జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
నలభైనాలుగేళ్ల క్రితం తెలుగులో విడుదలైన సినిమా మల్లెపువ్వు. 'వెల లేని మల్లెకు, వెలకు నలిగే మల్లెకు ఎంత తేడా ఉంటుందో ' మల్లెపువ్వు సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఇంత గొప్ప సినిమా కథ నిజానికి హిందీలో పుట్టింది. 1957లో దర్శకుడిగా, నిర్మాతగా, గురుదత్ స్వయంగా హీరోగా నటించి " ప్యాసా " అనే పేరుతో ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. విఫల ప్రేమికుడైన ఓ నిరుపేద వర్ధమాన కవి కథే ప్యాసా ఇతివృత్తం. ఈ సినిమా ఓ అద్భుత కళాఖండం. అయినప్పటికీ, హిందీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది. కానీ, తెలుగు ప్రేక్షకుల అదృష్టం కొద్దీ ఆ తరవాత ఇరవై ఒక్క ఏళ్ళకి 1978లో మల్లెపువ్వు పేరుతో ప్యాసా సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. శోభన్ బాబు కోసమే ఈ కథ పుట్టినట్టు తెలుగులో తప్పక చూడదగ్గ సినిమాల జాబితాలో మల్లెపువ్వు చేరిపోయింది.
మల్లెపువ్వు చిత్రంలో హీరో పేరు వేణు. తన కోసమే ఈ పాత్ర సృష్టించబడినట్టు ఎంతో సహజంగా శోభన్ బాబు హీరోగా గొప్పగా నటించాడు. కాలేజీ చదివేప్పుడే వేణు భావకవి. క్లాస్మేట్ లలిత (జయసుధ)తో ప్రేమలో పడి చివరికి విఫల ప్రేమికుడవుతాడు. కాలేజీ తరువాత నిరుద్యోగం, పేదరికం, కుటుంబ సభ్యుల చిన్నచూపుతో రోడ్డున పడతాడు. వేణు రాసుకున్న కవితలన్నీ మల్లిక (లక్ష్మి) అనే వేశ్యకు దొరుకుతాయి. ఇంతలో మాజీ ప్రేమికురాలు పెళ్లి చేసుకుని కనిపిస్తుంది.... ఏమీ చేయలేని నిస్సహాయతతో నలిగి పోయే హీరో క్యారెక్టర్ లో శోభన్ బాబు అధ్భుతంగా నటించాడు. ఈ సినిమా మొత్తంలో శోభన్ బాబు నవ్వుతున్నట్టు మనకు ఎక్కడా కనిపించడు. ఆదర్శ భావాల మధ్య నిరాశ, నిస్పృహతో నలిగి పోయే హీరో క్యారెక్టర్. డెబ్భైల నాటి వేశ్యావాటికలు, అప్పటి పేదరికం, నిరుద్యోగం, నాటి నిరుపేద కవుల జీవితం ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమా మొత్తానికి సంగీత, సాహిత్య మాయజాలాలు మన మనసులను కరిగించి వేస్తాయి. ఈ సినిమా కోసం చక్రవర్తి అందించిన బాణీలు తెలుగు సంగీత సామ్రాజ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయాయి. ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి సాహిత్యం తనివి తీరనిది. వీటన్నిటికీ ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు వి.మధుసూదనరావు మల్లెపువ్వు సినిమాని తెరకెక్కించాడు. మంచి సినిమాని ఇష్టపడేవారు, సాహిత్యాన్ని ప్రేమించేవారు మిస్ కాకూడని సినిమా మల్లెపువ్వు.
ఎవరికి తెలుసు...
చితికిన మనసు...
చితిగా రగులునని...
ఆ చితి మంటల చిటపటలే...
నాలో రగిలే కవితలని...
- శిఖా సునీల్
Congratulations brother excellent
రిప్లయితొలగించండిసునీల్...మల్లెపువ్వు నాకు బాగా ఇష్టమైన సినిమా.. నేను 9వ తరగతిలో ఉండగా వచ్చింది. నాకు తెగ నచ్చేసింది. అప్పట్లో అందులో పాటల్ని కంటస్తం చేశాను. వేణు క్యారెక్టర్ లో నన్ను నేను చూసుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను చిన్నా చితకా కవితలు కెలికేవాడిని. ఆ తర్వాత నేనూ ప్రేమలో పడటం నా ప్రియురాలు ఆ తర్వాత వేరే వారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం,, నేను భగ్న ప్రేమికుడిగా మిగిలిపోవడం నా జీవితంలోనూ జరిగాయి కాబట్టి.
రిప్లయితొలగించండిఎవరికి తెలుసు...
చితికిన మనసు...
చితిగా రగులునని...
ఆ చితి మంటల చిటపటలే..
నాలో రగిలే కవితలని...
ఈ పాట నాకు బాగా ఇష్టం.
అవును సార్.. మల్లెపువ్వు పాటలు విన్న ప్రతిసారీ పరిపూర్ణమైన సాహిత్యాన్ని తాగిన మైకంతో నా మనసు కూడా తూలిపోతుంది.
రిప్లయితొలగించండి👍👌
రిప్లయితొలగించండి