగా మిగిలి ఉంటుంది. వివిధ కారణాల రీత్యా డిగ్రీ, పీజీ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందిన చాలా మందికి పరిశోధన చేయాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారి కోసమే వివిధ విశ్వవిద్యాలయాలు పార్ట్ టైం విధానంలో పరిశోధన చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఉద్యోగం చేస్తూనే ఎంచుకున్న రంగంలో పరిశోధన పూర్తి చేసి పీహెచ్.డి పట్టా పొందవచ్చు. పార్ట్ టైమ్ పీహెచ్.డిలో ప్రవేశం ఇలా.. యూజీసీ మార్గదర్శకాల...

జే.ఆర్.ఎఫ్ ఇన్ తెలుగు

చిత్రం
తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయాలనుకునే ప్రతి విద్యార్థి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జే.ఆర్.ఎఫ్.) గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పీజీ పూర్తయిన తరువాత పరిశోధనకు సంభందించిన అవగాహన కోసం చాలా మంది విద్యార్థులు ప్రయత్నిస్తారు. అలా కాకుండా, యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడే పరిశోధన పట్ల ఆసక్తి కలిగి ఉండటం, వాటికి సంభందించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడం ఉత్తమం. ఇలా తెలుసుకోవడం ద్వారా పీజీ అనంతరం పి.హెచ్.డి వైపు వెళ్లాలనుకునే విద్యార్థులకు మార్గం సుగమం అవుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జే.అర్.ఎఫ్) అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సి (ఎన్.టీ.ఏ) ద్వారా ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించబడే పరీక్ష. నిబంధనల ప్రకారం ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు జే.అర్.ఎఫ్. అవార్డు ప్రకటిస్తారు. సామాజిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన పీజీ పూర్తయిన విద్యార్థులందరికీ జే.అర్.ఎఫ్ ప్రకటన ఇదే విధానలో ఉంటుంది. తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయాలనుకునే విద్యార్థులకు జే.అర్.ఎఫ్ అనేది అత్యున్నత పరిశోధనా మార్గం. ఎందుకంటే, యూనివర్సిటీలో పీ.హెచ్.డి సీటు పొందటం దగ్గర న...

హరిశ్చంద్రుడి కోసమే ఆయన పుట్టాడు..

చిత్రం
  తెలుగునాట హరిశ్చంద్రుడి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు బండారు రామారావు. హరిశ్చంద్రుడి కోసమే ఆయన పుట్టాడా.. ఆయన కోసమే ఆంధ్రదేశంలో హరిశ్చంద్రుడు పుట్టాడా అన్నట్లు తెలుగుదేశంలో అభినవ హరిశ్చంద్రుడిగా తిరుగులేని పేరు గడించిన "నటచూడామణి " బండారు రామారావు. హరిశ్చంద్రుడి వేషధారణలో రంగస్థలంపై అడుగుపెడితే చాలు ప్రేక్షకులు మైమరచి పోయేవారు. స్మశాన ఘట్టంలో ఆయన రంగప్రవేశం ఓ అద్భుత సన్నివేశం. పదే పదే చూడాలనిపించే ఆయన హావభావాలను అభివర్ణించి ఆనాటి రసజ్ఞులు మురిసిపోయేవారు. ఆయన పాడే కరుణ రసాత్మకమైన పద్య రాగాలకు ప్రేక్షకులు కన్నీళ్ళతో తడిసి ముద్దయ్యేవారు. తెల్లారిందాకా నాటకాన్ని విక్షించి సూర్యోదయపు బంగారు వెలుతుర్లో ఆయన నట విశ్వరూపాన్ని చూసి మైమరచి పోయేవారు. రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు పద్య ప్రేమికులను రంజింపజేసిన బండారు రామారావు స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామం.1932లో బండారు సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించాడు. బండారు రామారావు తండ్రి బండారు సుబ్బయ్య యక్షగానంలో ఆరితేరిన కళాకారుడు. ఆ కారణంగానే బండారు రామారావు చిన్నతనం నుంచే కళారంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. చిన్ననాటే హరిశ్చంద్రుడి యక్షగా...

తెలుగు సాహిత్య పరిశోధన- ప్రాథమిక విషయాలు

చిత్రం
  తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత, ప్రయాణం ఎటు వైపు..?? ఇది చాలా మంది తెలుగు సాహిత్య విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్న. అభిరుచి, సలహాలను బట్టి రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొందరు ప్రైవేటు కళాశాలలు/ పాఠశాలల్లో ఉద్యోగాలు చేయడానికి సిద్ధపడతారు. మరికొందరు పోటీపరీక్షల వైపు, తెలుగు పండిట్ ట్రైనింగ్, బీఈడీ వంటి వృత్తి విద్యా కోర్సులు చేయడానికి ఆసక్తి చూపుతారు. కొద్ది మంది విద్యార్థులు మాత్రం పరిశోధన వైపు ఆకర్షితులౌతారు. వందలో కనీసం పది శాతం మంది విద్యార్థులు తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాలనే ఆసక్తి కనబరుస్తారు. అలాంటి విద్యార్థుల కోసం పరిశోధన వైపు అడుగులు వేయడానికి కావలసిన ప్రాథమిక విషయాలను తెలుసుకుందాం. మంచి నిర్ణయం.. తెలుగు సాహిత్య పరిశోధన వైపు అడుగులు వేయాలను కోవడం మంచి ఆలోచన, నిర్ణయం. అయితే విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి సీటు సంపాదించడం అంత సులువైన విషయం కాదు. ఉదాహరణకు, ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 40 సీట్లు అందుబాటులో ఉంటే, అదే యూనివర్సిటీలో పరిశోధన కోసం పరిశోధనా మార్గదర్శకులు (గైడ్), వారి వద్ద అందుబాటులో ఉండే పరి...

సార్పట్ట ( మూవీ రివ్యూ )

చిత్రం
పా రంజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ ఫ్లాట్ ఫామ్ పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు. తన అభిప్రాయాలు, నిజ జీవితంలో తనను ప్రభావితం చేసిన అంశాలును కలిపి వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి ప్రేక్షకులను మెప్పించడం పా రంజిత్ ప్రత్యేకత. ఆయన సినిమాల్లో అంబేద్కర్, పెరియార్, బుద్ధుడు.. వారి సిద్దాంతాలు అంతర్లీనంగా కనిపిస్తుంటాయి. కథలన్ని కూడా అనగారిన సామాజిక వర్గాల నుంచి వచ్చే ప్రతిఘటన, సమన్యాయం కోసం జరిగే పోరాటాలను ప్రతిబింభిస్తాయి. పా రంజిత్ దర్శకత్వం వహించిన మద్రాస్, కబాలి, కాలా.. నిర్మించిన పెరియారుం పెరుమాళ్ సినిమాలు సూపర్ హిట్ మూవీస్.  ఈ సినిమాలన్నిటికీ  భిన్నంగా పా రంజిత్ దర్శకత్వంలో ఇటీవల ఓటీటిలో రిలీజ్ అయిన సార్పట్ట అత్యద్భుతం. "ఆటే కదా.. ఓడిపోతే ఏమవుతుంది". కాదు.. కొన్ని ఆటలు అలా కాదు. ఆటలో పౌరుషం ఉంటే.. ఆటే ప్రాణమైతే.. గెలిచిందాక నిద్ర పట్టదు. ప్రత్యర్థి నేల కొరిగిందాకా అలుపుండదు. ఇలాంటి ఆటే బాక్సింగ్. తమిళనాడులో కరుప్పర్ నగరం వంశపారంపర్య బాక్సింగ్ క్రీడలకు ప్రసిద్ది. 1970 - 76 ఎమర్జెన్సీ కాలంలో తమిళనాడు గ్రామాల్లో జరిగ...

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

చిత్రం
అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం, బోధన, పరిశోధనతో కూడిన  ఉద్యోగ బాధ్యత, వృత్తిలో సంతృప్తి, ప్రతి నెలా సుమారు డెభై నుంచి ఎనభై వేల రూపాయల ప్రారంభ వేతనం.. వెరసి, ఆకర్షణీయమైన "డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్" ఉద్యోగం సాధించాలనే కోరిక స్నాతకోత్తర విద్య పూర్తి చేసిన పట్టభద్రులందరికీ ఉంటుంది. చాలా మంది అభ్యర్థులకు  డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్ అవడం ఒక కల కూడా. అయితే, ఈ కలని నిజం చేసుకోవడం అసాధ్యమైన విషయం మాత్రం కాదు. పట్టుదల, ప్రణాళిక ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అటూఇటుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ కళాశాల లెక్చరర్ల ఉద్యోగ నియామకం చేపడుతోంది. గతంలో 2011లో ఒక నోటిఫికేషన్, 2016, 2018లో మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ రెండు నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెల ( 2023 డిసెంబర్)లో మరో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డిగ్రీ కళాశాలలో "తెలుగు లెక్చరర్" గా విజయం సాధించడానికి అవసరమైన ప్రాథమిక విషయాలను తెలుసుకుందాం.. బోధనతో ముడిపడిన ఉద్యోగాలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతల్...

నవతరాన్ని కలగన్న జాషువా

చిత్రం
  వినుకొండ అంటే తడుముకోకుండా గుర్తొచ్చేది మహాకవి గుర్రం జాషువా పేరు. వినుకొండలో పుట్టిన జాషువా విశ్వనరుడిగా ఎదిగాడు. తెలుగు సాహిత్య పరిమళాలు చేరిన ఈ ప్రపంచ పటంలో ఏ మూలకు వెళ్లినా, వినుకొండ అంటే “మహాకవి గుర్రం జాషువా పుట్టిన గడ్డ కదా” అంటారు. ఈ వినుకొండ ప్రాంతానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాడు విశ్వనరుడు జాషువా. ఆయన బాల్యం, యవ్వనం వినుకొండ మట్టి వాసనలో పెనవేసుకుని ఉంటుంది . ఇక్కడి గాలి, ప్రకృతి, పరిసరాలు నుంచి జాషువా సాహిత్య పాఠాలు నేర్చుకున్నాడు. పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు ప్రాంతంలో వినుకొండ వెనుకబడిన గ్రామం. ఇది 120 ఏళ్ల క్రితం నాటి మాట. ఈ ప్రాంతానికి క్రైస్తవ మిషనరీలు రాకముందు దళితుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఒంగోలు కేంద్రంగా క్రైస్తవ మిషనరీని స్థాపించిన క్లౌ దొర వినుకొండ ప్రాంతంలోనూ ఆధ్యాత్మిక బోధనతో పాటు ఇంగ్లీష్ , తెలుగు విద్యకు శ్రీకారం చుట్టాడు. దీని కారణంగా దళితుల జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. వినుకొండకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాట్రగడ్డపాడు గ్రామం జాషువా తల్లిదండ్రుల స్వగ్రామం. గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన పల్లెటూరు అది. జాషువా తండ్రి గు...

చూడాల్సిన "కర్ణన్"

చిత్రం
కర్ణన్ సినిమా చూసిన తర్వాత ప్రేమా, పెళ్లి సినిమాల దగ్గరే నేను ఆగిపోలేదు కదా అన్న సందేహం కలిగింది. ఇంకాస్త ముందుకు వెళ్లాలనీ, ఇంకా, ఇంకా ముందుకు వెళ్లాలని అనిపించింది. కర్ణన్ సినిమాలో కథ బాగుందా, మారి సెల్వరాజ్ డైరెక్షన్ గొప్పదా, ధనుష్ నటన అద్భుతంగా ఉందా, అందులోని పాత్రలు, సన్నివేశాలు సూపరా.. ఇవన్నీ చెప్పడం చాలా చాలా కష్టం. కానీ, ఎక్కడైనా ఓ సంఘటన జరిగితే, అందులో నేను కూడా పాత్రధారినై ఉంటే, ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో సేమ్ టు సేమ్ కర్ణన్ సినిమా చూస్తున్నప్పుడు నాకూ అలానే అనిపించింది."ఆత్మాభిమానం" అనే పదాన్ని నేను చాలాసార్లు విన్నా. అర్థం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ, మొదటి సారి కళ్ళకు కట్టినట్టు కర్ణన్ సినిమాలో చూశా. మన తెలుగులో ఇలాంటి కథలు లేవా, ఉన్నా.. మన వాళ్ళు తీయరా, తీసినా.. ప్రేక్షకులకు నచ్చదా.. ఇలాంటి  ప్రశ్నలకు ఇక్కడ నేను సమాధానం వెతకడం లేదు. కానీ, సినిమా అనే అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం నుంచి ఎంతో కొంత తెలుసుకోవాలి, కొద్దో గొప్పో నేర్చుకోవాలి, కొత్తదనాన్ని చూడాలి అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం.. అతి కొద్ది సినిమాలకే ఈ కాన్సెప్ట్ సరిపోతుందని నా అభిప్రాయం. అందుకే కర్ణన్ ...

పద్య నాటక స్వర సవ్యసాచి పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు

చిత్రం
ఆయన పద్యరాగంలోని మాధుర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మళ్ళీమళ్ళీ వినాలనిపించే ఆయన గాత్రంలోని గమకాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. తెలుగు నాట నక్షత్రకుడిని హీరో చేసిన గొప్ప రంగస్థల కళాకారుడు పద్మశ్రీ యడ్ల గోపాలరావు. ఐదువేల పద్య నాటక ప్రదర్శనలు, యాభై సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గురించి జి.వి.ఎం.సి డిప్యూటీ కమిషనర్ పల్లి నల్లనయ్య అందిస్తున్న వ్యాసం.. "మా చిన్నాన్నలు పల్లి లక్ష్మీనారాయణ, పల్లి నర్సింహులు, పల్లి రామామూర్తి అందరూ పౌరాణిక నటులే. వారు మా ఊరిలో శ్రీ రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, బాలనాగమ్మ, మున్నగు నాటకాలు వేయడం అలా నాకు పద్యనాటకం పై చిన్ననాటి నుంచే ముక్కువ ఏర్పడటం జరిగింది. నా పదవ ఏట మా చిన్నాన్న రామమూర్తి తదితరులతో కలిసి మా ఊరి సమీపంలో గల సైరిగాం గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్రలో మొట్టమొదటిసారిగా ఎడ్ల గోపాలరావుని చూడడం జరిగింది. అప్పటికి వారు మంచి యుక్త వయసులో ఉండటం, హార్మోనిస్టు కూడా కావడం వల్ల ఏ రాగాన్నైనా పై స్థాయిలో అమోఘంగా పలికి ప్రేక్షకుల విజయ హారతులు అందుకునేవారు. తన ...