జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

సార్పట్ట ( మూవీ రివ్యూ )

పా రంజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ ఫ్లాట్ ఫామ్ పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు. తన అభిప్రాయాలు, నిజ జీవితంలో తనను ప్రభావితం చేసిన అంశాలును కలిపి వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి ప్రేక్షకులను మెప్పించడం పా రంజిత్ ప్రత్యేకత. ఆయన సినిమాల్లో అంబేద్కర్, పెరియార్, బుద్ధుడు.. వారి సిద్దాంతాలు అంతర్లీనంగా కనిపిస్తుంటాయి. కథలన్ని కూడా అనగారిన సామాజిక వర్గాల నుంచి వచ్చే ప్రతిఘటన, సమన్యాయం కోసం జరిగే పోరాటాలను ప్రతిబింభిస్తాయి. పా రంజిత్ దర్శకత్వం వహించిన మద్రాస్, కబాలి, కాలా.. నిర్మించిన పెరియారుం పెరుమాళ్ సినిమాలు సూపర్ హిట్ మూవీస్.  ఈ సినిమాలన్నిటికీ  భిన్నంగా పా రంజిత్ దర్శకత్వంలో ఇటీవల ఓటీటిలో రిలీజ్ అయిన సార్పట్ట అత్యద్భుతం.

"ఆటే కదా.. ఓడిపోతే ఏమవుతుంది". కాదు.. కొన్ని ఆటలు అలా కాదు. ఆటలో పౌరుషం ఉంటే.. ఆటే ప్రాణమైతే.. గెలిచిందాక నిద్ర పట్టదు. ప్రత్యర్థి నేల కొరిగిందాకా అలుపుండదు. ఇలాంటి ఆటే బాక్సింగ్. తమిళనాడులో కరుప్పర్ నగరం వంశపారంపర్య బాక్సింగ్ క్రీడలకు ప్రసిద్ది. 1970 - 76 ఎమర్జెన్సీ కాలంలో తమిళనాడు గ్రామాల్లో జరిగే బాక్సింగ్ క్రీడల నేపద్యంలో సార్పట్ట సినిమా కథ జరుగుతుంది. తూర్పు మద్రాసులో హార్బర్లో హమాలీగా పనిచేసే ఓ యువకుడు ఈ బాక్సింగ్ లోకి ఎలా అడుగు పెట్టాడు. చివరికి ఎలా నెగ్గాడు అన్నదే కథాంశం.

సార్పట్ట చిత్రీకరణ అత్యద్భుతం. తమిళనాడులో అప్పటి బాక్సింగ్ సంస్కృతి ఎలా ఉండేదో మనకు కళ్ళకు కట్టినట్లు దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాలో చూపించాడు. యాభై సంవత్సరాల క్రితం జరిగే సన్నివేశాలు కళ్ళ ముందు జరుగుతున్నట్టుగానే ఉంటాయి. ఈ సినిమా ప్రారంభమైన రెండు మూడు నిమిషాల్లోనే నేరుగా కథలోకి ప్రేక్షకులు లీనమైపోతారు. పౌరుషంగా జరిగే బాక్సింగ్ పోటీలు చూస్తుంటే  రోమాలు నిక్క పొడుస్తాయి. సినిమా ఆద్యంతం సమర పాత్రలో హీరో ఆర్య నటన అత్యంత రియలిస్టిక్గా ఉంటుంది.పౌరుషం ఉన్న బాక్సింగ్ కోచ్ రంగయ్య పాత్రలో పశుపతి నటన ఆకట్టుకుంటుంది. సినిమాలో ప్రతి సన్నివేశానికి శంకర్  నారాయణ సంగీతం ఇమిడిపోతుంది. మురళి ఫోటోగ్రఫీ.. పా రంజిత్ దర్శకత్వం.. కథ..  అన్ని కలిసి మనం చూడాల్సిన సినిమా లిస్ట్లో  సార్పట్ట ముందు వరసలో ఉండటం ఖాయం.

 - శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్