జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం, బోధన, పరిశోధనతో కూడిన ఉద్యోగ బాధ్యత, వృత్తిలో సంతృప్తి, ప్రతి నెలా సుమారు డెభై నుంచి ఎనభై వేల రూపాయల ప్రారంభ వేతనం.. వెరసి, ఆకర్షణీయమైన "డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్" ఉద్యోగం సాధించాలనే కోరిక స్నాతకోత్తర విద్య పూర్తి చేసిన పట్టభద్రులందరికీ ఉంటుంది. చాలా మంది అభ్యర్థులకు డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్ అవడం ఒక కల కూడా. అయితే, ఈ కలని నిజం చేసుకోవడం అసాధ్యమైన విషయం మాత్రం కాదు. పట్టుదల, ప్రణాళిక ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అటూఇటుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ కళాశాల లెక్చరర్ల ఉద్యోగ నియామకం చేపడుతోంది. గతంలో 2011లో ఒక నోటిఫికేషన్, 2016, 2018లో మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ రెండు నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెల ( 2023 డిసెంబర్)లో మరో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డిగ్రీ కళాశాలలో "తెలుగు లెక్చరర్" గా విజయం సాధించడానికి అవసరమైన ప్రాథమిక విషయాలను తెలుసుకుందాం..
బోధనతో ముడిపడిన ఉద్యోగాలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో పూర్తి సంతృప్తి లభిస్తుంది. అందుకే వివిధ స్థాయిల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకం పొందాలనే వారు కష్టమైన పోటీ పరీక్షను కూడా పాసవ్వాలి. ఉన్నత విద్య అయిన డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్ గా నియామకం పొందాలంటే పీజీ తో పాటు ఏపీసెట్ లేదా నేట్ పరీక్షలో అర్హత సాధించాలనేది ప్రాథమిక నిబంధన. ఈ అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరూ డిగ్రీ కళాశాల లెక్చరర్ ఉద్యోగం కోసం పోటీ పడవచ్చు. గతంలో విడుదలైన నోటిఫికేషన్లను ఒకసారి పరిశీలిస్తే. 2011లో ఒక నోటిఫికేషన్, 2016, 2018లో మరో రెండు నోటిఫికేషన్లు విడుదలైయ్యాయి. 2011 లో 27, 2016లో 22 మరియు 2018లో 5 ఉద్యోగాలు తెలుగు విభాగంలో భర్తీ అయ్యాయి. ఇక, 2023లో విడుదలయ్యే నోటిఫికేషన్లో ఎన్ని తెలుగు లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారనేది వేచి చూడాల్సిందే.
పోటీ ఎలా ఉంటుందంటే..
తెలుగు లెక్చరర్ కోసం పోటీ తీవ్రంగానే ఉంటుందన్న విషయం అభ్యర్థులందరికీ తెలిసిందే. 2016 నోటిఫికేషన్ పరిశీలిస్తే 22 ఉద్యోగాల కోసం అన్ని కేటగిరీల్లో సుమారు 3260 ధరఖాస్తులు ఏపీపీఎస్సీకి అందినట్లు సమాచారం. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు మూడువేల మంది అభ్యర్థులు తెలుగు సబ్జెక్టులో యూజీసీనెట్ మరియు ఏపిసెట్ అర్హత సాధించారనే విషయం అర్థమవుతుంది. నెట్, ఏపిసెట్ లో అర్హత సాధించిన వారందరూ తెలుగు సబ్జెక్టుపై మంచి పట్టు సాధించి ఉంటారు. ధరఖాస్తు చేసిన వారిలో యాభై శాతం మంది అభ్యర్థులు సీరియస్ గా ప్రిపేర్ అయినా పోటీ తీవ్రంగా ఉన్నట్లు భావించాలి. కొన్ని రిజర్వేషన్ కేటగిరీలో పోటీ కాస్త తక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు.
ఎలా చదవాలంటే ..
పోటీ తీవ్రతను బట్టి మన సంసిద్ధత కూడా ఉండాలి. రాసే అభ్యర్థుల సంఖ్య, అందరూ సబ్జెక్టు మీద మంచి పట్టు సాధించిన వారే కాబట్టి మన ప్రిపరేషన్ కూడా ప్రణాళికాబద్దంగా ఉండాలి. ఇలాంటి పరీక్షలు ఒలంపిక్స్ పరుగు పందెం లాంటివి. ఎన్ని సంవత్సరాలు కష్టపడినా చివరిగా ట్రాక్ లో చూపించే ప్రతిభ, సమయస్పుర్తిని బట్టే విజయం వరిస్తుంది. గత నోటిఫికేషన్ల ప్రకారం డీ.ఎల్ పరీక్షలో విజయం సాధించాలంటే రెండు దశల (పరీక్ష, ఇంటర్వ్యూ) వడపోత నెగ్గాల్సి ఉంటుంది. పరీక్షలో 450 మార్కులకు గాను 300 మార్కులు పీజీ స్థాయి తెలుగు సబ్జెక్టు పై,150 మార్కులు జనరల్ స్టడీస్ పై ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఒక పోస్టుకు ఇద్దరు చొప్పున ఇంటర్వ్యూ చేసి నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రస్తుతం వచ్చే నోటిఫికేషన్ లో విధివిధానాలు ఎలా ఉంటాయి అనేది పరిశీలించాలి. కనీసం ఒక ఏడాది పాటు ప్రణాళికాబద్ద ప్రిపరేషన్తో విజయం సాధించే అవకాశాన్ని మెరుగు పరచుకోవచ్చు. ఇది వరకే తెలుగు సాహిత్యం బాగా చదివి ఉన్నా ఇంకా వివిధ కోణాల్లో దానిపై పట్టు సాధిస్తూ జనరల్ స్టడీస్ పై ప్రతేక శ్రద్ధ చూపాలి. వీలుంటే కోచింగ్ తీసుకోవడం మంచి నిర్ణయం.
నిరుత్సాహం వద్దు...
మన లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. పీజీ తెలుగు సాహిత్యం చదివిన విద్యార్థులు మొదటిగా డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం నిర్ణయించుకోవాలి. దాని కోసం నిరంతరం శ్రమించాలి. ఒకవేళ డీఎల్ ఉద్యోగం తృటిలో చేజారినా మన కష్టానికి తగిన ప్రతిఫలం ఏదో రూపంలో ఉంటుంది. టీచర్ వంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సునాయాసంగా అంది వస్తాయి. అందుకే మన లక్ష్యాన్ని ఉన్నతంగా నిర్దేశించుకొని దాని కోసమే కృషి చేయాలి. ఆల్ ది బెస్ట్.
మరింత అవగాహన కోసం క్రింద ఉన్న 2018 నోటిఫికేషన్ పరిశీలించ వచ్చు...
Meda.jl.notification.vasthunda.
రిప్లయితొలగించండి.
విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు మేడం
రిప్లయితొలగించండిమంచి సమాచారం అయితే notification ఎప్పుడు ఉండచ్చు...
రిప్లయితొలగించండిMam Degree lecture exam ki prelims mains laantivi untaaya leka direct exam and interview maatrame untaay madam.
రిప్లయితొలగించండిNegative marking untundha madam gaaru?
ఇంటర్వ్యూ లేదని తెల్సు
రిప్లయితొలగించండిఅవును, నోటిఫికేషన్ వస్తె పూర్తి క్లారిటీ వస్తుంది.
తొలగించండి2018 question paper unte sent me group sir
రిప్లయితొలగించండిఈ బ్లాగ్ లోనే ఉంది చూడండి.
తొలగించండి