జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

తెలుగు సాహిత్య పరిశోధన- ప్రాథమిక విషయాలు

 


తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత, ప్రయాణం ఎటు వైపు..?? ఇది చాలా మంది తెలుగు సాహిత్య విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్న. అభిరుచి, సలహాలను బట్టి రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొందరు ప్రైవేటు కళాశాలలు/ పాఠశాలల్లో ఉద్యోగాలు చేయడానికి సిద్ధపడతారు. మరికొందరు పోటీపరీక్షల వైపు, తెలుగు పండిట్ ట్రైనింగ్, బీఈడీ వంటి వృత్తి విద్యా కోర్సులు చేయడానికి ఆసక్తి చూపుతారు. కొద్ది మంది విద్యార్థులు మాత్రం పరిశోధన వైపు ఆకర్షితులౌతారు. వందలో కనీసం పది శాతం మంది విద్యార్థులు తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాలనే ఆసక్తి కనబరుస్తారు. అలాంటి విద్యార్థుల కోసం పరిశోధన వైపు అడుగులు వేయడానికి కావలసిన ప్రాథమిక విషయాలను తెలుసుకుందాం.

మంచి నిర్ణయం..

తెలుగు సాహిత్య పరిశోధన వైపు అడుగులు వేయాలను కోవడం మంచి ఆలోచన, నిర్ణయం. అయితే విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి సీటు సంపాదించడం అంత సులువైన విషయం కాదు. ఉదాహరణకు, ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 40 సీట్లు అందుబాటులో ఉంటే, అదే యూనివర్సిటీలో పరిశోధన కోసం పరిశోధనా మార్గదర్శకులు (గైడ్), వారి వద్ద అందుబాటులో ఉండే పరిశోధకుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని కొన్ని సందర్భాల్లో అతి కొద్ది సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గతంలో ఎం.ఫిల్ , పి.హెచ్.డి లో విడివిడిగా ప్రవేశం ఉండడంతో పరిశోధనల వైపు వెళ్లాలనుకునే విద్యార్థులకు అవకాశాలు, సీట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో కేవలం పి.హెచ్.డి మాత్రమే అవకాశం ఉండడంతో పోటీ కూడా తీవ్రంగా పెరిగింది. రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (అర్ సెట్) ద్వారా మాత్రమే పి.హెచ్.డి లో ప్రవేశం పొందాలనే నిబంధన ఉండటంతో పోటీ కూడా పెరిగింది. ఇప్పటికే ఆర్ సెట్-2021 ద్వారా ఈ ఏడాది పి.హెచ్.డి ప్రవేశ పరీక్ష కూడా పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే. 

ప్రస్తుతం అందుబాటులో ఖాళీలు..

తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి చేయాలనుకునే అభ్యర్థుల కోసం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆర్ సెట్-2021 ద్వారా ఫుల్ టైంలో 32, పార్ట్ టైంలో 20 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విశ్వవిద్యాలయాల వారీగా చూస్తే.. ఏ.ఎన్.యూ లో 4 ఫుల్ టైం, 2 పార్ట్ టైం అందుబాటులో ఉన్నాయి. ఇదే విధంగా వి.ఎస్.యూ లో 2 ఫుల్ టైం, 1 పార్ట్ టైం, ఎస్.కే.యూ లో 5 ఫుల్ టైం, ఏ.యూ లో 3 ఫుల్ టైం, 6 పార్ట్ టైం, డీ.యూ లో 10 ఫుల్ టైం, 5 పార్ట్ టైం, ఆర్.యూ లో 1 పార్ట్ టైం, ఎస్.పి.ఎం.వి లో 1 ఫుల్ టైం, ఎస్.వి.యూ లో 2 పార్ట్ టైం, వై.వి.యూ లో 7 ఫుల్ టైం, 3 పార్ట్ టైం ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధన పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంఖ్యతో పోలిస్తే అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య చాలా తక్కువ అనే విషయం అర్థమవుతుంది.

పోటీ ఎలా ఉంటుందంటే..

తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి ప్రవేశం కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇదివరకే యూజీసీ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జే. అర్. ఎఫ్ ) సాధించిన అభ్యర్థులు, నెట్, ఏపీనెట్ అర్హత ఉన్న వాళ్లు పి.హెచ్.డి చేసేందుకు పోటీ పడతారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత ఉండి పి.హెచ్.డిలో ప్రవేశం పొందితే పరిశోధన పూర్తయ్యేంత వరకూ (సుమారు నాలుగు ఏళ్ల పాటు) నెలకు 35 నుంచి 40 వేల రూపాయలు వరకూ ఉపకారవేతనం అందుతుంది. అలాగే ఆర్.జి.ఎన్.ఎఫ్ వంటి ఇతర ఫెలోషిప్ లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు కొన్ని విశ్వవిద్యాలయాల ఫెలోషిప్ లు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రెగ్యులర్ గా పి.హెచ్.డి ప్రవేశం సాధించిన విద్యార్థులు సుమారు నాలుగు సంవత్సరాల పాటు విశ్వవిద్యాలయంలోనే ఉండటం, ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధన చేయాల్సి రావడం చాలా మంచి అంశాలుగా పరిగణించవచ్చు. ఈ కాలంలో సాహిత్య పరిశోధనలో ఎన్నో కొత్త అంశాలు నేర్చుకోవచ్చు. సాహిత్యంలో విజయ వంతంగా పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సాధించిన పరిశోధకుల భవిషత్తు ఉజ్వలంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి, తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులు పరిశోధన వైపు అడుగులు వేయడం చాలా మంచి నిర్ణయం. ఆల్ ద బెస్ట్.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్