జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

నిశ్శబ్ద రాత్రి

ప్రఖ్యాత రచయిత Dale Carnegie రాసిన

How to Stop Worrying and Start Living పుస్తకం నుంచి...

ఐదేళ్ల క్రితం, డిసెంబరు నెలలో నేను విచారంలో నిండా మునిగిపోయి, నామీద జాలిని పెంచుకున్నాను. ఎన్నో ఏళ్లు సంతోషంగా గడిపాక, నా భర్తని పోగొట్టుకున్నాను. క్రిస్మస్ సెలవలు దగ్గరపడేకొద్దీ నా దుఃఖం ఇనుమడించింది. నా జీవితంలో క్రిస్మస్ పండగని ఎప్పుడూ నేను ఒంటరిగా జరుపుకోలేదు. అందుకని ఈ సారి రాబోయే క్రిస్మస్ పండగ నన్ను భయపెట్టసాగింది. స్నేహితులు, తమతో కలిసి పండగ జరుపుకోమని పిలిచారు. కానీ నాకు హుషారుగా ఉండాలని అనిపించలేదు. ఏదైనా పార్టీకి వెళ్తే నేను అందరికీ నా ప్రవర్తనతో నిరుత్సాహాన్ని కలిగిస్తానని అనిపించింది. అందుకని, నేను వాళ్ల ఆహ్వానాన్ని తిరస్కరించాను. క్రిస్మస్ ముందురోజు వచ్చింది. నామీద నాకున్న జాలి విపరీతంగా పెరిగిపోసాగింది. నిజమే, చాలా వాటికి నేను కృతజ్ఞురాలై ఉండవలసింది. కృతజ్ఞత చూపించవలసిన ఎన్నో విషయాలు మనందరి జీవితాల్లోనూ ఉంటాయి. క్రిస్మస్ కి ముందు రోజు నేను మధ్యాన్నం మూడు గంటలకి ఆఫీసు వదిలిపెట్టి, ఫిఫ్త్ ఎవెన్యూ వరకూ నెమ్మదిగా నడిచాను. నా దిగుల్నీ, నామీద నాకున్న జాలిని వదిలించుకోవాలన్నది నా ప్రయత్నం. ఆ వీధంతా సంతోషంగానూ, ఉల్లాసంగానూ ఉన్న జనంతో నిండిపోయి ఉంది. ఆ దృశ్యాలు గడిచిపోయిన మంచిరోజుల్ని నాకు జ్ఞాపకం చేశాయి. ఖాళీగా ఉన్న నా అపార్ట్మెంట్ కి ఒంటరిగా వెళ్లటం అనే ఆలోచనని నేను భరించలేకపోయాను. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒక రకమైన నిస్పృహలో  కూరుకుపోయాను. కన్నీళ్లని ఆపుకోలేకపోయాను. ఎటు పోవాలో తోచకుండా గంటసేపు అటూ ఇటూ తిరిగాక, నేను ఒక బస్టాపు దగ్గరికి చేరుకున్నాను. నేనూ నా భర్తా ఎటువెళ్తుందో కూడా తెలీని బస్సు సరదాకి ఎక్కి ఆదెక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్లేవాళ్లమన్న సంగతి గుర్తొచ్చి, ఆ బస్ స్టాపులో ఆగిన మొదటి బస్సులోకి ఎక్కేశాను. హడ్సన్ నదిని దాటాక, బస్సు కొంత సేపు ముందుకి వెళ్లింది. ఇంతలో కండక్టర్, "ఆఖరి స్టాప్, మేడమ్!" అనటం వినబడింది. నేను బస్సు దిగాను. ఆ ప్రదేశం పేరుకూడా నాకు తెలీదు. ఆ చిన్న ఊరు. ప్రశాంతంగా, జనసంచారం అట్టే లేకుండా ఉంది. తరువాతి బస్సెక్కి మళ్లీ ఇంటికి తిరిగివెల్దామని అనుకుంటూ నేను జనం నివాసం ఉంటున్న ఒక వీధిలో నడవసాగాను. నేను ఒక చర్చి ముందునించి వెళ్తుంటే సైలెంట్ నైట్ (నిశ్శబ్ద రాత్రి) పాట వినబడింది. నేను లోపలికి వెళ్లాను. చర్చిలో ఒక్క ఆర్డన్ (వాయిద్యం) వాయించే మనిషి తప్ప, ఎవరూ లేరు, నన్ను ఎవరూ గమనించకుండా, ఒక మూలగా బెంచీమీద కూర్చున్నాను. ఎంతో అందంగా అలంకరించి ఉన్న క్రిస్మస్ ట్రీ మీద వేలాడుతున్న దీపాలూ, కొన్నివేల నక్షత్రాలు చంద్రకిరణాల మీద నృత్యం చేస్తున్నట్టుగా, ఆ అలంకరణలని మిరుమిట్లు గొలిపిస్తున్నాయి. నెమ్మదిగా సాగదీసినట్టుగా మోగే సంగీత స్వరాల వల్లా, నేను పొద్దుట్నించీ ఏమీ తినకపోవటం వల్లా, నాకు నిద్రమత్తు ఆవహించింది. నేను బాగా అలసిపోయి ఉండటం చేత, మనసంతా భారంగా ఉండటచేత, నేను నిద్రలోకి జారిపోయాను.

నిద్రలేచాక, నేనెక్కడున్నానో తెలీలేదు, హడిలిపోయాను. బహుశా క్రిస్మస్ ని చూడటానికి వచ్చారు లాగుంది. నా ఎదురుగా ఇద్దరు చిన్నపిల్లలు నిలబడి ఉన్నారు. వాళ్లల్లోని ఒక చిన్నపిల్ల నాకేసి చూపిస్తూ, "ఈమెని సాంటాక్లాజ్ (క్రిస్మస్ బహుమతులను పిల్లలకిచ్చే వ్యక్తి) ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడా!" అంటోంది. నేను నిద్రలేవటం చూసి ఆ పిల్లలిద్దరూ కూడా గాభరాపడ్డారు. నేనువాళ్లని ఏమీ చెయ్యననీ, భయపడవద్దని చెప్పాను. వాళ్లు బీదగా కనిపించారు. మీ అమ్మా నాన్నా ఎక్కడున్నారని వాళ్లని అడిగాను. 'మాకు అమ్మా నాన్న లేరు? అన్నారు వాళ్లు. నా ఎదురుగా ఉన్న ఆ ఇద్దరు చిన్నపిల్లలూ అనాథలు. నేను ఎన్నడూ లేనంత దీనావస్థలో ఉన్నారు. వాళ్లని చూశాక, ఇన్నాళ్లుగా బాధపడుతున్నందుకూ, నా మీద నేను జాలిపడుతున్నందుకు, చాలా సిగ్గేసింది. వాళ్లకి క్రిస్మస్ ట్రీ చూపించి, ఒక దుకాణానికి తీసుకెళ్లాను. మేం ముగ్గురం అల్పాహారం చేశాక, వాళ్లకి చాక్లెట్లూ, చిన్నచిన్న కానుకలూ కొని ఇచ్చాను. ఏదో మంత్రం వేసినట్లుగా నా ఒంటరితనం మాయమయింది. కొన్ని నెలల తరవాతు ఈ ఇద్దరు ఆనాధ పిల్లలూ నాకు నిజమైన సంతోషాన్ని అందించి, నన్ను నేను మరిచిపోయేట్టు చేశారు. వాళ్లతో కబుర్లు చెపుతూంటే, నేనెంత అదృష్టవంతురాలినా తెలిసింది. నా చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమతో నిండిన నా క్రిస్మస్ పండగలన్నీ ఎంతో ఆనందంగా గడిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాను. నేను వాళ్ల కోసం చేసిన దాని కన్నా ఆ చిన్నారి అనాథలు నాకోసం ఎంతో ఎక్కువగా చేశారు. మనకి సంతోషం దొరకాలంటే ఇతరుల్ని సంతోషపెట్టాల్సిన అవసరం ఎంత ఉందో అనే విషయాన్ని, ఆ అనుభవం నాకు మళ్లీ చూపించింది. సంతోషం అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుందని తెలుసుకున్నాను. ఇంకొకరికి ఇవ్వటం ద్వారా మనం పొందుతాం. ఇంకొకరికి సాయంచేసి, ప్రేమని పంచి, నేను దిగులునీ, దుఃఖాన్ని, నాపై నాకున్న జాలిని జయించాను. నా కొత్త జీవితం మొదలైనట్లు నాకు అనిపించింది. అవును, నేనొక కొత్తమనిషిగా మారాను, అప్పుడే కాదు, ఆ తరవాత కూడా, నా జీవితమంతా అలాగే ఉన్నాను.

---------------------------------


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్