జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని లెక్చరర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుమతులు లభించినప్పటికీ కొన్ని కారణాలవల్ల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆలస్యమైనట్లు సమాచారం. గతంలో విడుదలైన మూడు నోటిఫికేషన్లనూ పరిశీలిస్తే.. మూడు నోటిఫికేషన్లు డిసెంబర్ చివరి వారంలోనే విడుదల కావడం విశేషం. 2011 డి.ఎల్. నోటిఫికేషన్ డిసెంబర్ 29న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో 27 తెలుగు లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. 2016 నోటిఫికేషన్ డిసెంబర్ 27న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 తెలుగు లెక్చరర్ పోస్టులు భర్తీ జరిగాయి. అలాగే, 2018 డి.ఎల్ నోటిఫికేషన్ కూడా డిసెంబర్ 31న విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం 5 తెలుగు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. యాదృచ్ఛికమైనప్పటికీ గత మూడు నోటిఫికేషన్లు డిసెంబర్ చివరి వారంలో విడుదలవడం గమనించవచ్చు. 2023 డి.ఎల్ నోటిఫికేషన్ నవంబర్లో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదని సమాచారం. గడిచిన నోటిఫికేషన్ల బాటలోనే 2023 డీఎల్ నోటిఫికేషన్ కూడా డిసెంబర్ చివరి వారాల్లో విడుదలైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 నోటిఫికేషన్లో కేవలం 5 తెలుగు పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. 1 బ్యాక్ లాగ్ పోస్ట్ కాగా, 4 రెగ్యులర్ పోస్టులు. కాబట్టి, రానున్న నోటిఫికేషన్ లో తెలుగు పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి