పోస్ట్‌లు

నవంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

స్క్రీనింగ్ పరీక్ష తరువాత..

చిత్రం
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకానికి డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో తాత్కాలిక పరీక్షల తేదీలను పొందుపరుస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. డిసెంబర్ 18 నుంచి సుమారు 20 రోజులపాటు వివిధ సబ్జెక్టులలో స్క్రీనింగ్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న చర్చను పక్కన పెడితే, స్క్రీనింగ్ పరీక్షలు ముగిసిన తరువాత ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాల్సిన విషయం. 2018లో.. 2018లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలను ఒకసారి పరిశీలిస్తే.. 2018 జనువరి చివరి వారంలో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించింది. తదనంతరం రెస్పాన్స్ షీట్స్ తో పాటు ప్రాథమిక కీ విడుదల చేసారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది కీ విడుదల చేసి, ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ఫలితాల జాబితాలో సబ్జెక్టుల వారిగా ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాశ...

పీహెచ్.డీ. అడ్మిషన్ నోటిఫికేషన్

చిత్రం
  సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2023 - 24 విద్యాసంవత్సరానికి పీహెచ్.డీ. అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 6 విభాగాలలో మొత్తం 33 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ విద్యార్థుల కోసం 21, ఇన్ సర్వీసు అభ్యర్థుల కోసం 12 సీట్లు కేటాయించారు. తెలుగు విభాగంలో రెగ్యులర్ విద్యార్థులకు 1 , ఇన్ సర్వీస్ అభ్యర్థుల కోసం 1 సీటు అందుబాటులో ఉంది.  ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 22 చివరి తేదీ.

డిసెంబర్ లో డి.ఎల్. నోటిఫికేషన్ ?

చిత్రం
  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని లెక్చరర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుమతులు లభించినప్పటికీ కొన్ని కారణాలవల్ల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆలస్యమైనట్లు సమాచారం. గతంలో విడుదలైన మూడు నోటిఫికేషన్లనూ పరిశీలిస్తే.. మూడు నోటిఫికేషన్లు డిసెంబర్ చివరి వారంలోనే విడుదల కావడం విశేషం. 2011 డి.ఎల్. నోటిఫికేషన్ డిసెంబర్ 29న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో 27 తెలుగు లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. 2016 నోటిఫికేషన్ డిసెంబర్ 27న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 తెలుగు లెక్చరర్ పోస్టులు భర్తీ జరిగాయి. అలాగే, 2018 డి.ఎల్ నోటిఫికేషన్ కూడా డిసెంబర్ 31న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం 5 తెలుగు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. యాదృచ్ఛికమైనప్పటికీ గత మూడు నోటిఫికేషన్లు డిసెంబర్ చివరి వారంలో విడుదలవడం గమనించవచ్చు. 2023 డి.ఎల్ నోటిఫికేషన్ నవంబర్లో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదని సమాచారం. గడిచిన నోటిఫికేషన్ల బాటలోనే 2023 డీఎల్ నోటిఫికేషన్ కూడా డిసెంబర్ చివరి వారాల్లో విడుదలైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 నోటిఫ...

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

చిత్రం
  రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలను డిసెంబర్ 18 నుంచి 23 వరకు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. డిసెంబర్ 18 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో నోట్ పొందుపరిచారు.. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ కోసం... https://psc.ap.gov.in/(S(vvtzfph5mzcxrqtzpi1xcgps))/Default.aspx

2012 డి.ఎల్. తెలుగు ప్రశ్నాపత్రం

చిత్రం
ప్ర భుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి 2011 డిసెంబర్ లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ (43/2011) జారీ చేసింది. తెలుగు విభాగంలోని 27 ఖాళీలకు  2012లో జరిగిన పరీక్షా పత్రం...

స్క్రీనింగ్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు..?

చిత్రం
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకే, విశ్వవిద్యాలయాల్లో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్డంకులన్నీ దాటుకుని విజయవంతంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యాశాఖలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలకు ప్రస్తుత ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపించిన విషయం తెలిసిందే. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఉన్నత పాఠశాలల్లో అప్ గ్రేడ్ వంటి సమస్యలను పరిష్కరించింది. ఇదే కోవలోనే విశ్వవిద్యాలయాలలో ఎన్నో ఏళ్ళుగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నెల 27తో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఇక, స్క్రీనింగ్ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు అనేదే అభ్యర్థుల ముందు ఉన్న పెద్ద ప్రశ్న ? గత నోటిఫికేషన్ (2018) పరిశీలిస్తే స్క్రీనింగ్ పరీక్ష గురించి ఓ అవగాహనకు రావచ్చు. 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు, 2017 డిసెంబర్ చివరి వారం నుంచి 2018 జనవరి మొదటి...

