జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
తెలుగు సాహిత్యంలో యూజీసీ నెట్ అర్హత సాధించాలన్నా, జేఆర్ఎఫ్ అవార్డు పొందాలన్నా, డీఎల్ వంటి పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా పోటీ చాలా తీవ్రంగానే ఉంటుంది. తెలుగు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగు సాహిత్యం చదివే విద్యార్థులతో పాటు, దూరవిద్య ద్వారా తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఎంఏ తెలుగు సాహిత్యం పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి యూజీసీ నెట్ లో అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంటారు. దీంతో తెలుగు సాహిత్యంలో నెట్, సెట్, ఇతర పరీక్షలకు ప్రతి ఏడాది పోటీ తీవ్రత పెరుగుతోంది.
2021 యూజీసీ నెట్ ఫలితాలను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా 81 సబ్జెక్టుల్లో 6,71,288 మంది అభ్యర్థులు నెట్ పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా నెట్ పరీక్షకు హాజరైన సబ్జెక్టుల్లో తెలుగు సాహిత్యం 30వ స్థానంలో ఉండటం గమనార్హం.2020 డిసెంబర్, 2021 జూన్ రెండు సషన్లకు కలిపి గత ఏడాది డిసెంబర్లో నెట్ పరీక్షలు జరిగాయి. తెలుగు సాహిత్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటూ ఇతర రాష్ట్రాలలో తెలుగు సాహిత్యం చదివిన 4902 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాయారైనట్లుగా యూజీసీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. వీరిలో కేవలం 154 మంది అభ్యర్థులు మాత్రమే నెట్ అర్హత సాధించారు. ఇక జేఆర్ఎఫ్ అవార్డు పొందిన వారు కేవలం 44 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. దీనిని బట్టి తెలుగు సాహిత్యంలో పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు సాహిత్యంలో సుమారు రెండువేల మంది పైగా అభ్యర్థులు నెట్, సెట్ అర్హత సాధించి ఉంటారనేది ఒక ప్రాధమిక అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తెలుగు సాహిత్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్ళడం మంచిది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి