జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

అసిస్టెంట్ ప్రొఫెసర్.. తెలుగులో పోటీ, పరీక్షా విధానం

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 16 యూనివర్సిటీల్లో 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల్లో తెలుగు విభాగంలో సుమారు 40 వరకు ఉండవచ్చనే అంచనాతో అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదివరకే 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, వివిధ కారణాలతో ఆ నోటిఫికేషన్ రద్దయిన విషయం తెలిసిందే. అప్పటి ఖాళీలతోనే కాస్త అటూ, ఇటుగా స్వల్ప మార్పులతో, నూతన విధివిధానాలతో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు.


తెలుగు విభాగంలో పోటీ...

తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ పొందిన అభ్యర్థులు, పీజీ తోపాటు జేఆర్ఎఫ్, నెట్, సెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఇప్పటికే రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నారన్న విషయం తెలిసిందే. వీరిలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, జూనియర్ లెక్చరర్లగా, వివిధ రకాల ఉద్యోగాల్లో స్థిరపడినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాల కోసం మరలా పోటీ పడతారన్న విషయం అంగీకరించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో 2016లో డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నోటిఫికేషన్లోని 22 తెలుగు డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాల కోసం సమారు 3260 దరఖాస్తులు ఏపీపీఎస్సీకి చేరినట్లు సమాచారం. వీరందరూ నెట్, సెట్ ఆర్హత ఉన్నవారే. గడిచిన ఆరేళ్ల నుంచీ ఇప్పటి వరకూ మరి కొంతమంది అభ్యర్థులు నెట్, సెట్, పీహెచ్.డీ వంటి అర్హతలు సాధించి ఉండవచ్చు. ఈ అంచనా ప్రకారం తాజాగా విడుదలయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు ఉద్యోగాల కోసం వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కాదనలేం. అయితే, దరఖాస్తులను చూసి నిరుత్సాహపడాల్సిన పనిలేదు. ఆత్మవిశ్వాసంతో చదివే అభ్యర్థులే గెలుపు బావుటా ఎగరవేస్తారనేది నిత్య సత్యం.


స్క్రీనింగ్ పరీక్ష విధానం...

2018 నాటి అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లో స్క్రీనింగ్ టెస్ట్ విధానాన్ని పరిశీలిస్తే, రానున్న నోటిఫికేషన్ గురించి అభ్యర్ధులు ఓ అంచనాకు రావచ్చు. గతంలో(2018) జరిగిన పరీక్షా విధానాన్నే ఇప్పుడూ పాటిస్తారా ? లేక ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా ? అన్నది పూర్తి నోటిఫికేషన్ వస్తే కానీ తెలిసే అవకాశం లేదు. కానీ, 2018లో జరిగిన స్క్రీనింగ్ పరీక్ష విధానాన్ని తెలుసుకుంటే ఎంతో మేలు. అప్పటి స్క్రీనింగ్ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. నెట్ తరహాలోనే పేపర్ -1(టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్), పేపర్ -2(తెలుగు సాహిత్యం) రెండు పరీక్షలు ఓకే రోజు జరిగాయి. పేపర్- 1(120 మార్కులు,120 బిట్స్) , పేపర్ -2 (180 మార్కుల,180 బిట్స్) కలిపి 300 మర్కులకు పరీక్ష జరిగింది. నెగిటివ్ విధానంలో ప్రతి తప్పుకు1/3 మార్కుల తీసివేత ఉండడంతో అప్పటి పరీక్ష చాలా కష్టంగా ఉందనే అభిప్రాయం వెలువడింది. దీనికి తోడు తెలుగు అభ్యర్ధులు కూడా పేపర్-1 ఇంగ్లీష్ లోనే రాయాల్సి రావడంతో పరీక్ష కష్టంగా ఉందని భావించారు. అయితే, త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లో గతంలో మాదిరిగానే స్క్రీనింగ్ టెస్ట్ విధానాన్ని అనుసరిస్తారా ? ఏమైనా మార్పులు ఉంటాయా ? అనేది వేచి చూడాలి. పేపర్ -1 తెలుగులో కూడా ఇస్తే  అభ్యర్థులకు ఏంతో మేలు. ఏది ఏమైనప్పటికీ కొత్తగా వచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లో పరీక్షా విధానం పట్ల పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అభ్యర్ధులు వేచి చూసే ధోరణి కాకుండా తమ ప్రిపరేషన్ నిరంతరం కొనసాగించడం మేలు.

--------------------------------------------

కామెంట్‌లు

  1. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల కోసం మంచి సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు.,....

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్