జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3295 అధ్యాపకుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి చెప్పారు. 3295 ఉద్యోగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయని అన్నారు. తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ NTv కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2009లో చివరిసారిగా యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తీ జరిగిందని, అప్పటి నుంచి వివిధ కారణాలతో యూనివర్సిటీ అధ్యాపకుల భర్తీ జరగలేదని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నతమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతిశ్చయంతో ఉందని, అందుకే న్యాయపరమైన చిక్కులన్నిటిని దాటుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలో అధ్యాపకుల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. భర్తీ ప్రక్రియ మొత్తం డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, వారం రోజుల్లో అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
పూర్తి ఇంటర్వ్యూ NTvలో చూడవచ్చు :
https://youtu.be/AhjH-Z6cN_A?si=Kp2zePY6MHhQ6Zxt
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి