జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగులో 47 ఖాళీలు..?

రాష్ట్రవ్యాప్తంగా 16 యూనివర్సిటీల్లో 2635 టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరికి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే, 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల్లో సబ్జెక్టుల వారీగా ఏ విభాగానికి ఎన్ని పోస్టులు ఉండవచ్చనే అంచనాలతో అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.


2017లో విడుదలై, వివిధ కారణాలతో రద్దయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ లో తెలుగు విభాగంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కలిపి సుమారు 40 వరకు ఉండగా, ఈ సంఖ్య కాస్త పెరిగి తాజా నోటిఫికేషన్ లో 47కు చేరుకునే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. బోధనా రంగంలో అత్యున్నత ఉద్యోగాలుగా భావించే అసిస్టెంట్ ప్రొఫెసర్  ఉద్యోగాలు ఈ స్థాయిలో భర్తీ కానుండటం నిజంగా ఎంతో గొప్ప విషయం. ఇప్పటికే తెలుగు సాహిత్యంలో పీ.హెచ్.డి సాధించిన అభ్యర్థులకు రానున్న  నోటిఫికేషన్ ఓ వరంగా మారనుంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో తెలుగు మరియు ప్రాచ్య భాషా విభాగాల్లో సుమారు 47 తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులో విడుదలయ్యే నోటిఫికేషన్లో పూర్తి స్పష్టత వస్తుంది.

-----------------------------------------------

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్