జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

భారతీ రాజా "ఆత్మ బంధువు"

ఇది, పదేళ్ల క్రితం నాటి ముచ్చట. ఓ మిత్రుడితో పిచ్చాపాటి మాట్లాడుతున్న సందర్భంలో "ఆత్మ బంధువు" సినిమా చూసావా అన్నాడు. ఏ ఆత్మ బంధువు అడిగాను. భారతీ రాజాది బదులిచ్చాడు. భారతీ రాజా సినిమా మిస్సవడం, అప్పటి వరకూ ఆత్మ బంధువు పేరు కూడా వినకపోవడం నా అల్ప సినిమా పరిజ్ఞానానికి నిదర్శనంగా అనిపించింది. మారు మాట్లాడకుండా ఆ మర్నాడే ఆత్మ బంధువు సీడీ కొన్నాను. ఓ ఆదివారం సాయంత్రం సినిమా ఆసాంతం ఏకబిగిన చూసాను. సహజ సిద్ధమైన భారతీ రాజా విషాదాంత ముగింపుతో నా కంటి చివరన కూడా ఓ చిన్న తడి మెరిసి ఆరింది. ఆ సినిమా కథ, ఆ రాత్రంతా నన్ను వెంటాడింది. ఇంత మంచి సినిమా ఇంతకాలం చూడలేక పోయానే అని పదే పదే సిగ్గుపడ్డాను. మళ్ళీ పదేళ్ల తరువాత మనసు కాస్త నలతగా ఉన్న ఈ రోజు అదే ఆత్మబంధువు సినిమా మళ్ళీ చూడాలనిపించిది. యూ ట్యూబ్ లో పూర్తి సినిమా అందుబాటులో ఉండటంలో మరో సారి చూసేశా. మనసుకు హాయిగా అనిపించింది.


భారతీ రాజా సినిమాలంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన తీసిన సినిమాల్లో కొన్ని సినిమాలు కళ్లతో చూడల్సినవి వుంటే, మరి కొన్ని సినిమాలు మనసుతో చూడాల్సినవి ఉంటాయి. మనసుకి మాత్రమే అర్థమయ్యే సినిమాల్లో "ఆత్మ బంధువు" ఒకటి. ఆత్మ బంధువు అంటే భార్య అంటారు కదా..! కష్ట సుఖాలలో ఆ తర్వాత కూడా అనుసరించేది అర్ధాంగి కాబట్టి, అర్ధాంగిని ఆత్మ బంధువుగా అభివర్ణించారు. కానీ ఈ భారతీ రాజా ఎంటి..?? ఆత్మ బంధువుకు కొత్త అర్థాన్ని చెబుతాడు...

1985లో "ముదల్ మరియదై" పేరుతో విడుదలైన సినిమా, థియేటర్లలో 200 రోజులు ఏకధాటిగా అడింది. జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమానే అత్మ బంధువు పేరుతో తెలుగులోనూ విడుదలై సరి కొత్త రికార్డులు నెలకొల్పింది.

అందమైన పల్లేటూరు. "బావా.. మామా.." అంటూ పిలిచే అందమైన పల్లెటూరి జనాలు. ఇలాంటి మనుషుల మధ్య పుట్టే కథలు మనం చాలానే విని వుంటాం. ఇవన్నీ పల్లెటూళ్ళో సాధారణంగా జరిగే సంఘటనలే కదా అనిపిస్తుంది. కానీ, భారతీ రాజా మంత్రదండంతో తెరమీద చూసినప్పుడు మాత్రం అలా ఉండదు. మనల్నీ మరింత అందమైన పల్లెకు తీసుకువెళుతుంది. అందమైన మనుషుల మద్య మనం కూడా కాసేపు తిరుగుతాం. అంతలోనే విషాదాన్ని నింపి..గుండెను మెలిపెట్టి... అలా వదిలేస్తాడు.. భారతీ రాజా. అదే కదా రాజా ప్రత్యేకత. సినిమా చూసిన తరువాత కూడా ఆ కథ మనల్ని వెంటడినప్పుడే కాదా ఆ సినిమా గొప్పదనం.

ఆత్మ బంధువులో శివాజీ గణేశన్, రాధ, వడివుక్కరసి పోటీ పడి జీవించారు. సినిమా మొత్తానికి వడివుక్కరసు పాత్ర ప్రధానం. అత్యంత సహజ నటనలో ఇమిడిపోయింది. గ్లామర్ పాత్రలకు భిన్నంగా రాధ, యాభై ఏళ్ల వయసులో మోడువారిన జీవితంలో తొలిప్రేమ పరిమళాన్ని అనుభవించే శివాజీ గణేశన్... అన్నీ..అన్నీ... అన్నీ.. సూపర్. సహజంగానే ఇళయరాజా సంగీతం లేకుండా ఇంత గొప్ప సినిమాని ఊహించలేం కాదా...!

" మనిషికో స్నేహం..

 మనసుకో దాహం లేనిదే, 

జీవం లేదు, 

జీవితం కానేకాదు."

- శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్