జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

నెట్ - తెలుగు కట్ ఆఫ్

యూజీసీ నెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. స్కోర్ కార్డు, కట్ ఆఫ్ వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ, యూజీసీ అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ అధ్వర్యంలో 81 సబ్జెక్టుల్లో దేశవ్యాప్తంగా 239 నగరాల్లో 837 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. డిసెంబర్ 2020 , జూన్ 2021 రెండు షషన్లను కలిపి గత ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 మధ్య నెట్ ఆర్హత పరీక్ష నిర్వహించారు. సుమారు 12 లక్షల మంది అభ్యర్థులు నెట్ పరీక్షకు హాజరై ఉంటారని అంచనా.


తెలుగు కట్ ఆఫ్...

తెలుగు సాహిత్యంలో సుమారు 154 మంది అభ్యర్థులు నెట్ అర్హత సాధించారు. వీరిలో 44 మంది అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు పొందారు. 300 మార్కులకు జరిగిన నెట్ పరీక్షలో కట్ ఆఫ్ మార్కులను పరిశీలిస్తే .. 

ఆన్ రిజర్వడ్   - 154 

ఈడబ్లుఎస్.     - 146

ఓబీసీ              - 140

ఎస్సీ                - 130

ఎస్టీ                  - 128


జేఆర్ఎఫ్ కట్ ఆఫ్..


ఆన్ రిజర్వడ్    - 168

ఈడబ్లుఎస్      -  166

ఓబీసీ              -  162

ఎస్సీ                -  146

ఎస్టీ                  - 146

అర్హత సాధించిన అభ్యర్థులందరికీ త్వరలోనే ఈ సర్టిఫికేట్ అందిస్తారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్