తెలుగు ప్రశ్నాపత్రం, డి.ఎల్., 2018

చిత్రం
  ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి 2018 డిసెంబర్ లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో, తెలుగు విభాగంలోని 5 ఖాళీల కు జరిగిన పరీక్షా పత్రం...

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

చిత్రం
2018 జనువరిలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టింది. 2018 ఏప్రిల్ లో తెలుగు సబ్జెక్టులో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. అప్పటి అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు ప్రశ్నాపత్రం ఇప్పటి అభ్యర్ధుల కోసం...

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

చిత్రం
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20 చివరి తేదీ. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుత నోటిఫికేషన్లో అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే దరఖాస్తు, ఒకే ఫీజు ఉండడం మంచి విషయం. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులందరూ వివిధ యూనివర్సిటీల నోటిఫికేషన్లను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. అవసరమైన సర్టిఫికెట్లు, పరిశోధన పత్రాలు, పాస్పోర్ట్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం దగ్గర పెట్టుకొని దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవ్వాలి. ఉన్నత విద్యాశాఖ అధికారికి వెబ్సైట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు స్టెప్ 1, స్టెప్ 2 విధానాన్ని పొందుపరిచారు. స్టెప్ 1 : ముందుగా స్టెప్ 1 లో అభ్యర్థుల ప్రాథమిక వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. ఇందులో మూడు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది, ఇందులో పేరు, పుట్టిన తేదీ, కేటగిరి, ఆధార్ నెంబర్తో పాటూ పాస్పోర్ట్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెండో భాగంలో శాశ్వత చిరునామా, మొబైల్ నంబర్, ఈ మైల్ ఐడి నమోదు చేయాలి. మూడో భాగంలో యూజర్ ఐడి, పాస్వర్డ్ నమోదుతో మన అకౌంట్ క్రియేట్ అయి స్టెప్ ...

తెలుగులో పోటీ ఎలా ఉండవచ్చు..?

చిత్రం
వివిధ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి భర్తీకి నోచుకోని సహాయ ఆచార్యుల ఖాళీలను ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తీ చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలుగు విభాగంలో 23 ఖాళీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితో  పాటు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయంలో 16 తెలుగు లెక్చరర్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. రెండు కలిపి 39 ఖాళీల భర్తీ కోసం విడివిడిగా ప్రకటనలు విడుదలయ్యాయి. సహాయ ఆచార్యులు/ డిగ్రీ లెక్చరర్లు/ లెక్చరర్ల వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలలో 39 ఖాళీలు ఉండడం పెద్ద సంఖ్యగానే చెప్పుకోవచ్చు. అయితే, ఈ 39 ఖాళీలకు ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారనేది ప్రశ్న. దీనికి సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ, గత నోటిఫికేషన్లను పరిశీలిస్తే ఒక అంచనాకు రావచ్చు. మొదటి అంచనా:  ఆంధ్రప్రదేశ్ లో 2016లో డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నోటిఫికేషన్లోని 22 తెలుగు డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాల కోసం సమారు 3260 దరఖాస్తులు ఏపీపీఎస్సీకి చేరినట్లు సమాచారం. వీరందర...

అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు రోస్టర్

చిత్రం
రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో 3220 టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు ( అసిస్టెంట్ ప్రొఫెసర్ ) విభాగంలో 23 ఖాళీలు ఉన్నట్లు వివిధ యూనివర్సిటీలు విడివిడిగా విడుదల చేసిన నోటిఫికేషన్లలో పొందుపరిచారు. అన్ని యూనివర్సిటిల్లో కలిపి తెలుగు విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం ఓపెన్ కేటగిరిలో 10 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ : 3, బిసి ఏ  : 1,  బిసి బి : 2,  బిసి డి  :1,  బిసి ఇ :1  ఎస్సి : 3,  ఎస్టీ : 2 కోసం కేటాయించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను వడపోసి 1 : 12 పద్దతిలో తదుపరి దశకు ఎంపిక చేయనున్నారు. యూనివర్సిటీల వారీగా రోస్టర్ పాయింట్లు : 1. ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం : 4 ఓసీ : 1 , ఈడబ్ల్యూఎస్ : 1, బిసి బి : 1, ఎస్టీ : 1,  2. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మొత్తం : 3 ఓసీ : 1 ,  ఈడబ్ల్యూఎస్ : 1,  బిసి బి : 1,  3. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొత్తం : 2 ఓసీ: 1 ,  ఎస్సి : 1 ,  4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మెత్తం : 2 ఓసీ: 1,  ఎస్సి : 1,  5. ఆదికవి నన్నయ యూనివర్సిటీ మొత్తం...