జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకానికి డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో తాత్కాలిక పరీక్షల తేదీలను పొందుపరుస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. డిసెంబర్ 18 నుంచి సుమారు 20 రోజులపాటు వివిధ సబ్జెక్టులలో స్క్రీనింగ్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న చర్చను పక్కన పెడితే, స్క్రీనింగ్ పరీక్షలు ముగిసిన తరువాత ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాల్సిన విషయం.
2018లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షలను ఒకసారి పరిశీలిస్తే.. 2018 జనువరి చివరి వారంలో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించింది. తదనంతరం రెస్పాన్స్ షీట్స్ తో పాటు ప్రాథమిక కీ విడుదల చేసారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది కీ విడుదల చేసి, ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ఫలితాల జాబితాలో సబ్జెక్టుల వారిగా ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాశారు ( గైర్హాజరైన అభ్యర్థులతో సహా) రూల్ నెంబర్స్, రిజర్వేషన్స్, డేట్ అఫ్ బర్త్ వంటి వివరాలను కూడా మార్కుల జాబితాలో పొందుపరిచారు. తదనంతరం ఉన్నత న్యాయస్థానం ఆదేశంతో తదుపరి ప్రక్రియ మొత్తం ఆగిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుత విధానం..
ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలు విడివిడిగా విడుదల చేసిన నోటిఫికేషన్లోని 4 వ అంశం, ముఖ్యమైన సమాచారం ( ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్) లోని " ఎల్ " నుంచి " యస్ " వరకు స్క్రీనింగ్ పరీక్ష జరిగిన తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయాన్ని పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ పరీక్ష ముగిసిన తర్వాత రెస్పాన్స్ షీట్స్ తో పాటు ప్రాథమిక కీని విడుదల చేస్తారు. ప్రాథమిక కీలో ఉన్న అభ్యంతరాలను స్వీకరించి తుది కీ ని విడుదల చేసి, ర్యాంకుల వారిగా ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాల్లో కొందరు అభ్యర్థులకు సమానమైన మార్కులు వస్తే వయస్సు, అదనపు అర్హతల అధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. తదుపరి ప్రక్రియకు(1:12) ఎంపిక కావాలంటే అభ్యర్థులు కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలనేది ప్రాథమిక నియమం. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు 30%, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఓసి అభ్యర్థులు 40 శాతం మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
స్క్రీనింగ్ కం ఇవాల్యూషన్ కమిటీ ..
సబ్జెక్టుల వారీగా స్క్రీనింగ్ ఫలితాలను ప్రకటించడంతో ఏపీపీఎస్సీ బాధ్యత ముగుస్తుంది. తదుపరి ప్రక్రియ మొత్తం ఉన్నత విద్యాశాఖ, ఆయా విశ్వవిద్యాలయాలలోని " స్క్రీనింగ్ కం ఇవాల్యూషన్ కమిటీ ( ఎస్.ఈ.సి.) " పరిధిలోకి వెళ్ళిపోతుంది. ర్యాంకు ఆధారంగా అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా ఒక పోస్టుకు 12 మంది అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు ఎంపిక అవుతారు. ఉదాహరణకు ఓ సబ్జెక్టులో 23 ఖాళీలు ఉంటే సుమారు రెండువేల మంది పరీక్షకు హాజరయ్యారనుకుంటే అందులో స్క్రీనింగ్ పరీక్ష ముగిసిన తర్వాత సుమారు 276 మంది మాత్రమే తదుపరి దశకు ఎంపిక అవుతారు. దరఖాస్తుల ఆధారంగా, రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ మర్కులు మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక సబ్జెక్టులో పీహెచ్సీ రిజర్వేషన్ విభాగంలో రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయనుకుంటే, 10 మంది స్క్రీనింగ్ పరీక్ష కు హాజరైతే అందులో 30 శాతం మార్కులు పైన సాధించిన ప్రతి ఒక్కరూ తదుపరి దశకు వెళ్తారు. ఈ విధంగా 1:12 జాబితా సిద్ధమవడంతో రెండవ దశ ప్రక్రియ ముగుస్తుంది. ఆయా యూనివర్సిటీలోని " స్క్రీనింగ్ కం ఇవాల్యూషన్ కమిటీ " ఆధ్వర్యంలో " అకడమిక్ అండ్ రీసెర్చ్ స్కోర్ " ఆధారంగా తదుపరి జాబితా సిద్ధమవుతుంది. అయితే, 2018లో స్క్రీనింగ్ ఫలితాల ప్రకటనతో తదుపరి ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. కాబట్టి, తరువాత ఎలా ఉంటుంది అనే అనుభవ పూర్వకమైన పూర్తి అవగాహన ఎవరికి లేదు. ప్రతిదీ అంచనాతో ముందుకు వెళ్ళడమే.
1:12 yala thisukumtaru sir top scorer na ledha
రిప్లయితొలగించండిr) In case the number of applicants qualified exceeds the number of notified vacancies in a given category of post, the applicants shall then be shortlisted for further evaluation in the ratio of 12:1 twelve applicants for each category of reservation for the notified vacancies in the university on the basis of merit in the screening/written test.
రిప్లయితొలగించండి