పోస్ట్‌లు

నవంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

"సత్య హరిశ్చంద్రీయము" @ వందేళ్లు

చిత్రం
  ఆంధ్రదేశంలో పుట్టిన హరిశ్చంద్ర చక్రవర్తికి వందేళ్లు దాటిపోయాయి. ఆధునిక తెలుగు సాహిత్య దశ ప్రారంభమైన తరువాత 1889లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొట్టమొదటి సారిగా హరిశ్చంద్ర నాటకాన్ని రచించి తెలుగు ప్రజలకు అందించారు. వీరేశలింగం పంతులు గారి తరువాత, సుప్రసిద్ధ తెలుగు కవుల చేతిలో సుమారు 28 సార్లు వారి వారి కవితాశైలిలో హరిశ్చంద్ర నాటకం రూపుదిద్దుకుంది.ఎన్నిసార్లు, ఎందరి కవుల కలాల నుంచి హరిశ్చంద్ర చక్రవర్తి తెలుగు పద్యనాటక రూపంలో పుట్టినప్పటికీ, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన "సత్య హరిశ్చంద్ర" పద్యనాటకం మాత్రం తెలుగు ప్రజల హృదయాలు గెలిచి శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. 1912లో "సత్య హరిశ్చంద్రీయము" అనే పేరుతో బలిజేపల్లి లక్ష్మికాంతం కవి పౌరాణిక పద్య నాటకాన్ని తనదైన శైలిలో రచించాడు.ఈ నాటకం ప్రజల్లోకి వెల్లిన తరువాత అంతకు ముందు, ఆ తరువాత రచింపబడిన హరిశ్చంద్ర నాటకాలన్నీ కనుమరుగై పోయాయి. బలిజేపల్లి లక్ష్మీకాంతం రచించిన "సత్య హరిశ్చంద్ర" నాటకానికి తెలుగునాట అత్యంత ప్రజాదరణ లభించింది. దశాబ్దాలుగా ఆంధ్రదేశంలో వాడవాడలా ప్రదర్శించబడి ప్రజల నీరాజనాలు అందుకుంటూనే...

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

చిత్రం
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వి.పద్మ తెలుగు సాహిత్యంలో యూజీసీ నెట్, ఏపీసెట్ రెండింటిలో అర్హత సాధించారు. ఉద్యోగం, చదువు రెంటినీ సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించారు. నెట్ పరీక్ష కోసం సిద్ధపడుతున్న విద్యార్థుల కోసం, వి.పద్మ తాను ఎలా ప్రిపేర్ అయ్యి నెట్ పరీక్షలో అర్హత సాధించారో చెప్పారు. నెట్ రాసే అభ్యర్థలు ఎలాంటి మెలకువలు పాటించాలి అనే విషయం ఆమె మాటల్లోనే....   తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు నెట్ అర్హత సాధించటం ఎంతో అవసరం. పీజీ తరువాత పరిశోధనల వైపు వెళ్లాలన్నా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కావాలన్నా, యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా నియామకం పొందాలన్నా నెట్ లేదా ఏపిసెట్ అర్హత ఉండాలి. ఇదే కాకుండా పీజీ అర్హతతో ప్రైవేటు కళాశాలల్లో ఉద్యోగాలను చేయాలనుకునే వారు తమ రెజ్యూమ్ లో నెట్ అర్హత ప్రధానంగా చూపించుకోవచ్చు. నెట్ అర్హత సాధిస్తే సబ్జెక్టు మీద మంచి పట్టు ఉన్నట్లు భావిస్తారు. తెలుగు సాహిత్యంలో వందల మంది అభ్యర్థులు నెట్ పరీక్ష రాస్తున్నప్పటికీ కేవలం ఆరు శాతం మంది మాత్రమే అర్హత సాధిస్తారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో...

షెర్ని ( మూవీ రివ్యూ )

చిత్రం
మనుషుల్ని చంపే పులి అంటే అందరికీ భయం. అలాంటి సినిమాలంటే ఉత్కంఠ, సస్పెన్స్, థ్రిల్లర్ ఉంటుంది. ఏ మూల నుంచి పులి గాండ్రింపు వినిపిస్తుందా, ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందా.. అని సినిమా హాల్లో కుర్చీ చివరి అంచు మీద కూర్చుని మరీ చూస్తాం. అలాంటి సినిమాలకు భిన్నంగా.. షెర్ని సినిమాలో మ్యాన్ ఈటర్ మీద మనకు ప్రేమ కలుగుతుంది. సినిమా చివరికి మనుషుల్ని చంపే ఆ ఆడపులి మీద జాలి కలుగుతుంది. సినిమా చూసిన తర్వాత , ఎందుకు ఇలా జరుగుతుందా అని కొద్దిసేపైనా ఆలోచన కలుగుతుంది. దర్శకుడు అమిత్ వి. మసూర్కర్ అద్భుతంగా తెరకెక్కించి, ఇటీవల విడుదలైన హిందీ సినిమా షెర్ని. అడవికి, మనిషికి మధ్య ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. జనావాసాలు పెరిగేకొద్ది ఈ ఘర్షణ పెరుగుతూనే ఉంటుంది. మనిషికి , మృగానికీ మధ్య సమతుల్యత  దెబ్బతిననంతకాలం అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ,  దురదృష్టవశాత్తు మనిషి ఆలోచన ఈ సమతుల్యతను దెబ్బతీస్తే... అడవుల్లో ఉండాల్సిన ప్రాణుల్ని మనం జంతు ప్రదర్శనశాలల్లోనూ, మ్యూజియంలోనూ చూడాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితమైన కోణాన్ని దర్శకుడు అమిత్ వి. మసూర్కర్ షెర్ని సినిమాగా అద్భుతంగా తెరెక్కించారు.  ఒక పెద్ద అ...

నేను చూసిన హార్సిలీ హిల్స్‌

చిత్రం
ఈ వేసవికి ఎక్కడికైనా హిల్ స్టేషన్ కి వెళ్లాలనే ఆలోచన వచ్చిన మరుక్షణమే మా కళ్ళ ముందు హార్సిలీ హిల్స్‌ కనబడింది. చర్చలూ, వాదోపవాదాలు లేకుండా అక్కడికే వెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చాం. సముద్ర మట్టానికి 4312 మీటర్ల ఎత్తున ఉన్న " ఆంధ్రా ఊటీ " హార్సిలీ హిల్స్‌ గురించి అంతకుముందు వినడం, చదవటమే కానీ వెళ్లడం అనేది అదే మొదటిసారి. అది మే మాసం. మండు వేసవి నడి మధ్యకు చేరింది.ఎండ తాపం పెరిగింది. ఇక ఓపిక నశించింది. హార్సిలీ హిల్స్‌  ప్రయాణం తప్పలేదు. గుంటూరు నుంచి తిరుపతి రైలు ప్రయాణం నిద్రలోనే గడిచిపోయింది. తెలతెల వారుతుండగా తిరుపతి రైల్వే స్టేషనులో దిగాం. ఫ్రెష్ అయ్యి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ లో బాగా పొంగిన పూరీలు లాగించి మదనపల్లె వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నాం. చిత్తూరు జిల్లాలో బస్ జర్ని చేయడం అదే మొదటిసారి. కిటికీ పక్కన కూర్చొని ప్రకృతిని చూస్తూ బస్సు ప్రయాణం చేయడమంటే నాకెందుకో చాలా చాలా ఇష్టం. అలా వేగంగా కదిలే బస్సుతో పాటూ నా ఆలోచనలూ అతి వేగంగా దూసుకుపోతూ ఉంటాయి. కిటికీ పక్కన కూర్చుని క్షణ కాలంలో కనుమరుగైపోయే ప్రకృతి అందాలను ఎక్కడా మిస్ కాకుండా క్షణం...

అయ్యప్పనుమ్ కోషియుం(మూవీ రివ్యూ)

చిత్రం
  "అయ్యప్పనుమ్ కోషియుం" సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలిసి అర్జెంట్ గా ప్రైమ్ మూవీస్ లో చూసేసా.ఒక హిట్ సినిమాని రీమేక్ వెర్షన్ లో కాకుండా మొదటిసారిగా దాని ఒరిజినల్లోనే చూడాలనేది నా అభిప్రాయం.అందుకే మలయాళ వెర్షనలో తెలుగు సబ్ టైటిల్స్ తో చూశా.అప్పుడెప్పుడో మణిరత్నం డైరెక్షన్లో దళపతి సినిమాలో మమ్ముట్టి, రజినీకాంత్ యాక్షన్ సీన్లు గుర్తొచ్చాయి.హీరోయిజం, పౌరుషం అంటే ఇదే కదా అనిపించింది.ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగే మళ్ళీ అయ్యప్పనుమ్ కోషియుం సినిమా చూసినప్పుడు కలిగింది. ఇది మొత్తం మూడు గంటల యాక్షన్ డ్రామా.కానీ, చూస్తున్నంత సేపూఎక్కడా బ్రేక్ తీసుకోవాలనిపించలేదు. ఏకబిగిన కదలకుండా ఈ సినిమా మొత్తం సింగిల్ సిట్టింగ్లో చుసేసా. కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, యాక్షన్ ఒకటేమిటి సినిమా మొత్తం సూపర్గా అనిపించింది. ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్లు లేకుండా, హీరో ఎంట్రన్స్ లు, ఫ్లాష్ బ్యాక్లు లేకుండా 'షో' ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే కథలోకి ఇన్వాల్వ్ అవ్వడం అరుదుగా కొన్ని సినిమాల్లోనే ఉంటుంది. 'అయ్యప్పనుమ్ కోషియుం' ప్రత్యేకత కూడా అదే. సినిమా ప్రారంభమైన మొదటి ...

జ్ఞాపకం..

చిత్రం
గుర్రం జాషువా జీవిత పుస్తకంలో ఈ ఫొటో ఓ జ్ఞాపకం. వినుకొండలో ఊరి చివరన ఉన్న రాజుల కాలం నాటి కట్టడం ఇది. అప్పట్లో ఇక్కడ నుంచి కనిపించే ప్రకృతి, జాషువా కావ్యాలకు వస్తువైంది. ఈ రాజుల కాలం నాటి కట్టడం గురించిన ప్రస్తావన, జాషువా కుమార్తె రచించిన "మా నాన్న గారు" పుస్తకంలోనూ ఉంది. - శిఖా సునీల్

ఇక్కడ అస్పృశ్యతకు తావేలేదు..

చిత్రం
ఊహాజనిత ప్రపంచం నుంచి పుట్టిన కవిత్వం ఆనందాన్నిస్తుంది. అనుభవం నుంచి పుట్టిన కవిత్వం ఆలోచింప చేస్తుంది. మహాకవి గుర్రం జాషువా కవిత్వం ఆద్యంతం అనుభవం నుంచి పుట్టిన అద్భుత సాహిత్యం. ఆయన కవిత్వం సమాజ హితాన్ని కోరుకుంటుంది. సందేశాన్ని అందిస్తుంది, మార్పుని ఆశిస్తుంది. మరీ ముఖ్యంగా కళ్ళముందు కనిపిస్తున్న వివక్షను ప్రశ్నిస్తుంది. గుర్రం జాషువా కలం పట్టిన తొలినాళ్లలో భావ కవిత్వం రాసినప్పటికీ అనతికాలంలోనే జాతీయోద్యమ ప్రభావానికిలోనై, ఆయన కలం పదునెక్కే కొలదీ తెలుగు సాహిత్య ప్రక్రిలన్నిటినీ సృజించింది. ఈ కోవలోనే జాషువా కవిత్వంలో మనకు తాత్విక భావన కనిపిస్తుంది. ఆయనలో గొప్ప తత్వవేత్త కనిపిస్తాడు. స్మశానవాటిక ఖండకావ్యం జాషువా తాత్విక భావనకు ఓ గొప్ప నిదర్శనం. జీవితం చాలా చిన్నదనీ, ఈ వైషమ్యాలూ, వాదవివాదాలూ, కులమత భేదాలూ ఇవన్నీ మరుభూమి బయట ఉన్నంత వరకేననీ స్మశానవాటికలో ప్రతి మనిషీ సమానమేనన్న నగ్నసత్యాన్ని జాషువా వివరిస్తాడు. " ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు.." అన్న జాషువాలో ఎంతటి విశాల భావం, ఎంతటి తాత్విక భావన దాగివుందో అర్థమవుతుంది. " ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా నటనంబు...

" ఎరుకలీ నాగన్న ఉంటుండే.." మనసుకి హత్తుకునే గోరటి పాట

చిత్రం
ఈ పాట మొత్తానికి చివరి పదాలే ప్రాణం పోస్తాయి.పాటంతా విన్నాక చివాలున బాకుతో కుమ్మినట్టు గుండె మెలిపెడుతుంది.పాట మొత్తం ప్రేమను పంచే ఎరుకలి నాగన్నకు చివరిగా మనిషంటే ఎందుకంత భయమో మనకూ అర్థం కాదు. గోరటి వెంకన్న రాసిన "ఎరుకలీ నాగన్న ఉంటుండే.." పాట ఒక్క సారైనా వినాల్సిన పాట.గోరటి వెంకన్న మన గిరిజన సంస్కృతిని మొత్తం ఈ ఒక్క పాటలో ఆవిష్కరించాడు.గిరిజన సంస్కృతి ఎంత గొప్పదో,ఎంత ప్రేమ కలిగిందో,ఎంత అమాయకమైందో,ఎంత ధైర్యం ఉంటుందో ఈ ఒక్క పాట వింటే చాలు,మనకు పూర్తిగా అర్థమైపోతుంది.కేశవరెడ్డి నవల్లో  'సుక్కపంది' అంత గొప్పగా, ముసలివాడంత ప్రేమగా ఈ పాట ఉంటుంది. "బూడిద పిర్రల బుడ్డ గోసి బిర్రుగా నడుముకి ఎగవోసి సెడుగుడు సెడుగుడు అడుగు ఎలుగులెంకటి పిట్ట పరుగు ఎడమ చేతిల ఎదురు బరుగు అడవి దుప్పాలెల్ల తిరుగు.." ఈ ఒక్క చరణం వింటే చాలు ఎరుకలి నాగన్న మన కళ్ళముందు ఠక్కున ప్రత్యక్షం అవుతాడు.ఇలాంటి నాగన్నే ఒకడుండే వాడు కదూ అంటూ కేశవ రెడ్డి అడవిని జయించాడు గుర్తొస్తుంది.ఊరికి దూరంగా, అడవికి దగ్గరగా ఉండే గిరిజన గూడెల్లో ఇలాంటి అమాయక జనాలు ఉంటారు. ఈ పాటలోని ఎరుకలి నాగన్న గుడిసెకి కనీసం తలుపు కూ...

కర్ణన్ - జై భీమ్

చిత్రం
ఈ రెండు సినిమాలూ తమిళ సినిమాలు కావటం, ఈ సంవత్సరంలోనే రావటం, గిరిజన నేపధ్యం ఉన్న కథలే అవడం, ఈ రెండూ ధియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ కావడం పోల్చదగిన యాదృచ్ఛికం.  జైభీమ్, కర్ణన్ సినిమాలను పోల్చుతూ ఏ సినిమా గొప్పదో తేల్చాలని నా ఉద్దేశం కాదు. ఈ ఏడాది మొత్తంలో నేను చూసిన గొప్ప సినిమాలుగా చెప్పాలని మాత్రమే నా ఆలోచన. సత్యజిత్ రే అన్నట్లు సామాన్యుడి జీవితాన్ని సినిమాగా తీయడమే అత్యంత కష్టమైన విషయం. ఇక, అణగారిన వర్గాల చీకటి కోణాలను కళ్ళకు కట్టినట్లు చూపించడం మరింత కష్టం.ఈ కష్టమైన మరో కోణాన్ని నేటి తరం తమిళ యువ దర్శకులు ఎంతో ఇష్టంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు అత్యంత ప్రజాదరణ లభించడమే కాకుండా, IMDb టాప్ రేటెడ్ సినిమాల జాబితాలో దూసుకుపోతున్నాయి. ఈ కోవలోనే జై భీమ్, కర్ణన్ సినిమాలు ఈ ఏడాదిలో నేను చూసిన అత్యంత పవర్ ఫుల్ సినిమాలు. జై భీమ్, కర్ణన్ అనంతర సోషల్ మీడియా చర్చ నా లాంటి వాళ్లకు ఎంతో కొంత నేర్పింది. అందుకే జై భీమ్ చుసి కర్ణన్ చూడని వాళ్లూ, కర్ణన్ చుసి జై భీమ్ చూడని వాళ్లూ, మళ్ళీ రెండు సినిమాలు చుస్తే బాగుంటుందన్నదే నా అభిప్రాయం. ఈ రెండు సినిమా కథల్లోనూ అణగ...

వాగై సూడ వా( మూవీ రివ్యూ )

చిత్రం
వాగై సూడ వా 2011లో  విడుదలైన తమిళ సినిమా.2012 లో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. సహజంగానే, అవార్డు సినిమాల మీద కాస్త ఆసక్తి తక్కువగానే ఉంటుంది. అందుకే వాగై సూడ వా కూడా మన తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. ఈ సినిమాలో సస్పెన్స్ లేదు, థ్రిల్లర్ కాదు. విలన్లు లేరు... ఇవన్నీ లేకుండా సినిమా, అదీ రెండు గంటల సినిమా చూడాలంటే చాలా కష్టమే. కష్టపడుతూ సినిమా చూసే వాళ్ళ కోసం కాదు గానీ, కాస్త ఇష్టంగా.. ఏదైనా కొత్తగా.. మనసుకు హత్తుకునేలా ఉండే కథలు కోరుకునే వారి కోసం వాగై సూడ వా మంచి సినిమా. ఈ సినిమా కోసం అప్పట్లో రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. థియేటర్లలో 12 కోట్లు వసూలు చేసిందంటే సూపర్ హిట్ సినిమా కాక మరేంటి. ఈ సినిమా నేపథ్యం 1960 ప్రాంతం. మారుమూల గ్రామంలో జరిగే కథ. నాగరికతకు దూరంగా విసిరేసినట్లు ఉంటుంది ఆ ఊరు. అక్కడ ఉండే జనాలు మట్టిని నమ్ముకుని   జీవించేవారు.నిజమైన  మట్టి మనుషులు. అక్షరాలు, అంకెలు తెలియని అమాయకులు. అలాంటి ఊరికి కొత్తగా టీచర్ శిక్షణ పొంది మొదటి ఉద్యోగం కోసం ఓ యువకుడు రావడంతో సినిమా ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి రకరకాల మలుపులు...

ప్రభుత్వ బడి నుంచి పరిశోధకుడిగా..

చిత్రం
నేను రాసిన మొదటి సక్సెస్ స్టోరీ ఇది. 2008 నవంబర్ 20 న సాక్షి 'భవిత' లో ప్రచురితమైంది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది పాఠకులు ఈ ఆర్టికల్ చదివారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి, విద్యా వాలంటీర్ గా పనిచేసిన ఓ యువకుడు ప్రతిష్టాత్మకమైన "ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్" లో పరిశోధన చేసే స్థాయికి ఎలా ఎదిగాడు అనేదే ఈ సక్సెస్ స్టోరీ.. పూర్తి కథనం... లక్ష్యం స్పష్టంగా ఉన్నచోట విజయం ఉంటుంది. దీనికి ఉదాహరణ కొండపల్లి వెంకట లక్ష్మీవీరనారాయణాచారి. అతని పేరు లాగే అతని లక్ష్యాలు కూడా చాలా పెద్దవి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామానికి చెందిన నారాయణ విద్యా వాలంటీర్ గా పనిచేసినా, డీఎస్సీ లో టీచర్ గా ఎంపికైనా, బార్క్ లో సైంటిస్ట్ గా ఉద్యోగం వచ్చినా, ఇవేమీ అతనికి తృప్తిని ఇవ్వలేదు. అందరిలో ఒకడిలా కాకుండా అందరికీ ఉపయోగపడాలని సంకల్పించాడు. తన మీద తనకు ఉన్న నమ్మకంతో అనుకున్నది సాధించడానికి నడక మొదలు పెట్టాడు. ఓ మారుమూల గ్రామం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్సీలో పి.హెచ్.డి చేసే స్థాయి వరకు ఎదిగాడు. నడిచే దారిలో మైలురాళ్ళు అతనికి నవ్వే పువ్వుల్లా స్వాగతం పలికాయి. ఇండి...

ఏపీసెట్ తెలుగు కటాఫ్ - విశ్లేషణ

చిత్రం
రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటు ఏపీసెట్-2021 అధికారిక వెబ్ సైట్ లో వివిధ సబ్జెక్టుల కటాఫ్ మార్కులు పొందుపరిచారు.డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా నియామకం పొందాలంటే ఏపీసెట్ లేదా యూజీసి-నెట్ అర్హత సాధించాలన్న విషయం తెలిసిందే. తెలుగు సాహిత్యంలో కటాఫ్.. తెలుగు సబ్జెక్టు కటాఫ్ మార్కులను పరిశీలిస్తే..ప్రతి ఏడాది పరీక్ష కూడా కఠినంగా మారుతున్న విషయం అర్థమవుతుంది. పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య పెరుగడంతో పోటీ తీవ్రత కూడా పెరుగుతూనే ఉంది.సబ్జెక్టు లో పూర్తి పట్టు సాధించిన వాళ్ళే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఏపీసెట్-2021 కటాఫ్ మార్కులను పరిశీలిస్తే.... అన్ రిజర్విడ్ కేటగిరీలో 48.00 పర్సెంట్ సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు. పోయిన ఏడాది ఏపీసెట్ పరీక్షలో అన్ రిజర్వడ్ కేటగిరీలో46 శాతం అర్హత ఉంది. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రెండు శాతం అర్హత మార్కులు పెరిగాయి.అలాగే ఇప్పటి ఏపీసెట్ లో బిసి- ఏ (43.33), బిసి- బి (44.67), బిసి- సి(44.67), బిసి-డి (44.00), బిసి- ఈ (44.00) అర్హత సాధించారు.ఇక ఎస్సి లో 41.33, ఎస్టీ లో 38.67, ఈడబ...

చివరి కొమ్మ ఎక్కడం చాలా కష్టం. కానీ, పండు అక్కడే ఉంటుంది.

చిత్రం
 

మనిషిగా జీవించి మరణాన్ని జయించు (పుస్తక సమీక్ష)

చిత్రం
"గొప్ప పనులంటూ ఏవీ లేవు. అన్నీ గొప్ప  ప్రేమతో చేసిన చిన్న పనులే " - మదర్ థెరెసా "మనిషిగా జీవించి మరణాన్ని చేయించు" అనే పుస్తకం ప్రఖ్యాత రచయిత రాబిన్ శర్మ రాసిన మంచి పుస్తకం. ఈ చిన్న పుస్తకాన్ని రెండు మూడు గంటల్లో ఆసాంతం చదివేయవచ్చు. ఇలా ఏకబిగిన ఈ పుస్తకాన్ని చదివే క్రమంలో... "మన జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే శక్తి కొన్ని 'పదాల్లో' ఉండవచ్చు" అనే ప్రఖ్యాత తత్వవేత్త హెన్రీ డేవిడ్ దోరో మాటలు మనకి కనిపిస్తాయి. పుస్తకాలకు.. పుస్తక పఠనానికి ఉన్న గొప్ప శక్తి  ఈ పుస్తకాన్ని చదివిన తరువాత మనకి పూర్తిగా అర్థమవుతుంది. చాలా పుస్తకాలు మనం అలా చదివి ఇలా పక్కన పెడుతూ ఉంటాం. అందులోని సారాన్ని అప్పటికప్పుడు ఆస్వాదిస్తాం. కొన్ని సందర్భాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ, ఈ పుస్తకం పక్కన పెట్టేసే పుస్తకం కానేకాదు. ఒకసారి చదివిన తర్వాత మన వ్యక్తిత్వాన్ని మనం అద్దంలో చూసుకున్నట్లుగా ఉంటుంది. మళ్లీ ఈ పుస్తకాన్ని చదువుతాం. మళ్లీ ..మళ్లీ.. చదువుతూనే ఉంటాం. చదువుతూ.. నేర్చుకుంటూ.. మనల్ని మనం పోల్చుకుంటూ.. మనల్ని మనం మార్చుకుంటూ.. మెరుగైన జీవితాన్ని జీవించటా...

పీలే: బర్త్ ఆఫ్ ఎ లెజెండ్

చిత్రం
మంచి సినిమా మంచి పుస్తకం లాంటిది. ఓ మంచి పుస్తకాన్ని చదివినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో మంచి సినిమా చూసినప్పుడూ అలాంటి అనుభూతే చెందుతాం. ఈ మధ్య ఓ సివిల్స్ విజేత "తానెప్పుడూ మంచి సినిమాలు చూస్తుంటాననీ, వాటిని వివిధ కోణాల్లో విశ్లేషించడం ద్వారా వచ్చిన పరిజ్ఞానం సివిల్స్ పరీక్షల్లో ఉపయోగపడిందని" చెప్పారు. మంచి సినిమాలు ప్రతి ఒక్కరూ చూడడం చాలా మంచిదే. చరిత్రలో నిజ జీవిత విజేతల సినిమాలు అస్సలు మిస్ కాకూడదు. ఇలాంటి, మనం మిస్ కాకూడని మంచి సినిమాల జాబితాలో ముందు వరసలో ఉండదగ్గ సినిమా "పీలే: బర్త్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌". 2016లో ఇంగ్లీష్ వెర్షన్లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ మూవీ.              పీలే.. అంటే ఓ క్రీడా చరిత్ర. పీలే అంటే.. కోట్ల మంది సాకర్ ప్రేమికుల ఆరాధ్య దైవం. పీలే.. అంటే పేదరికాన్ని బద్దలు కొట్టి ఫుట్ బాల్ సామ్రాజ్యాన్ని అతి చిన్న వయసులోనే ఎలిన సాకర్ చక్రవర్తి. ఇలాంటి గొప్ప ఫుట్ బాల్ క్రీడా దిగ్గజం నిజ జీవితాన్ని తెర మీద చూడటం మంచి అనుభూతిని ఇస్తుంది.1958 ప్రపంచ కప్ ఫుట్ బాల్ క్రీడల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అంతకు ముందెప్పుడూ ప్రపంచ కప్ విజేతగా ని...