జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

చూడాల్సిన "కర్ణన్"


కర్ణన్ సినిమా చూసిన తర్వాత ప్రేమా, పెళ్లి సినిమాల దగ్గరే నేను ఆగిపోలేదు కదా అన్న సందేహం కలిగింది. ఇంకాస్త ముందుకు వెళ్లాలనీ, ఇంకా, ఇంకా ముందుకు వెళ్లాలని అనిపించింది. కర్ణన్ సినిమాలో కథ బాగుందా, మారి సెల్వరాజ్ డైరెక్షన్ గొప్పదా, ధనుష్ నటన అద్భుతంగా ఉందా, అందులోని పాత్రలు, సన్నివేశాలు సూపరా.. ఇవన్నీ చెప్పడం చాలా చాలా కష్టం. కానీ, ఎక్కడైనా ఓ సంఘటన జరిగితే, అందులో నేను కూడా పాత్రధారినై ఉంటే, ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో సేమ్ టు సేమ్ కర్ణన్ సినిమా చూస్తున్నప్పుడు నాకూ అలానే అనిపించింది."ఆత్మాభిమానం" అనే పదాన్ని నేను చాలాసార్లు విన్నా. అర్థం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ, మొదటి సారి కళ్ళకు కట్టినట్టు కర్ణన్ సినిమాలో చూశా. మన తెలుగులో ఇలాంటి కథలు లేవా, ఉన్నా.. మన వాళ్ళు తీయరా, తీసినా.. ప్రేక్షకులకు నచ్చదా.. ఇలాంటి  ప్రశ్నలకు ఇక్కడ నేను సమాధానం వెతకడం లేదు. కానీ, సినిమా అనే అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం నుంచి ఎంతో కొంత తెలుసుకోవాలి, కొద్దో గొప్పో నేర్చుకోవాలి, కొత్తదనాన్ని చూడాలి అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం.. అతి కొద్ది సినిమాలకే ఈ కాన్సెప్ట్ సరిపోతుందని నా అభిప్రాయం. అందుకే కర్ణన్ లాంటి సినిమాలు అస్సలు మిస్ కాకూడదు. ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరూ చూడాలి. చూసి దాని గురించి ఆలోచించాలి, వీలుంటే చర్చించాలి. 

మలయాళంలో ఓ అద్భుతమైన కవిత ఉంది. దాని సారం ఏంటంటే..అనగనగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక ఇంట్లో అన్నం ఉడికితే చాలు పొరుగింట్లో ఆకలి తీరుతుంది. ఆ ఊర్లో ఒక్కరి కంట్లో కన్నీరు కారినా ఊరంతా ఉరికొచ్చి అండగా నిలిచేది. ఇప్పుడు అలాంటి ఊర్లు లేవుకదా అని కవి ఆవేదన చెందుతాడు. అలాంటి ఊరు మీకు కనిపించిందా అని ప్రశ్నిస్తాడు. నిజంగా,అలాంటి ఊరే మనకు కర్ణన్ సినిమాలో కనిపిస్తుంది. అంతటి ప్రేమ, అమాయకత్వం ఉన్న ఆ ఊరి జనాల ఆత్మాభిమానం మీద దెబ్బతగిలితే..? అలాంటి అమాయకులకు అన్యాయం జరిగితే...? అలాంటి అమాయకుల మధ్య నుంచి ప్రశ్నించే వ్యక్తి పుట్టుకొస్తే ఏం జరుగుతుంది...??? అదే కర్ణన్. కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, సంగీతం.. ఒకటేమిటి అన్నీ చాలా బాగున్నాయ్.

- శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్