పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

గుర్రం జాషువా అరుదైన చిత్రమాలిక

చిత్రం
1. గుర్రం జాషువా 2. గుర్రం జాషువా తల్లిదండ్రులు వీరయ్య, లింగమాంబ 3. గుర్రం జాషువా దంపతులు 4. గుర్రం జాషువా కుమార్తెలు,కుమారులు 5. వినుకొండలో తెలుగు ఉపాధ్యాయుడిగా  6. దాశరధితో 7. భీమవరం విద్యార్థులతో 8. కుమార్తె హేమలత లవణం, గోరా దంపతులతో 9. విద్వాన్ విశ్వం, దాశరథితో 10. గుర్రం జాషువా స్వదస్తూరి ------------------------------------------ సేకరణ: జాషువా శత జయంతి విశిష్ట సంచిక నుంచి

వినుకొండ విద్యార్థి..

చిత్రం
భావకవిత్వానికి భిన్నంగా అభ్యుదయ కవిత్వాన్ని పుట్టించిన నేల మన వినుకొండ. ఇక్కడి గాలుల్లోనే సాహితీ సౌరభాలు వెదజల్లుతాయి. వినుకొండ స్పర్శతో ఎందరో కవులు తెలుగు సాహిత్య చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని పొందారు.  "పాత కాలం పద్యమైతే, వర్తమానం వచన గేయం" అని ఎలుగెత్తి చాటిన వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు వినుకొండ విద్యార్థి. తెలుగు సాహితీ చరిత్రలో కుందుర్తి సుపరిచితుడు. అప్పటి వరకూ విస్తరించిన కవితోద్యమాలకు భిన్నంగా "వచన కవిత్వాన్ని" ఒక ఉద్యమంగా ప్రచారం చేసిన సాహిత్యకారుడు కుందుర్తి ఆంజనేయులు. అంతకు ముందు తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం లేదని కాదు. మహామహులైన తెలుగు సాహిత్య కారులు చాలా మందే వచన కవిత్వం రాశారు. కానీ, వచన కవిత్వాన్ని ఉద్యమంగా తెలుగుదేశంలో ప్రచారం చేయడంలో కుందుర్తి ఆంజనేయులు సఫలీకృతుడయ్యాడు. అందుకే కుందుర్తికి "వచన కవితా పితామహుడు" ఆన్న బిరుదు సార్థకమైంది. కుందుర్తికి లభించిన వచన కవితా పితామహుడు బిరుదు కూడా అలనాడు అల్లసాని పెద్దనకు లభించిన "ఆంధ్ర కవితా పితామహుడు" బిరుదు లాంటిదేనని సాహితీ విమర్శకులు చెబుతారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతటి...

స్టడీ లీవ్

చిత్రం
ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తదుపరి పదోన్నతి కోసం విద్యార్హతలు కలిగి ఉండడం అవసరంగా భావిస్తారు. పదోన్నతి కోసం దూరవిద్యా విధానంలో విద్యార్హతలు పెంచుకోవడం ఒక మార్గం, స్టడీలీవ్ ద్వారా చదువుకోవడం రెండో మార్గం. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం స్టడీలీవ్ మంచి వెసలుబాటు. తదుపరి పదోన్నతి పొందేందుకు తమ విద్యార్హతలు పెంచుకునేందుకు ఎలాంటి సర్వీస్ నష్టపోకుండా, పూర్తి జీతంతో కూడిన స్టడీలీవ్ పొందే వెసలుబాటు ఎస్సీ, ఎస్టీ  ప్రభుత్వ ఉపాధ్యాయు కోసం ప్రభుత్వం కల్పించింది. జీవో నంబర్ 342 ద్వారా కొన్ని నిబంధనలకు లోబడి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. డీఈడి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత తదుపరి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందాలంటే బీఈడి పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగం చేస్తూనే బీఈడి చేయడానికి దూరవిద్యా విధానం ఉత్తమ మార్గం. దూరవిద్యా విధానంలో సాధించిన బీఈడి అర్హత రెగ్యులర్ బీఈడితో సమానం. దూరవిద్య విధానంలో కాకుండా నేరుగా కళాశాలకు వెళుతూ బీఈడి చదవాలనుకునే వారికి స్టడీలీవ్ మంచి అవకాశం. అయితే ఈ అవకాశం ఎస్సీ, ఎస్టీ  ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. ఎలాంటి సర్వీస్, ఇంక్రిమెంట్లు క...

నెట్ తెలుగులో పోటీ తీవ్రం

చిత్రం
తెలుగు సాహిత్యంలో యూజీసీ నెట్ అర్హత సాధించాలన్నా, జేఆర్ఎఫ్ అవార్డు పొందాలన్నా, డీఎల్ వంటి పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా పోటీ చాలా తీవ్రంగానే ఉంటుంది. తెలుగు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగు సాహిత్యం చదివే విద్యార్థులతో పాటు, దూరవిద్య ద్వారా తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఎంఏ తెలుగు సాహిత్యం పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి యూజీసీ నెట్ లో అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంటారు. దీంతో తెలుగు సాహిత్యంలో నెట్, సెట్, ఇతర పరీక్షలకు ప్రతి ఏడాది పోటీ తీవ్రత పెరుగుతోంది. 2021 యూజీసీ నెట్ ఫలితాలను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా 81 సబ్జెక్టుల్లో 6,71,288 మంది అభ్యర్థులు నెట్ పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా నెట్ పరీక్షకు హాజరైన సబ్జెక్టుల్లో తెలుగు సాహిత్యం 30వ స్థానంలో ఉండటం గమనార్హం.2020 డిసెంబర్, 2021 జూన్ రెండు సషన్లకు కలిపి గత ఏడాది డిసెంబర్లో  నెట్ పరీక్షలు జరిగాయి. తెలుగు సాహిత్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటూ ఇతర రాష్ట్రాలలో తెలుగు సాహిత్యం చదివిన 4902 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాయారైనట్లుగా యూజీసీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. వీరిలో కేవలం 154 మంది అభ్య...

భారతీ రాజా "ఆత్మ బంధువు"

చిత్రం
ఇది, పదేళ్ల క్రితం నాటి ముచ్చట. ఓ మిత్రుడితో పిచ్చాపాటి మాట్లాడుతున్న సందర్భంలో "ఆత్మ బంధువు" సినిమా చూసావా అన్నాడు. ఏ ఆత్మ బంధువు అడిగాను. భారతీ రాజాది బదులిచ్చాడు. భారతీ రాజా సినిమా మిస్సవడం, అప్పటి వరకూ ఆత్మ బంధువు పేరు కూడా వినకపోవడం నా అల్ప సినిమా పరిజ్ఞానానికి నిదర్శనంగా అనిపించింది. మారు మాట్లాడకుండా ఆ మర్నాడే ఆత్మ బంధువు సీడీ కొన్నాను. ఓ ఆదివారం సాయంత్రం సినిమా ఆసాంతం ఏకబిగిన చూసాను. సహజ సిద్ధమైన భారతీ రాజా విషాదాంత ముగింపుతో నా కంటి చివరన కూడా ఓ చిన్న తడి మెరిసి ఆరింది. ఆ సినిమా కథ, ఆ రాత్రంతా నన్ను వెంటాడింది. ఇంత మంచి సినిమా ఇంతకాలం చూడలేక పోయానే అని పదే పదే సిగ్గుపడ్డాను. మళ్ళీ పదేళ్ల తరువాత మనసు కాస్త నలతగా ఉన్న ఈ రోజు అదే ఆత్మబంధువు సినిమా మళ్ళీ చూడాలనిపించిది. యూ ట్యూబ్ లో పూర్తి సినిమా అందుబాటులో ఉండటంలో మరో సారి చూసేశా. మనసుకు హాయిగా అనిపించింది. భారతీ రాజా సినిమాలంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన తీసిన సినిమాల్లో కొన్ని సినిమాలు కళ్లతో చూడల్సినవి వుంటే, మరి కొన్ని సినిమాలు మనసుతో చూడాల్సినవి ఉంటాయి. మనసుకి మాత్రమే అర్థమయ్యే సినిమాల్లో "ఆత్మ బంధువు" ఒక...

నెట్ - తెలుగు కట్ ఆఫ్

చిత్రం
యూజీసీ నెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. స్కోర్ కార్డు, కట్ ఆఫ్ వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ, యూజీసీ అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ అధ్వర్యంలో 81 సబ్జెక్టుల్లో దేశవ్యాప్తంగా 239 నగరాల్లో 837 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. డిసెంబర్ 2020 , జూన్ 2021 రెండు షషన్లను కలిపి గత ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 మధ్య నెట్ ఆర్హత పరీక్ష నిర్వహించారు. సుమారు 12 లక్షల మంది అభ్యర్థులు నెట్ పరీక్షకు హాజరై ఉంటారని అంచనా. తెలుగు కట్ ఆఫ్... తెలుగు సాహిత్యంలో సుమారు 154 మంది అభ్యర్థులు నెట్ అర్హత సాధించారు. వీరిలో 44 మంది అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు పొందారు. 300 మార్కులకు జరిగిన నెట్ పరీక్షలో కట్ ఆఫ్ మార్కులను పరిశీలిస్తే ..  ఆన్ రిజర్వడ్   - 154  ఈడబ్లుఎస్.     - 146 ఓబీసీ              - 140 ఎస్సీ                - 130 ఎస్టీ                  - 128 జేఆర్ఎఫ్ కట్ ఆఫ్.. ఆన్ రిజర్వడ్    - 168 ఈడబ్లు...

తంజావూరు వెళ్దాం రండి..!

చిత్రం
తమిళ ప్రాంతం వెళ్ళడం నాకు కొత్తేం కాదు. కానీ, వెళ్లిన ప్రతిసారీ కొత్తగానే కనిపిస్తుంది. తమిళ చిత్రాలు విపరీతంగా చూడటం, తమిళ సంగీతం ఇష్టంగా వినడంతో మొదటి నుంచీ నాకు తమిళ ప్రాంతంపై ప్రేమ. సంస్కృతిని నెత్తిన పెట్టుకుని పూజించే తమిళ ప్రజలంటే అభిమానం. ద్రావిడ భాషా కుటుంబంలో తమిళ ప్రజలు అన్ని విషయాల్లో ఒకడుగు ముందుంటారనీ, విశాలమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటారని నా నమ్మకం. అందుకే, తమిళ సంస్కృతిని దగ్గరగా చూడాలనే ఆలోచనతో ఏడాదిలో ఒకసారైనా  తమిళనాడులో ఏదో ఒక చారిత్రక ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా ఈ ఏడాది నా జాబితాలో తంజావూరులోని "బృహదీశ్వరాలయం" చేరిపోయింది. తెలుగు సాహిత్యం చదివే రోజుల్లోనే శైవ కవితోద్యమాన్ని బాగా చదివేవాడిని. సమాజంలో అంతరాలను తుడిపేసి సమానత్వాన్ని కోరుకున్న మతాల్లో శైవం ప్రధానంగా చెప్పుకోదగింది. అందుకే, శైవ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు చూడడం, వాటి చారిత్రక విశేషాలు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. చారిత్రక కట్టడాలను సందర్శించాలని అనుకున్నప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఆ కట్టడాల చరిత్రను చదివి బాగా అర్థం చేసుకోవడం. చరిత్రను తెలుసుకుని చారిత్రక దేవాలయ...

జన్మభూమిలో జాషువా జాడలేవి ?

చిత్రం
మహాకవి గుర్రం జాషువా కవిత్వం విశ్వవ్యాప్తం కానంత వరకు "వినుకొండ" గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. వినుకొండలో పుట్టిన గుర్రం జాషువా విశ్వనరుడిగా ఎదిగాడు. పల్నాడులో వెనుకబడిన ప్రాంతంగా పేరు పడిన వినుకొండ ఖ్యాతిని ప్రపంచం ముందు నిలిపాడు. సాహిత్యాభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికీ గుర్రం జాషువా అంటే వినుకొండ గుర్తొచ్చేలా చేశాడు. పుట్టిన గడ్డ వినుకొండ అంటే జాషువాకు ఎంతో మమకారం. "ననుగాంచి పెంచి నాలో గొనంబు గవనంబు పాదు కొల్పిన తల్లి ! నను మరిచిన నిను మరువను  వినుకొండా! నీకు నా పవిత్ర ప్రణతుల్" అంటూ వినుకొండకు ప్రణమిల్లాడు జాషువా. వినుకొండలోని మిస్సమ్మ తోటలో 1895 సెప్టెంబర్ 28న గుర్రం జాషువా జన్మించాడు. తల్లిదండ్రులు వీరయ్య, లింగమాంబలది వర్ణాంతర వివాహం. చిన్నప్పటి నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కులమత విద్వేషాలు ఎదుర్కొన్న జాషువా వినుకొండలోని మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. అందుకే జాషువా చాలా సందర్భాల్లో ఇలా చెప్తాడు. ." నా గురువులు ఇద్దరు..పేదరికం, అంటరానితనం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే..రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కానీ బానిసగా మాత్రం మార్చలేదు.." అంటా...

మరుగున పడిన వినుకొండ మధుర కవులు

చిత్రం
 ‘‘ఎంత కోయిల పాట వృథయయ్యెనో కదా చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎంత రత్నకాంతి, యెంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుటరాని చోట పుట్టుకతన’’  - అన్న మహాకవి గుర్రం జాషువా పద్యం గుర్తుకు తెచ్చే కాలం అది. కవిత్వానికి కులం ఓ కొలమానంగా ఉన్న రోజులవి. వర్ణ వ్యవస్థను ధిక్కరిస్తూ హిందూ గ్రంథాలు చదవడం అప్పట్లో సాహసంతో కూడుకున్న పని. అలాంటి రోజుల్లో అస్పృశ్యతపై నిరసన గళం విప్పి కలం పట్టిన కవులు ఆధునిక సాహిత్య చరిత్ర ప్రథమార్థంలో కొద్దిమందే ఉన్నారు. దళిత ఉద్యమాన్ని రెండు భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని అస్పృశ్యతా నిరసన ఉద్యమం అన్నారు సాహిత్య కారులు. 1909లో ‘ఆంధ్రభారతి’ పత్రికలో ప్రచురితమైన ‘మాలవాండ్ర పాట’ అన్న గేయంలో ‘అస్పృశ్యతా నిరసన’ కనిపిస్తుంది. గాంధీ రాకతో అది ‘ఉద్యమం’గా మారింది. 1930 నుంచి హరిజనులు సాహిత్య రంగ ప్రవేశం చేశారు. కావ్యాల రూపంలో తమ సమస్యలను రాయటం మొదలుపెట్టారు. సాహిత్య క్షేత్రంలో కలం పట్టి కులం కంపును ఏరివేసే ప్రయత్నం చేశారు. అలాంటి ఉద్యమంలో వినుకొండ (గుంటూరు...