జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

జే.ఆర్.ఎఫ్ ఇన్ తెలుగు

తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయాలనుకునే ప్రతి విద్యార్థి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జే.ఆర్.ఎఫ్.) గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పీజీ పూర్తయిన తరువాత పరిశోధనకు సంభందించిన అవగాహన కోసం చాలా మంది విద్యార్థులు ప్రయత్నిస్తారు. అలా కాకుండా, యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడే పరిశోధన పట్ల ఆసక్తి కలిగి ఉండటం, వాటికి సంభందించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడం ఉత్తమం. ఇలా తెలుసుకోవడం ద్వారా పీజీ అనంతరం పి.హెచ్.డి వైపు వెళ్లాలనుకునే విద్యార్థులకు మార్గం సుగమం అవుతుంది.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జే.అర్.ఎఫ్) అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సి (ఎన్.టీ.ఏ) ద్వారా ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించబడే పరీక్ష. నిబంధనల ప్రకారం ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు జే.అర్.ఎఫ్. అవార్డు ప్రకటిస్తారు. సామాజిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన పీజీ పూర్తయిన విద్యార్థులందరికీ జే.అర్.ఎఫ్ ప్రకటన ఇదే విధానలో ఉంటుంది. తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయాలనుకునే విద్యార్థులకు జే.అర్.ఎఫ్ అనేది అత్యున్నత పరిశోధనా మార్గం. ఎందుకంటే, యూనివర్సిటీలో పీ.హెచ్.డి సీటు పొందటం దగ్గర నుంచి  పరిశోధన పూర్తయ్యేంత వరకు జే.అర్.ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జే.అర్.ఎఫ్ సాధించిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల పాటు (రెండేళ్లు జే.అర్.ఎఫ్, మూడేళ్లు ఎస్.అర్.ఎఫ్) సుమారు 35 వేల నుంచి 40 వేల రూపాయలు ప్రతినెలా ఫెలోషిప్ అందుతుంది.

ప్రతి సంత్సరం రెండుసార్లు..

జే.ఆర్.ఎఫ్ కోసం ప్రతి సంత్సరం రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్.టీ.ఏ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. నెట్ తరహాలోనే ఈ పరీక్ష ఉన్నప్పటికీ ఎంపిక విధానం విడిగా ఉంటుంది. ఈ పరీక్షలో టాప్ స్కోర్ చేసిన అభ్యర్థులకు రిజర్వేషన్ల వారీగా అందుబాటులో ఉన్న స్లాట్స్ అనుగుణంగా జే.అర్.ఎఫ్ ఫలితాలు ప్రకటిస్తారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో 3 గంటల సమయంలో 300 మార్కులకు రెండు ప్రశ్న పత్రాలు విడివిడిగా రాయాల్సి ఉంటుంది. పేపర్ -1( జనరల్ స్టడీస్, టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్) 100 మార్కులకు,   పీజీ స్థాయి తెలుగు సాహిత్యంపై 200 మార్కులకు, మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ విధానంలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో టాప్ స్కోర్ చేసిన వారికే జే.ఆర్.ఎఫ్ అవార్డు ప్రకటిస్తారు. 31సంవత్సరాల వయస్సులోపు అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. నిబంధనల మేరకు రిజర్వేషన్ అభ్యర్థులకు వయసులో సడలింపు లభిస్తుంది. పీజీ చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. మరీ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే జే.అర్.ఎఫ్ అవార్డు, లెటర్ అందిన మూడు సంవత్సరాల వరకే ఇది చెల్లుబాటులో ఉంటుంది. అదే నెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటి జీవితకాలం ఉంటుంది.

దేశవ్యాప్త పోటీ...

జే.అర్.ఎఫ్ కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో పీజీ తెలుగు సాహిత్యం పూర్తి చేసిన విద్యార్థులు జే.ఆర్.ఎఫ్ కోసం పోటీపడతారు. తెలుగు సాహిత్యంలో జే.అర్.ఎఫ్ కోసం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాస్తున్నప్పటికీ ప్రతి సెషన్లో కేవలంలో పదుల సంఖ్యలోనే అర్హత సాధిస్తారు.2020 జూన్ పరీక్షలో రిజర్వేషన్ కేటగిరీలన్నింటిలో కలిపి తెలుగులో కేవలం 34 మంది అభ్యర్థులు మాత్రమే జే.అర్.ఎఫ్ ఆర్హత సాధించారు. ఓపెన్ కాంపిటీషన్లో సుమారు 60.67 శాతం మార్కులు కట్ ఆఫ్ గా ఉన్నట్లు గమనించవచ్చు. ఒక శాతం అటూ ఇటుగా అన్ని రిజర్వేషన్ కేటగిరీలోనూ ఇదే కట్ ఆఫ్ మార్కులు గమనించవచ్చు.  దీనిని బట్టి జే.ఆర్.ఎఫ్ సాధించటం ఎంత కష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు. కానీ, యూనివర్సిటీలో పీజీ చదువు కోసం అడుగు పెట్టినప్పటి నుంచే పరిశోధన, ఉన్నత విద్య పట్ల అవగాహన పెంచుకుంటూ, ప్రణాళిక ప్రకారం చదవడం ద్వారా జే.అర్.ఎఫ్ సాధించటం కష్టమైన విషయం కానే కాదు.



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్