జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తదుపరి పదోన్నతి కోసం విద్యార్హతలు కలిగి ఉండడం అవసరంగా భావిస్తారు. పదోన్నతి కోసం దూరవిద్యా విధానంలో విద్యార్హతలు పెంచుకోవడం ఒక మార్గం, స్టడీలీవ్ ద్వారా చదువుకోవడం రెండో మార్గం. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం స్టడీలీవ్ మంచి వెసలుబాటు. తదుపరి పదోన్నతి పొందేందుకు తమ విద్యార్హతలు పెంచుకునేందుకు ఎలాంటి సర్వీస్ నష్టపోకుండా, పూర్తి జీతంతో కూడిన స్టడీలీవ్ పొందే వెసలుబాటు ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉపాధ్యాయు కోసం ప్రభుత్వం కల్పించింది. జీవో నంబర్ 342 ద్వారా కొన్ని నిబంధనలకు లోబడి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
డీఈడి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత తదుపరి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందాలంటే బీఈడి పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగం చేస్తూనే బీఈడి చేయడానికి దూరవిద్యా విధానం ఉత్తమ మార్గం. దూరవిద్యా విధానంలో సాధించిన బీఈడి అర్హత రెగ్యులర్ బీఈడితో సమానం. దూరవిద్య విధానంలో కాకుండా నేరుగా కళాశాలకు వెళుతూ బీఈడి చదవాలనుకునే వారికి స్టడీలీవ్ మంచి అవకాశం. అయితే ఈ అవకాశం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. ఎలాంటి సర్వీస్, ఇంక్రిమెంట్లు కోల్పోకుండా రెగ్యులర్ విధానంలో కళాశాలకు వెళుతూ బీఈడి కోర్సు పూర్తి చేయవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత యధావిధిగా తిరిగి ఉపాధ్యాయ విధుల్లో చేరాల్సి ఉంటుంది. బీఈడీ పూర్తి చేసే ఈ కాలంలో సర్వీస్ లో ఉన్న మాదిరిగానే పూర్తి జీతం, ఇతర ఆర్థిక పరమైన అంశాలు కొనసాగుతాయి.
ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే 342 జీవో వర్తిస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సర్వీసులో చేరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులు స్టడీలీవ్ ఉపయోగించుకోవచ్చు. తదుపరి పదోన్నతి కోసం విద్యార్హతలు పొందేందుకు మాత్రమే స్టడీలీవ్ తీసుకునే వెసలుబాటు ఉంటుంది. ఎంచుకున్న కోర్సును బట్టి గరిష్టంగా రెండు సంవత్సరాల లోపు స్టడీలీవ్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే స్టడీలీవ్ పొందాలను కుంటున్నారో వారు తమ వారసత్వంలో "మొదటి తరం ఉద్యోగి" అయి ఉండాలి. దీనినే "ఫస్ట్ జనరేషన్" అంటారు. అంటే తల్లిదండ్రులు కానీ తాతముత్తాతలు కానీ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి ఉండకూడదు. స్టడీ లీవ్ పొంది విద్యార్హత సాధించిన తర్వాత కనీసం ఐదు సంవత్సరాల పాటు సంభందిత డిపార్ట్మెంట్ లో పని చేస్తానని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు విద్యాశాఖ నిబంధనలకు లోబడి స్టడీ లీవు పొందే అవకాశం ఉంటుంది.
స్టడీ లీవు కోసం జీవో నెంబర్ 342 ప్రకారం అన్ని అర్హతలు ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు బీఈడీ ప్రవేశార్హత సాధించిన తరువాత దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి ధరఖాస్తు ద్వారా అనుమతి కోరాలి. విద్యార్హతలు, కుల దృవీకరణ పత్రం, జీవో కాపీ, అభ్యర్థన పత్రం, అఫిడవిట్, సెల్ఫ్ డిక్లరేషన్, తహసిల్దార్ ధ్రువీకరించిన " ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ " వంటివి జతచేసి జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి కోసం అభ్యర్థించాలి. ఆన్ని అర్హతలు సరిగా ఉంటే సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారులు స్టడీ లీవ్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి