జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకే, విశ్వవిద్యాలయాల్లో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్డంకులన్నీ దాటుకుని విజయవంతంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యాశాఖలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలకు ప్రస్తుత ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపించిన విషయం తెలిసిందే. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఉన్నత పాఠశాలల్లో అప్ గ్రేడ్ వంటి సమస్యలను పరిష్కరించింది. ఇదే కోవలోనే విశ్వవిద్యాలయాలలో ఎన్నో ఏళ్ళుగా ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
గత నోటిఫికేషన్ తో ప్రస్తుత నోటిఫికేషన్ ను పోల్చితే దరఖాస్తు వ్యవధి నెలరోజుల కన్నా తక్కువే. అదేవిధంగా స్క్రీనింగ్ పరీక్ష కూడా ముందుగానే ఉండే అవకాశం ఉంది. అంటే ఈనెల 27న దరఖాస్తు ప్రక్రియ ముగిస్తే డిసెంబర్ చివరివారం లేదా జనవరి మొదటి వారంలో స్క్రీనింగ్ పరీక్ష ఉండే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఆ తరువాత ఫలితాల ప్రకటన, ఇంటర్వ్యూలకు చాలా సమయం అవసరం అవుతుంది. జనువరిలో సంక్రాంతి, తదనంతరం ఎన్నికల వాతావరణం వుంటుంది. రానున్న ఎన్నికలకు ముందే విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. కాబట్టి, జనవరి మొదటి వారం, అంతకు ముందే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశాన్ని కాదనలేం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి