జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
వివిధ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి భర్తీకి నోచుకోని సహాయ ఆచార్యుల ఖాళీలను ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తీ చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలుగు విభాగంలో 23 ఖాళీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితో పాటు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయంలో 16 తెలుగు లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రెండు కలిపి 39 ఖాళీల భర్తీ కోసం విడివిడిగా ప్రకటనలు విడుదలయ్యాయి. సహాయ ఆచార్యులు/ డిగ్రీ లెక్చరర్లు/ లెక్చరర్ల వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలలో 39 ఖాళీలు ఉండడం పెద్ద సంఖ్యగానే చెప్పుకోవచ్చు. అయితే, ఈ 39 ఖాళీలకు ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారనేది ప్రశ్న. దీనికి సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ, గత నోటిఫికేషన్లను పరిశీలిస్తే ఒక అంచనాకు రావచ్చు.
మొదటి అంచనా:
ఆంధ్రప్రదేశ్ లో 2016లో డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నోటిఫికేషన్లోని 22 తెలుగు డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాల కోసం సమారు 3260 దరఖాస్తులు ఏపీపీఎస్సీకి చేరినట్లు సమాచారం. వీరందరూ నెట్, సెట్ ఆర్హత ఉన్నవారే.
రెండో అంచనా :
2018 డిసెంబర్ / జనువరి లో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సహాయ ఆచార్యుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ కారణాలతో ఈ నోటిఫికేషన్ రద్దయిన సంగతి తెలిసింది. అప్పట్లో స్క్రీనింగ్ పరీక్ష బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించారు. పరీక్ష నిర్వహించిన ఏపీపీఎస్సీ మార్కుల జాబితాను విడుదల చేసింది. ఈ మార్కుల జాబితాను పరిశీలిస్తే తెలుగు విభాగంలో సమారు 1450 మంది పరీక్షకు హాజరైనట్లు తెలుస్తుంది. అంటే, 2018 నోటిఫికేషన్ లో సుమారు 30 ఖాళీలకు తెలుగు విభాగంలో 1450 మంది దరఖాస్తు చేసుకున్నారని అర్థమవుతుంది.
పై రెండు అంచనాలను పరిశీలిస్తే, రెండు పరీక్షలు జరిగి ఆరు సంవత్సరాలు దాటిపోయాయి. ఈ మధ్యకాలంలో ఎంతోమంది కొత్త అభ్యర్థులు పి. హెచ్. డి. పూర్తిచేశారు. కొత్తగా జేఆర్ఎఫ్/ నెట్ /సెట్ అర్హత సాధించారు. ఈ అంచనాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత నోటిఫికేషన్లోని 23 సహాయ ఆచార్యులు, 16 లెక్చరర్ల ఉద్యోగాల కోసం సుమారు రెండు వేల నుంచి మూడు వేల మధ్య దరఖాస్తులు అందే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి